Miss Telugu USA 2025: ‘మిస్ తెలుగు యూఎస్‌ఏ–2025’ ఫైనల్లో చోటు సంపాదించిన ‘గీతిక’
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని బొనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ప్రముఖ ‘మిస్ తెలుగు యూఎస్‌ఏ – 2025’ పోటీలో ఫైనల్‌కు చేరింది.

అమెరికాలో స్థిరపడిన, చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలుగు భాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి, జీవన విధానం, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ, అభినయం, సంగీతం, మేధస్సు తదితర అంశాలతో విజేతను ఎంపిక చేయనుండగా గీతిక ఫైనల్స్‌కు చేరింది.
మే 25వ తేదీ గ్రాండ్ ఫినాలే డల్లాస్‌లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. గీతిక.. ముష్టికుంట్లకు చెందిన పిల్లలమర్రి శివనర్సింహారావు, మాధవి దంపతుల పెద్ద కుమార్తె. ఈమె ప్రాథమిక విద్యను ఖమ్మంలో, బీటెక్ చెన్నైలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని సిన్సినాటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది.
Published date : 22 Mar 2025 03:07PM