Indian Origins: కెనడా కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి మహిళలు

అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలు మార్చి 14వ తేదీ మార్క్ కార్నీతోపాటు ప్రమాణ స్వీకారం చేశారు. కెనడా పార్లమెంట్‌కు ఎన్నికైన అతి పిన్న వయస్సులైన మహిళల్లో కమల్ ఖేరా సైతం ఉన్నారు. 58 ఏళ్ల అనితా ఆనంద్‌కు ఆవిష్కరణలు, శాస్త్ర, వాణిజ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. 36 ఏళ్ల కమల్ ఖేరాను ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
కాగా.. ఢిల్లీలో పాఠశాల విద్యనభ్యసిస్తున్న కాలంలో కమల్ కుటుంబం కెనడాకు తరలిపోయారు. టొరంటోలో యార్క్ వర్సిటీలో కమల్ సైన్స్ డిగ్రీ సాధించారు. నర్సుగా, కమ్యూనిటీ వలంటీర్‌గా, రాజకీయ కార్యకర్తగా మొదలెట్టి చివరకు మంత్రిస్థాయికి కమల్ ఎదిగారు.
నోవా స్కాటియాలో పుట్టిన అనిత 1985లో ఒంటారియోకు వలసవచ్చారు. లాయర్, పరిశోధకురాలు, అధ్యాపకురాలు అయిన అనిత 2019లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. గతంలో ట్రెజరీ బోర్డ్ అధ్యక్షురాలిగా, రక్షణ మంత్రిగా, ప్రజాసేవలు, సేకరణ మంత్రిగా సేవలందించారు.