Ropeway Tourism: తెలంగాణలో రోప్‌వే ప్రాజెక్టులు.. వీటి అభివృద్ధికి రూ.56.81 కోట్ల వ్యయం

భువనగిరి కోట, గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక స్థలంగా ఉంది. ఈ కోటకు శతాబ్దాల చరిత్ర ఉన్నది. స్వదేశీదర్శన్ 2.0 పథకం కింద రూ.56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనుంది.
రోప్‌వే ప్రాజెక్టు:
భువనగిరి కోటపైకి చేరుకోవడం కోసం ప్రస్తుతం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది, కానీ రోప్‌వే ఏర్పాటు ద్వారా పర్యాటకులు మెట్లు ఎక్కే కష్టాలను నివారించగలుగుతారు. హైదరాబాద్-వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు 1 కిలోమీటరు దూరం వరకు రోప్‌వే ప్రస్థానం ఏర్పాటు చేయబడుతుంది. ఇది రాష్ట్రంలో తొలి రోప్‌వే ప్రాజెక్టుగా గుర్తింపు పొందనుంది. కోటపై ఉన్న నీటి కొలను, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ప్రవేశద్వారం, రోడ్లు మరియు పార్కింగ్ వంటి సదుపాయాలను కూడా అభివృద్ధి చేయబడుతుంది.
Morgan Stanley: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఇతర రోప్‌వే ప్రాజెక్టులు:
రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో కూడా రోప్‌వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలియజేశారు.
- యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం (2 కి.మీ)
- నల్గొండ హనుమాన్ కొండ (2 కి.మీ)
- నాగార్జునసాగర్ ఆనకట్ట (5 కి.మీ)
- మంథని రామగిరి కోట (2 కి.మీ)
ప్రాజెక్టు వ్యయం వివరాలు..
- రోప్‌వే: రూ.15.20 కోట్లు
- యాక్సెస్‌రోడ్డు & పార్కింగ్: రూ.10.73 కోట్లు
- ప్రవేశద్వారం & టూరిజం సదుపాయాలు: రూ.10.37 కోట్లు
- చారిత్రక కట్టడాల పునరుద్ధరణ: రూ.9.40 కోట్లు
- ఇతర ఏర్పాట్లు: రూ.11.11 కోట్లు
ప్రధాన ప్రయోజనాలు:
- పర్యాటకులకు రోప్‌వే ప్రయాణం ద్వారా మెట్లు ఎక్కే కష్టాలను నివారించవచ్చు.
- చారిత్రక కోటలు, ఇతర ప్రదేశాలలో పర్యాటక సదుపాయాలు మెరుగుపడతాయి.
- రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతాయి.
Oilfields Amendment Bill: చమురు క్షేత్రాల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
దీనికి సంబందించిన ప్రశ్నలు, సమాదానాలు..
1. భువనగిరి కోటలో రోప్‌వే ఏర్పాటుకు పర్యాటక అభివృద్ధి సంస్థ ఎంత వ్యయం నిధులను ఆమోదించింది?
A) రూ.56.81 కోట్లు
B) రూ.15.20 కోట్లు
C) రూ.10.73 కోట్లు
D) రూ.9.40 కోట్లు
✅ జవాబు: A) ₹56.81 కోట్లు
2. భువనగిరి కోటకు రోప్‌వే ప్రాజెక్టు ద్వారా పర్యాటకులకు ఏ సదుపాయం అందించబడుతుంది?
A) ట్రెక్కింగ్ సౌకర్యం
B) మెట్లు ఎక్కే కష్టాలు
C) రోప్‌వే ప్రయాణం
D) పార్కింగ్ లేదు
✅ జవాబు: C) రోప్‌వే ప్రయాణం
3. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వరకు రోప్‌వే దూరం ఎంత?
A) 1 కి.మీ
B) 2 కి.మీ
C) 3 కి.మీ
D) 5 కి.మీ
✅ జవాబు: B) 2 కి.మీ
4. భారత రాష్ట్రంలో మొదటి రోప్‌వే ఎక్కడ ఏర్పాటవుతుంది?
A) యాదగిరిగుట్ట
B) భువనగిరి కోట
C) నాగార్జునసాగర్
D) మంథని రామగిరి కోట
✅ జవాబు: B) భువనగిరి కోట
5. భువనగిరి కోట ప్రాజెక్టు కోసం అభివృద్ధి చేయబడతున్న నిర్మాణాలు ఏమిటి?
A) నీటి కొలువు
B) చారిత్రక కట్టడాల పునరుద్ధరణ
C) ప్రవేశద్వారం
D) పైవన్నీ
✅ జవాబు: D) పైవన్నీ
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- First Ropeway Project in Telangana
- Bhuvanagiri Fort
- boost tourism
- Telangana Ropeway
- Swadesh Darshan 2.0
- Yadagirigutta Ropeway
- Historic Forts in Telangana
- Tourism Development
- Sakshi Education News
- Latest News in Telugu
- Historical sites in Telangana
- Ropeway tourism in Telangana
- Telangana tourism project