Skip to main content

First Day Absentees : తొలిరోజే విద్యార్థుల‌కు తీవ్ర ఇబ్బందులు.. 638 మంది గైర్హాజ‌రు..

జిల్లావ్యాప్తంగా తొలిరోజు జరిగిన పదో తరగతి తెలుగు పరీక్షకు 31,169 మంది విద్యార్థులకు గాను 30,531 మంది హాజరయ్యారు.
First day absentees for ap 10th board exams 2025

అనంతపురం: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 31,169 మంది విద్యార్థులకు గాను 30,531 మంది హాజరయ్యారు. 638 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 30 కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశారు. ఏడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. డీఈఓ ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌, డీవైఈఓ శ్రీనివాసరావు వివిధ కేంద్రాలను పరిశీలించారు.

Invigilator Suspend : త‌ప్పుడు పేప‌ర్ రాసిన విద్యార్థిని.. ఇన్విజిలేట‌ర్ స‌స్పెండ్‌..

వసతుల్లేక ఇబ్బందులు..

అనంతపురం నగరంలోని నంబర్‌–1 ఉన్నత పాఠశాల కేంద్రంలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా గదులు కనీసం శుభ్రం చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. జిల్లాలో పరీక్షల నిర్వహణపై ఆర్జేడీ శామ్యూల్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లలో గుబులు పట్టుకుంది.

Students Debar : ఏపీ బోర్డ్ ప‌రీక్ష‌లు ప్రారంభం.. తొలి రోజే ఇద్ద‌రు డీబార్..

దీనికితోడు సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏ కేంద్రాలకు వెళ్లాలనేది ఆర్జేడీ పర్యవేక్షణలో జరుగుతోంది. ఈ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ విధుల్లో ఉన్న టీచర్ల నుంచి వ్యక్తమవుతోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Mar 2025 04:23PM

Photo Stories