Skip to main content

Half Day Schools for Anganwadi : మండిపోతున్న ఎండ‌లు.. వ‌చ్చేనెల నుంచి అంగ‌న్వాడీల‌కూ ఒంటిపూట..!!

ఏప్రిల్‌, మే నెల‌ల్లో ప్రారంభం కావాల్సిన ఎండ‌లు మార్చి నెల‌లోనే మండిపోతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు ఉష్ణోగ్రతలను తాళలేక అల్లాడుతున్నారు.
AP anganwadi schools to run half day from april 1st  Telangana Anganwadi schedule

అమరావతి: ఏప్రిల్‌, మే నెల‌ల్లో ప్రారంభం కావాల్సిన ఎండ‌లు మార్చి నెల‌లోనే మండిపోతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు ఉష్ణోగ్రతలను తాళలేక అల్లాడుతున్నారు. తక్షణమే అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఈ నెల 15 నుంచి మే 31వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ బడులను ఒంటిపూట నిర్వహిస్తున్నారు.

మన రాష్ట్రంలో మాత్రం ఈ విషయమై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి వాటిని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

Half Day Schools Timings : ఒంటిపూట బడుల స‌మ‌యంలో మార్పులు.. ఇక‌నుంచి..

తక్షణ నిర్ణయానికి పేరెంట్స్‌ డిమాండ్‌

అంగన్‌వాడీ కేంద్రాలకు వెళుతున్న చిన్నారులు మండే ఎండల్లో సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉండాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం ఈ అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ బడుల మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట నిర్వహించే విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

NEET PG 2025 Exam Date Declared: బ్రేకింగ్‌ న్యూస్‌.. NEET PG పరీక్షపై బిగ్‌ అప్‌డేట్‌.. పరీక్ష తేదీ విడుదల

కాగా.. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు సైతం ఇవ్వకుండా పిల్లలకు సేవలు కొనసాగించేలా ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు ఒంటిపూట నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడకుండా వర్కర్లకు, హెల్పర్లకు 15 రోజుల చొప్పున వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తోంది. మే 1 నుంచి 15 వరకు వర్కర్లకు, మే 16 నుంచి 31 వరకు హెల్పర్లకు సెలవులు ఇచ్చే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Mar 2025 03:08PM

Photo Stories