Students Debar : ఏపీ బోర్డ్ పరీక్షలు ప్రారంభం.. తొలి రోజే ఇద్దరు డీబార్..

అమరావతి: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం.. మార్చి 17వ తేదీన మొదటి పరీక్ష (లాంగ్వేజ్) నిర్వహించగా, అందులో ఎలాంటి లోటు లేకుండా ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు చాలావరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండానే చూస్కున్నామని చెప్పుకొచ్చారు.
Half Day Schools for Anganwadi : మండిపోతున్న ఎండలు.. వచ్చేనెల నుంచి అంగన్వాడీలకూ ఒంటిపూట..!!
ఇక, రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా 6,16,451 మంది అంటే, 98.27 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షను ఏపీలో మొత్తం 3,450 కేంద్రాల్లో నిర్వహించగా.. 1,545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయని ఆయన వివరించారు.
తొలిరోజే డిబార్..
విద్యార్థులు ప్రతీ పరీక్షకు హాజరు కావాలని, ఎలాంటి కారణాలతోనూ పరీక్షను మానరాదని హాజర శాతం చూసి అధికారులు హెచ్చరించారు. పరీక్షలను నిర్వహించే పరిధిలో విద్యార్థులకు, నిర్వహించే కేంద్రాల్లో ఎలాంటి లోటు ఉండరాదని, పరీక్షలు పూర్తి చేసుకునేవరకు ప్రతీ ఏర్పాట్లను పరిశీలిస్తూనే ఉండాలని అధికారులకు ఆదేశించారు విద్యాశాఖ. ఇక, కర్నూలు జిల్లాలోని ఒక పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. తొలి రోజే విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు అధికారులు. దీంతో, వారిని డిబార్ చేశారని వెల్లడించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap tenth board exams 2025
- ap tenth board students
- present percentage of 10th students for board
- two students debar
- exam centers in ap for board exams
- ap tenth students debar on first day
- ap tenth exams first day attendance
- tenth board exams first day updates
- 10th board exams updates in ap
- first day students debar news in ap
- ap tenth students debar news in telugu
- first day debar news
- ap 10th board exam first day attendance
- Education News
- Sakshi Education News