Skip to main content

10th Class Time Table: మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. టైం టేబుల్‌లో స్వల్ప మార్పు!

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలకు సంబంధించి 2024 - 25 విద్యా సంవత్సరానికి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలయ్యింది. మార్చి నెలలో టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
Public examinations schedule announcement from March 17th to April 1st   AP 10th Class Exam Time Table 2025  Exam schedule from March 17th to April 1st 2025  Department of Education public exam dates and timings

ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 17వ తేదీ నుండి ఏప్రియల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2025 | బ్లూ ప్రింట్ 2025 | టెక్స్ట్ బుక్స్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్

టెన్త్ 2025 పబ్లిక పరీక్షల పూర్తి షెడ్యూల్‌

  • మార్చి 17, 2025 (సోమవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌ 1 పరీక్ష
  • మార్చి 19, 2025 (బుధవారం) సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్ష
  • మార్చి 21, 2025 (సోమవారం) ఇంగ్లిష్‌ పరీక్ష
  • మార్చి 22, 2025 (శుక్రవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌ 2, -OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
  • మార్చి 24, 2025 (సోమవారం) మ్యాథమెటిక్స్‌ పరీక్ష
  • మార్చి 26, 2025 (బుధవారం) ఫిజికల్‌ సైన్స్ పరీక్ష
  • మార్చి 28, 2025 (శుక్రవారం) బయోలాజికల్‌ సైన్స్‌ పరీక్ష
  • మార్చి 29, 2025 (శనివారం) OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, SSC ఒకేషన్‌ కోర్సు..
  • మార్చి 31 లేదా ఏప్రిల్ 1, 2025 (సోమవారం లేదా మంగళవారం) సోషల్‌ స్టడీస్‌ పరీక్ష

మార్చి 31వ తేదీన రంజాన్‌ సెలవు దినంగా ప్రభుత్వ కేలండర్‌లో ఉంది. నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్‌ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండగ వస్తే ఏప్రిల్‌ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Published date : 29 Jan 2025 03:03PM

Photo Stories