10th Class Students: వినూత్న విద్యా కార్యక్రమం.. రోజుకో విందు భోజనం..

రోజుకో విందు భోజనంతో పదో తరగతి పిల్లలకు అదనపు విద్యా బోధన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశలో మరెక్కడా లేనివిధంగా టీచర్లు, అమ్మానాన్నలు ఏకమై సమన్వయంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరెన్నో సర్కారీ బడులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఆశయానికి తగ్గట్టే ఈ పిల్లలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
విశాఖ నగరంలోని ప్రకాశరావుపేట జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలు మిగతా హైస్కూళ్లకంటే ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే అక్కడ పదో తరగతి విద్యార్థుల కోసం టీచర్లు పడుతున్న తపన, వారికి మేము సైతం అంటూ తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం ఆ స్కూలుకు అలాంటి గుర్తింపును తెచ్చిపెట్టింది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2025 | బ్లూ ప్రింట్ 2025 | టెక్స్ట్ బుక్స్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
ఏ బడిలోనైనా పదో తరగతి పరీక్షల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తమ స్కూలు పిల్లలు టెన్త్ ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించాలని ఉపాధ్యాయులు కోరుకుంటారు. తమ బిడ్డలు మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు ఆశ పడతారు.
రోజుకో విందు భోజనంతో విద్యా బోధన!
తొలుత 2022 కోవిడ్ సమయంలో ఓ దాత టెన్త్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ అందించారు. 2023లో అన్నమ్మ అనే మరో దాత, టీచర్లు కలిసి పండ్లు, బిస్కట్లు, అప్పుడప్పుడు అల్పాహారం ఇచ్చేవారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షల మార్చి 30 వరకు సాయంత్రం/ రాత్రి వేళ వంద రోజుల పాటు తామే భోజనం సమకూరుస్తామని తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఈ స్కూలులో ఈ ఏడాది 88 మంది టెన్త్ పరీక్షలకు సిద్దమవుతున్నారు. రోజుకొకరు చొప్పున ఈ పిల్లలకు సాదాసీదా భోజనం కాదు.. విందు భోజనం అందిస్తున్నారు.
![]() ![]() |
![]() ![]() |
