Health Educator Jobs: ‘హెల్త్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు విరితోనే భర్తీ చేయాలి'
Sakshi Education
సాక్షి, అమరావతి: వైద్యశాఖలోని హెల్త్ ఎడ్యు కేటర్ పోస్టులను పీజీ డిప్లొమో ఇన్ హెల్త్ ప్రమో షన్ ఎడ్యుకేషన్ (పీజీడీపీహెచ్పీఈ) విద్యార్హత కలిగిన ఎంపీహెచ్ఎస్/ఎంపీహెచ్ఎలతో భర్తీ చేయాలని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ పద్మావతిని ఏపీ స్టేట్ హెల్త్ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు.

ఈ మేరకు ఫిబ్రవరి 20న గొల్ల పూడిలో పద్మావతికి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రమణ, కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షురాలు అనురాధ వినతిపత్రం అందజేశారు. జోనల్ వారీగా డీఎంహెచ్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న డెప్యూటీ డెమో పోస్టులను సీనియారిటీ ఆధారం గా హెల్త్ ఎడ్యుకేటర్స్ భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
>> Hyderabad Jobs: బీబీనగర్ ఎయిమ్స్‌లో 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
ఇన్ సర్వీస్లో హెల్త్ ఎడ్యుకేషన్ కోర్సు చదివి ఎడ్యుకేటర్స్ గా పదోన్నతి లభించని ఎంపీహెచ్ఎస్/ ఎంపీహెచ్ఎల పరిజ్ఞానాన్ని, సేవల ను వినియోగించుకోవాలని కోరారు.
![]() ![]() |
![]() ![]() |

Published date : 21 Feb 2025 10:54AM