Skip to main content

కేంద్రంలో డాక్టర్‌ ఉద్యోగం.. UPSC CMS 2025 నోటిఫికేషన్, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడ్!

ఎంబీబీఎస్‌ పూర్తి చేసారా? మెడికల్‌ పీజీ లేకుండా స్టేబుల్‌ కెరీర్‌ & హై సాలరీతో ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారా? యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CMS 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ₹56,100 – ₹1,77,500 పే స్కేల్‌తో కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
UPSC CMS 2025 Notification   Doctor Job Exam procedure and preparation like   Government Job Opportunities for MBBS Graduates

UPSC CMS 2025 – పోస్టులు & విభాగాలు

మొత్తం ఖాళీలు : 705
కేటగిరీ 1: సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ – 226 పోస్టులు
 కేటగిరీ 2:

  • రైల్వేస్‌లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ – 450 పోస్టులు
  • న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ – 9 పోస్టులు
  • ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2) – 20 పోస్టులు

UPSC CMS 2025 అర్హతలు

  • చదువు: ఎంబీబీఎస్‌ పూర్తి లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు: ఆగస్ట్‌ 1, 2025 నాటికి 32 ఏళ్లు మించకూడదు (SC/ST: 5 ఏళ్లు, OBC: 3 ఏళ్లు వయస్సు సడలింపు).

UPSC CMS 2025 ఎంపిక విధానం

  • స్టేజ్ 1: రాత పరీక్ష (పేపర్ 1 & పేపర్ 2) – 500 మార్కులు
  • స్టేజ్ 2: పర్సనాలిటీ టెస్ట్ – 100 మార్కులు

ఫైనల్ మెరిట్ లిస్ట్ రాత పరీక్ష + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు.

చదవండి: స్ట్రెస్‌ను దూరం చేసే సైకాలజిస్టు.. అవ్వాలంటే మార్గాలు ఇవే..!

UPSC CMS 2025 పరీక్ష విధానం

పేపర్ 1 – జనరల్ మెడిసిన్ & పిడియాట్రిక్స్ (250 మార్కులు)

జనరల్ మెడిసిన్ – 96 ప్రశ్నలు
పిడియాట్రిక్స్ – 24 ప్రశ్నలు
పేపర్ 2 – సర్జరీ, గైనకాలజీ & సోషల్ మెడిసిన్ (250 మార్కులు)

సర్జరీ – 40 ప్రశ్నలు
గైనకాలజీ & ఆబ్‌స్టెట్రిక్స్ – 40 ప్రశ్నలు
ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ – 40 ప్రశ్నలు
నెగెటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి 1 మార్క్‌ కోత ఉంటుంది.

UPSC CMS 2025 వేతనం & ఉద్యోగ భద్రత

ప్రారంభ వేతనం: ₹56,100 – ₹1,77,500 (పే స్కేల్)
అనుభవం పెరిగేకొద్దీ ప్రమోషన్స్ & హయ్యర్ పే స్కేల్
ప్రొబేషన్ పీరియడ్ – రైల్వేస్‌లో 1 సంవత్సరం, ఇతర విభాగాల్లో 2 సంవత్సరాలు

UPSC CMS 2025 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చివరి తేది: మార్చి 11, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: మార్చి 12 – 18, 2025
CMS 2025 పరీక్ష తేది: జూలై 20, 2025
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

వివరాలకు అధికారిక వెబ్‌సైట్: www.upsc.gov.in

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

UPSC CMS రాత పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కోసం ప్రిపరేషన్ స్ట్రాటజీ

UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) రాత పరీక్ష లో అధిక స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు సబ్జెక్ట్-వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ రూపొందించుకోవాలి. పేపర్-1 & పేపర్-2 కోసం ముఖ్యమైన టాపిక్స్, ప్రిపరేషన్ టిప్స్, సమకాలీన ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాల్సిన అంశాలు ఇక్కడ వివరంగా అందిస్తున్నాం.

UPSC CMS 2025 – పేపర్ 1 ప్రిపరేషన్ (జనరల్ మెడిసిన్ & పిడియాట్రిక్స్)
ఇంపార్టెంట్ టాపిక్స్:
జనరల్ మెడిసిన్:

  • కార్డియాలజీ (హార్ట్ డిసీజెస్)
  • రెస్పిరేటరీ డిసీజెస్ (ఆస్తమా, ట్యూబర్‌కులోసిస్)
  • గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్
  • జెనిటో యురినరీ & న్యూరాలజీ
  • హెమటాలజీ (అనీమియా, బ్లడ్ డిసార్డర్స్)
  • ఎండోక్రినాలజీ (డయాబెటిస్, థైరాయిడ్ డిసార్డర్స్)
  • మెటబాలిక్ & కమ్యూనికబుల్ డిసీజెస్
  • డెర్మటాలజీ, మస్కులో-స్కెలిటల్ డిసీజెస్
  • మానసిక ఆరోగ్య సమస్యలు (సైకియాట్రీ)

పిడియాట్రిక్స్ (పిల్లల ఆరోగ్య శాస్త్రం):

  • కామన్ చైల్డ్ హుడ్ ఎమర్జెన్సీస్
  • న్యూబార్న్ కేర్ & ఇన్ఫెక్షన్లు
  • డెవలప్‌మెంటల్ మైల్స్‌స్టోన్స్
  • ఇమ్యునైజేషన్ & వ్యాక్సీన్స్

ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల ఆరోగ్య సంరక్షణ

టిప్స్:

  • ప్రీవియస్ ఇయర్ ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల ధోరణిని అర్థం చేసుకోవాలి.
  • MCQs ప్రాక్టీస్ చేయడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ మెరుగుపర్చుకోవాలి.
  • మెడికల్ టెర్మినాలజీ, వ్యాధుల లక్షణాలు & ట్రీట్‌మెంట్ ప్రాసెస్‌పై ఫోకస్ చేయాలి.

UPSC CMS 2025 – పేపర్ 2 ప్రిపరేషన్ (సర్జరీ, గైనకాలజీ & సోషల్ మెడిసిన్)
ఇంపార్టెంట్ టాపిక్స్:

సర్జరీ:

  • జనరల్ సర్జరీ (గాయాలు, కాలేయం, రక్తనాళాలు, పేగులు, కణితులు)
  • యూరాలజీ & న్యూరో సర్జరీ
  • ఈఎన్‌టీ సర్జరీ, థొరాసిక్ సర్జరీ
  • ఆర్థోపెడిక్ & ఆఫ్తల్మాలజీ
  • అనస్థీసియాలజీ & ట్రామటాలజీ

గైనకాలజీ & ఆబ్‌స్టెట్రిక్స్:

  • అప్లయిడ్ అనాటమీ & ఫిజియాలజీ
  • గర్భాశయ సంబంధిత వ్యాధులు
  • జనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు
  • ఫ్యామిలీ ప్లానింగ్ – కాంట్రాసెప్టివ్స్ (ఓరల్ పిల్స్, యూడీ)
  • ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ మెథడ్స్

ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ (PSM):

  • పబ్లిక్ హెల్త్ & కమ్యూనిటీ మెడిసిన్
  • డిసీజ్ ప్రివెన్షన్ & హెల్త్ స్టాటిస్టిక్స్
  • ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ & ఆక్యుపేషనల్ హెల్త్
  • మెటర్నల్ & చైల్డ్ హెల్త్
  • నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ (ఆయుష్మాన్ భారత్, TB ఎRADICATION ప్రోగ్రామ్)

టిప్స్:

  • సర్జరీ & గైనకాలజీ విభాగాల్లో అత్యధిక వెయిటేజ్ ఉండే టాపిక్స్‌పై ప్రాధాన్యత ఇవ్వాలి.
  • హెల్త్ అండ్ డిసీజ్ ట్రెండ్స్ గురించి తాజా సమాచారం తెలుసుకోవాలి.
  • నేషనల్ & ఇంటర్నేషనల్ హెల్త్ పాలసీస్, WHO గైడ్లైన్స్, UN నివేదికలను రివైజ్ చేసుకోవాలి.

సమకాలీన ఆరోగ్య సమస్యలు – మెయిన్ ఫోకస్ ఏరియాస్

కోవిడ్-19 & ఇతర మహమ్మారులు:

  • కోవిడ్‌ వ్యాక్సీన్లు & క్లినికల్ ట్రయల్స్
  • ప్రపంచవ్యాప్తంగా మహమ్మారుల ప్రభావం
  • WHO, UN & ఇండియన్ గవర్నమెంట్ నివేదికలు

ఇండియాలో వైద్య రంగం – నూతన సంస్కరణలు:

  • జన ఆరోగ్య మిషన్ (NHM)
  • మెడికల్ ఎడ్యుకేషన్ & నూతన వైద్య విధానాలు
  • టెలీమెడిసిన్, AI-బేస్డ్ డయాగ్నోస్టిక్స్

రివిజన్ & మాక్ టెస్ట్స్

  • ప్రిపరేషన్ స్ట్రాటజీని బలపరచడానికి డైలీ రివిజన్ & వీక్లీ మాక్ టెస్ట్స్ నిర్వహించాలి.
  • పది సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాధన చేయాలి.
  • టైమ్ మేనేజ్‌మెంట్ పెంచేందుకు నెగటివ్ మార్కింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి.

ఫైనల్ టిప్స్ – UPSC CMS 2025లో హై స్కోర్ సాధించేందుకు

  • స్ట్రాంగ్ కన్సెప్ట్ క్లారిటీ: థియరీ & క్లినికల్ అప్లికేషన్ సమతుల్యం చేయాలి.
  • మాల్టిపుల్ రివిజన్: ముఖ్యమైన టాపిక్స్‌పై మల్టిపుల్ రివిజన్ చేయాలి.
  • మాక్ టెస్ట్స్ & టైమ్ మేనేజ్‌మెంట్: అంచనా పరీక్షలు రాస్తూ టైమ్ మేనేజ్‌మెంట్ మెరుగుపర్చుకోవాలి.
  • అప్‌డేటెడ్ మెడికల్ జర్నల్స్ చదవాలి: WHO & ఇతర మెడికల్ ఆర్గనైజేషన్స్ నివేదికలను ఫాలో కావాలి.
Published date : 04 Mar 2025 09:10AM

Photo Stories