5th Class & Inter Admissions: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలోని డా.బీఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీసీఓ గీత తెలిపారు. ఫిబ్రవరి 14న ఆమె విలేకరులతో మాట్లాడారు.

2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు మార్చి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఏవైనా సందేహాలకు చిత్తూరు 97045 50109, జీడీ నెల్లూరు 99892 11885, పలమనేరు 94933 71732, కుప్పం 99598 88586, రామకుప్పం 97045 50107, పూతలపట్టు 70327 03758, విజలాపురం 96667 27126 నంబర్‌లలో సంప్రదించాలని కోరారు.
![]() ![]() |
![]() ![]() |

Published date : 15 Feb 2025 10:25AM