Skip to main content

Admission in 5th class: తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష ఇలా‌..

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీజీఆర్‌ఈఐఎస్‌).. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బాలబాలికలు నుంచి దరఖాస్తులు కోరుతోంది. గురుకులాల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.
Telangana Gurukul Class 5 Admissions 2025  Telangana Social Welfare Gurukul Vidyalaya Sanstha admission announcement for Class V 2025-26  Entrance examination for Gurukuls admission in Telangana for the academic year 2025-26   Applications invited for BC, SC, ST students for Class V admission in Gurukuls  Gurukuls entrance exam for boys and girls admission to Class V (English Medium) in Telangana

అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగో తరగతి 2024–25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం రూ.­1,50,000, పట్టణ ప్రాంతం రూ.2,00,000 మించకూడదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో నిర్వహిస్తారు. తెలుగు (20 మార్కులు), ఇంగ్లిష్‌ (25 మార్కులు), గణితం (25 మార్కులు), మెంటల్‌ ఎబిలిటీ (10 మార్కులు), పరిసరాల విజ్ఞానం (20 మార్కులు) సబ్జెక్టుల నుంచి నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నాపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.02.2025
ప్రవేశ పరీక్ష తేది: 23.02.2025.
వెబ్‌సైట్‌: https://tgcet.cgg.gov.in

>> JNV Admissions 2025-26: నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం!

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Dec 2024 03:04PM

Photo Stories