Skip to main content

No Entrance Exam : ఈ విద్యాల‌యాల్లో ఇక‌పై నో ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌.. స‌ర్కార్‌ కీల‌క ఆదేశాలు..

సాధార‌ణంగా, విద్యాల‌యాల్లో చేరేందుకు ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో నెగ్గితే, ఉన్న‌త మార్కులను సాధిస్తే, వారికి ఆ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశం ఉంటుంది.
No entrance exam for admissions at gurukul education institutions

సాక్షి ఎడ్యుకేష‌న్: సాధార‌ణంగా, విద్యాల‌యాల్లో చేరేందుకు ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో నెగ్గితే, ఉన్న‌త మార్కులను సాధిస్తే, వారికి ఆ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశం ఉంటుంది. అయితే, ప్ర‌స్తుతం ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ విష‌యంపై రాష్ట్ర సీఎంను సంద‌ర్శించిన‌ట్లు తెలుస్తుంది. విద్యాల‌యాల్లో ప్ర‌వేశం కోసం నిర్వ‌హించే ప‌రీక్ష‌ను ఎత్తివేసి, డైరెక్ట్ అడ్మిష‌న్లు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి లేఖ రాసింది విద్యాశాఖ‌.

30 శాతం మిగులు..

గతంలో ఎంట్రెన్స్ నిర్వహించి, గురుకుల పాఠ‌శాల‌ల్లో, ఇంట‌ర్‌, డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్రవేశాలు నిర్వహించే వారు. అయితే, దీని వల్ల ఏటా ప్ర‌వేశాలు త‌గ్గిపోతున్నాయ‌ని, ఇప్ప‌టికే 30 శాతం సీట్లు మిగిపోయాయ‌ని అధికార యాంత్రాంగం రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా, ప‌రీక్ష రాయ‌నివారు, సీటు ద‌క్క‌నివారు కార్పొరేట్ స్కూళ్ల‌కు వెళ్తున్నారు. అక్క‌డ ఫీజులు క‌ట్ట‌లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

School Holidays: రేపు విద్యాసంస్థలకు సెల‌వు.. ఎందుకంటే..?

వేల‌కువేలు ఫీజులు..

వాస్తవానికి గురుకులాల్లోనే పదో తరగతి చదివిన స్టూడెంట్స్​, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు తాము చదివిన గురుకులాల్లో ఎంట్రెన్స్​ సీట్లు పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు 30 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణి ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

MBiPC Course in Inter : వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అమ‌ల్లోకి ఎంబైపీసీ.. వివ‌రాలివే..

సీఎం ఆదేశాలు..

కాగా, అధికారులు తెలిపిన వివ‌రాల అనుసారంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇక‌పై గురుకుల విద్యాల‌యాల్లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆదేశించారు. గురుకుల పాఠ‌శాల‌లు, ఇంట‌ర్ క‌ళాశాల‌లు, డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాలు ఇక‌పై నేరుగానే ఉంటాయని, ప్ర‌వేశ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన అవ‌సరం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Feb 2025 03:07PM

Photo Stories