Awareness on Technology : విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండాలి

రాజంపేట: పరిశ్రమలలో మారుతున్న సాంకేతిక ధోరణులపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని అన్నమాచార్య యూనవర్సిటీ ప్రో–చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి అన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఏఐటీఎస్ ఆడిటోరియంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. చొప్పా అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఏయూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. సాఫ్ట్‌వేర్ సంస్ధలకు చెందిన వారితో ప్రసంగాలు చేయిస్తున్నామన్నారు.
ఓయూ పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్–2025 టైంటేబుల్ విడుదల
కౌత్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓ డా.కృష్ణ నాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్ధ రూపొందించిన కోడెక్‌లను ప్రపంచ వ్యాప్తంగా టెలికాం సంస్ధలు వినియోగిస్తున్నాయన్నారు. ఆర్కెటెక్ పుత్తూరు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తాజా సాంకేతికఅంశాలపై విద్యార్ధులు పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, ప్రిన్సిపల్ డా.ఎంవీ.నారాయణ, టీపీఓలు హేమకేశవులు, సత్యేంద్రకుమార్, రమేష్‌బాబు పాల్గొన్నారు. అనంతరం నిపుణులను ఏయూ ప్రో–చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)