Skip to main content

Bal Bhavan admissions 2025: విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్‌.. 30 అంశాలపై శిక్షణ

నిజామాబాద్‌ రూరల్‌: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమకు నచ్చిన కళలను నేర్చుకోవడానికి జిల్లా కేంద్రంలోని బాల్‌భవన్‌ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తోంది. చదువుతోపాటు, ఆట–పాటలు సమాంతరంగా సాగినపుడే బాలల్లోని సృజనాత్మకత పదునెక్కి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం చేకురుతుంది. ఈక్రమంలో వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు శిక్షణను ఇచ్చేలా తరగతుల నిర్వహణ చేపట్టనున్నారు. సంగీతం, డ్రాయింగ్‌, నృత్యం, శ్లోకాల పఠనం, వివిధ వస్తువుల తయారీ, యోగా, కర్రసాము వంటి సుమారు 30 అంశాలపై సిబ్బంది శిక్షణ ఇవ్వనున్నారు.
Bal Bhavan admissions 2025
Bal Bhavan admissions 2025

సుమారు 600 మందికి ప్రవేశం..

జిల్లా కేంద్రంలోని బాల్‌భవన్‌లో 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే నెల ఏప్రిల్‌ 2 నుంచి బాల్‌భవన్‌లో ఆసక్తి కల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సుమారు 600 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు బాల్‌భవన్‌ సిబ్బంది తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ ముగిన తర్వాత ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 10వరకు విద్యార్థులకు ఆయా అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

Gurukul Entrance Exam Date : గురుకుల ప్ర‌వేశాల‌కు వ‌చ్చేనెల ప‌రీక్ష‌.. ఈ త‌ర‌గ‌తుల‌కే..

Schools Holiday News: రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్కూళ్లకు సెలవు.. విద్యాశాఖ  ఆదేశం | Sakshi Education

శిక్షణ తరగతులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో శిక్షణ పొందే విద్యార్థులు భోజనంను ఇంటి నుంచే వెంటతీసుకొని రావాలన్నారు. అడ్మిషన్ల కోసం బర్త్‌ సర్టిఫికెట్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు తీసుకు రావాలి. బాల్‌ భవన్‌ ఇన్‌చార్జి ఉమాబాల ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

బాల్‌భవన్‌లో వేసవి ప్రత్యేక తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. కళల పట్ల ఆసక్తి కలిగేల తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించి బాల్‌భవన్‌కు వచ్చే విధంగా ప్రోత్సహించాలి. విద్యతోపాటు కళలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. సకాలంలో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకొని తరగతులకు హాజరుకావాలి
.– ఉమాబాల, ఇన్‌చార్జి, బాల్‌భవన్‌

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 29 Mar 2025 08:57AM

Photo Stories