DSC Free Coaching: మెగా డీఎస్సీకి ఉచితంగా కోచింగ్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ 2025 పరీక్షల ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు ప్రకాశం జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్(ఈబీసీ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకులు ఎం.అంజల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సంచాలకులు అంజల మాట్లాడుతూ డీఎస్సీ ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
DSC Free Coaching
అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత నకళ్లు, టెట్ మార్కుల నకళ్లు, కులధ్రువీకరణ పత్రం నకలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం నకలు, ఆధార్ నకలు, 2 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఉన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు లోని ఆఫీసు ఫోన్ నంబరు 08592–231232, 9989285530, 89850 90926 నంబర్లను సంప్రదించగలరని తెలిపారు.