Current Affairs.. కొలువుకెంతో కీలకం.. పట్టు సాధించండి ఇలా..!

కనీసం 30 శాతం ప్రశ్నలు
సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్, రైల్వే జాబ్స్, త్రివిధ దళాలు.. ఇలా ఏ నియామక పరీక్ష పరిశీలించినా.. దాదాపు 30 % మేర కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలు అడుగుతున్నారు. కొన్ని పరీక్షల్లో ఈ సంఖ్య 40 శాతంగా ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగి గా విధులు నిర్వహించాలనుకునే వారికి సమకాలీ న సామాజిక అంశాలపై ఉన్న అవగాహనను పరి శీలించాలనే ఉద్దేశంతోనే కరెంట్ అఫైర్స్ విభా గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు.
కోర్ + కాంటెంపరరీ
ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అడిగే ప్రశ్నల తీరు మారుతోంది. నేరుగా కరెంట్ అ ఫైర్స్ సంబంధిత ప్రశ్నలు మాత్రమే అడగకుండా.. వాటిని కోర్ అంశాలతో సమ్మిళితం చేస్తూ అడు గుతున్న ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. ఉదా హరణకు.. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఆమోదం పొందుతున్న కొత్త బిల్లులకు సంబంధించి సమకాలీన పరిణామం, దాని నేపథ్యం, బిల్లు ప్రవేశపెట్టేందుకు దారి తీసిన పరిస్థితులు గురించి అవగాహన ఉంటేనే సమాధానం గుర్తించేలా ప్రశ్నలు అడుగు తున్నారు. అంటే.. అభ్యర్థులు తాజా పరిణామాలే కాకుండా.. వాటికి సంబంధించి కోర్ సబ్జెక్ట్‌లోని మూల భావనలనపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
ముఖ్యమైనవి గుర్తించడం ఎలా
కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిదనే అభిప్రాయం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు కొత్త పరిణామాలు సంభవిస్తున్న నేప థ్యంలో పరీక్షల్లో వేటిని ప్రశ్నలుగా అడుగు తారు అనే సందిగ్ధత అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ఆయా పరి ణామాలకున్న ప్రాధాన్యతను గుర్తించే పరిజ్ఞానం సొంతం చేసకుంటే కరెంట్ అఫైర్స్‌లో ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడం సులభమేనని చెబుతు న్నారు. ఉదాహరణకు.. ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంటున్న అంతరిక్ష పరిశోధనలు, దేశంలో ఇస్రో ఇటీవల కాలంలో చేపట్టిన ప్రయోగాలు, త్వరలో చేపట్టనున్న మిషన్‌లు వంటివాటిపై పలు కోణాల్లో అధ్యయనం చేయాలి.
చదవండి: ఆర్‌ఆర్‌బీ పరీక్షలు - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | వీడియోస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | కరెంట్ అఫైర్స్ | జనరల్ ఎస్సే | జనరల్ నాలెడ్జ్
ప్రశ్నార్హమైన సంఘటనలు
ప్రతి రోజు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష కోణంలో ప్రశ్నార్హమైనవేంటో తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి సంఘటనకు సంబంధించి సమాచారం సేకరించడం, వాటిపై పట్టు సాధించడానికి గంటల కొద్దీ సమ యం వెచ్చించే బదులు వ్యూహాత్మకంగా వ్యవహ రించాలి. సామాజికంగా, ఆర్థికంగా, శాస్త్రసాంకేతిక పరంగా విస్తృత ప్రాధాన్యం, ఎక్కువ ప్రభావం చూపే సంఘటనలపై దృష్టి కేంద్రీకరించాలి. అదే విధంగా జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాంతీయ సంఘటనలపైనా ఫోకస్ చేయాలి. ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించేందుకు సదరు పరీక్షకు సంబంధించి గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగు తున్నారో పరిశీలించాలి. దీని ద్వారా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న లేదా ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించడం తేలికవుతుంది.
చదవండి: SSC Exams - Study Material | Exam Pattern | Syllabus | Previous Papers | Grand Tests
అంతర్జాతీయ అంశాలు
అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి ప్రతి అంశాన్ని చదవాల్సిన అవసరం లేదు. అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాలి. ఉదాహ రణకు.. సదస్సులు, సమావేశాల విషయంలో ప్రతిదానికి తేదీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయా సదస్సుల్లో విడుదల చేసిన డిక్లరేషన్లను, ‘వాటి ధీమ్‌లను, సదస్సు జరిగిన దేశం, పట్టణం వంటి వాటిని నోట్ చేసుకోవాలి. అదే విధంగా ఆయా సదస్సుల నిర్వహణ ఉద్దేశం కూడా తెలుసుకోవాలి.
చదవండి: Bank Exams - Study Material | Bit Bank | Guidance | PO Programs | News | Previous Papers | Online Tests
నివేదికలు, గణాంకాలు
సమకాలీన నివేదికలు, గణాంకాలకు సంబంధించి అధ్యయనం చేసేటప్పుడు ఆయా నివేది కల్లో.. ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. సదరు నివేదికలను విడుదల చేసిన సందర్భాన్ని గుర్తించాలి. ఉదాహరణకు.. పేదరికంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలను పరిగణనలోకి తీసుకో వచ్చు. అందులో పేర్కొన్న గణాంకాలు, భవిష్యత్తు పరిస్థితులపై నిపుణుల సిఫార్సులను పరిశీలించాలి. సంబంధిత గణాంకాలను నోట్స్‌లో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: ఏపీపీఎస్సీ *- స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
ద్వైపాక్షిక ఒప్పందాలు
భారత్, ఇతర దేశాలతో చేసుకుంటున్న ద్వై పాక్షిక ఒప్పందాలు.. వీటి వల్ల మన దేశానికి కలిగే ప్రయోజనాలు, అంతర్జాతీయంగా దేశానికి లభించే గుర్తింపు వంటి అంశాలను తెలుసుకుంటూ అధ్య యనం సాగించాలి. వాస్తవానికి కరెంట్ అఫైర్స్ విభాగంలో ‘జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు’ అని సిలబస్‌లో పేర్కొన్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఏడాది కాలంలోని పరిణామాలు
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన పరిణామాలను చదవాలి అనే సందేహం అభ్యర్థులకు ఎదురవుతుంది. సాధా రణంగా పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని పరిణామాలపై పట్టు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు సివిల్ సర్వీసెస్–2025 ప్రిలిమ్స్ పరీక్ష మే 25న నిర్వహించనున్నారు. కాబట్టి 2025 ఏప్రిల్ నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని ముఖ్యాంశాలను చదవాలి.
చదవండి: AP పోలీస్ - స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | వీడియోస్
పుస్తకాల ఎంపిక కీలకం
కరెంట్ అఫైర్స్‌లో రాణించే విషయంలో పుస్త కాల ఎంపిక కీలకంగా నిలుస్తోంది. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ కోసం మార్కెట్‌లో విస్తృతమైన మెటీరియల్ అందుబాటులో ఉంది. కాని అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను, మ్యాగజీన్‌లను, పత్రికలను అనుసరించడం మేలు చేస్తుంది.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
పేపర్ రీడింగ్
కరెంట్ అఫైర్స్ అంశాలను నవలగానో లేదా కథగానో చదువుకుంటూ వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సదరు టాపిక్ ఉద్దేశం, అందులోని ముఖ్యాంశాలను, ఘట్టాలను, ప్రాధాన్య తల గురించి తెలుసుకుంటూ.. సంక్షిప్తంగా సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇందుకోసం న్యూస్ పేపర్ రీడింగ్ తప్పనిసరి. ప్రతిరోజు ప్రామాణిక దినపత్రికలు చదువుతూ ముఖ్య సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి. సమకాలీన అంశాలపై ప్రచురితమయ్యే ఎడిటోరియల్స్, ఇతర ముఖ్య మైన వ్యాసాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వాటి సారాంశాన్ని పాయింట్ల రూపంలో సొంత నోట్స్‌లో రాసుకోవాలి.
![]() ![]() |
![]() ![]() |
సొంత నోట్స్ ఇలా
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి సొంత నోట్స్ రూపంలో ఆయా సంఘటనలను రాసుకోవాలి. ఈ సొంత నోట్స్ రూపొందించుకునే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. పుస్తకం లేదా న్యూస్ పే పర్స్‌లో కనిపించే సమాచారం మొత్తాన్ని నోట్స్‌లో పొందు పర్చకుండా.. వాటికున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని వాటిని నోట్స్‌లో రాసుకో వాలి. అప్పటికీ ముఖ్యాంశాలను విస్మరిస్తున్నాం అనే భావన కలిగితే పుస్తకంలోనే హైలెట్ చేసుకోవాలి.
మెమొరీ టెక్నిక్స్
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మెమొరీ టెక్నిక్స్‌ను పాటించడం. ప్రతి అభ్యర్థికి తనకంటూ సొంత మెమొరీ టెక్నిక్స్ ఉంటాయి. కొందరు విజువలైజేషన్ టెక్నిక్స్, మరికొందరికి మైండ్ మ్యాపింగ్ వంటివి ఉంటాయి. అదే విధంగా ఆయా అంశాలను టేబుల్స్, గ్రాఫ్స్‌లో రూపంలో రాసుకుని సులువుగా రివైజ్ చేసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు తమకు అనుగుణమైన మెమురీ టెక్నిక్స్‌ను అనుసరించాలి.
Tags
- Current Affairs
- Civil Service
- Group 4
- Competitive Exams
- Daily and Monthly Current Affairs PDF
- sakshi education current affairs
- Current Affairs Questions in Competitive Exams
- national current affairs
- International National Current Affairs
- Civils
- groups
- Banks
- railway jobs
- Best Current Affairs Questions
- 100 Current Affairs questions and answers
- World Economic Forum
- United Nations
- ISRO
- Current Affairs of India
- Current Affairs today
- Very Important CAs