APPSC Groups
గ్రూప్స్ పరీక్షల్లో ఏపీ ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
ఏపీపీఎస్సీ గ్రూప్–2 సిలబస్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం, ఉపాధి కల్పనలో ఆ రంగ భాగస్వామ్యం; భూసంస్కరణలు, పంటల విధానం, వ్యవసాయ రాయితీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఏపీలో పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్ ఆవిర్భావం అనంతర పరిణామాలు, ఆర్థిక విధానాలు, పారిశ్రామిక, సేవారంగాల స్థితిగతులు; సామాజిక, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలు ఉన్నాయి. అదే విధంగా గ్రూప్–1లో స్వాతంత్య్రం తర్వాత ఏపీలో భూసంస్కరణలు, సామాజిక మార్పులు, ఏపీ ఆర్థిక రంగ ప్రస్తుత పరిస్థితి, బలాలు–బలహీనతలు అంశాలున్నాయి. ఈ అంశాల ప్రిపరేషన్‌కు ప్రధానంగా ‘ఏపీ సామాజిక ఆర్థిక సర్వే’ను ఉపయోగించుకోవాలి. ఇందులోని ప్రధాన అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే ఏపీ ఎకానమీకి సంబంధించి సగం ప్రిపరేషన్ పూర్తయినట్లే. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్ సమయంలో 2016–17కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలో మొత్తం పది చాప్టర్లను పొందుపర్చారు. ఇందులోని వ్యవసాయ, అనుబంధ రంగాలు; పరిశ్రమలు; సామాజిక మౌలిక వసతులు; ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ చాప్టర్లు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక, పారిశ్రామిక, సేవా రంగాల స్థితిగతుల అధ్యయనానికి సర్వేను మించిన రిఫరెన్స్ మరొకటి లేదని చెప్పొచ్చు. సర్వేలోని ముఖ్యాంశాలతో సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం ప్రయోజనకరం. సర్వేలో చివర పొందుపరచిన పట్టికల రూపంలోని సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పంటల విధానం, సామాజిక కార్యక్రమాల అమలు తీరుతెన్నులు, జిల్లాల మధ్య అసమానతలు తదితరాలపై అవగాహన ఏర్పడుతుంది. భూసంస్కరణలు, పంచవర్ష ప్రణాళికలు తదితర అంశాల ప్రిపరేషన్‌కు తెలుగు అకాడమీ ఎకానమీ పోటీ పరీక్షల ప్రత్యేకం పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. బడ్జెట్ అంశాలను క్షుణ్నంగా పరిశీలించడం కూడా ప్రధానం.
గ్రూప్స్ పరీక్షల కోసం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధం కావాలి?
+
గ్రూప్స్, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి భారత రాజ్యాంగం, ప్రధాన చట్టాలపై అవగాహన అవసరం. అభ్యర్థులు రాజ్యాంగాన్ని అయిదు భాగాలుగా విభజించుకుని చదవొచ్చు. అవి..
1. భారత రాజ్యాంగం-పరిణామ క్రమం
2. ప్రాథమిక హక్కులు
3. ప్రభుత్వ వ్యవస్థ
4. న్యాయ వ్యవస్థ
5. సమాఖ్య వ్యవస్థ
1. భారత రాజ్యాంగం-పరిణామ క్రమం
2. ప్రాథమిక హక్కులు
3. ప్రభుత్వ వ్యవస్థ
4. న్యాయ వ్యవస్థ
5. సమాఖ్య వ్యవస్థ
- భారత రాజ్యాంగం - పరిణామక్రమంలో ప్రధానంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారు? దాని తత్వం ఏమిటన్నది చూసుకోవాలి. రాజ్యాంగ రచన, రాజ్యాంగ అసెంబ్లీ, రాజ్యాంగ సవరణ తదితర అంశాలను పరిశీలించాలి.
- ప్రాథమిక హక్కుల స్వభావం, వాటి పరిధి, అవి ఎవరికి వర్తిస్తాయో తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులతోపాటు మరో ప్రధాన అంశం ఆదేశిక సూత్రాలు. వాటి తత్వం తెలుసుకోవాలి.
- ప్రభుత్వ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థ, ప్రధాని, మంత్రిమండలి విధులు, అధికారాలపై దృష్టి పెట్టాలి. రాష్ట్రపతికి ఉండే శాసనపరమైన, న్యాయపరమైన అధికారాలు, ఆయనకు ఉండే విచక్షణ అధికారాలు ఏమిటన్న అంశాలపై అవగాహన ఉండాలి. రాష్ట్ర స్థాయిలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి, అధికారులు, పాలకులు-అధికారుల మధ్య సంబంధాలను తెలుసుకోవాలి.
- న్యాయ వ్యవస్థ: ఇందులో హైకోర్టులు, సుప్రీంకోర్టు, పరిపాలనా ట్రిబ్యునళ్లు, వాటి అధికారాలు, పరిపాలనా ట్రిబ్యునళ్లు- హైకోర్టు మధ్య సంబంధాలు ఏమిటన్నది తెలుసుకోవాలి. న్యాయసమీక్ష అధికారాల గురించి అవగాహన పెంచుకోవాలి.
- సమాఖ్య వ్యవస్థ: ఇందులో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, వాటి మధ్య శాసన సంబంధ అంశాలే కాకుండా పరిపాలన, ఆర్థిక సంబంధాలపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలి.
ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం గురించి వివరించండి?
+
అధిక ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగం ముఖ్య సాధనంగా ఉపకరిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల పర్యాటక రంగ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ధనాత్మకంగా ఉంటోంది.
- పర్యాటక రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రంలో రవాణా రంగం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, కుటీర పరిశ్రమలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.
- పర్యావరణ పరిరక్షణ, అంతర సాంస్కృతిక అవగాహన పెంపునకు పర్యాటక రంగం తోడ్పడుతుంది.
- పర్యాటక రంగం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. బహుళ ప్రయోజన మౌలిక వసతుల అభివృద్ధిని పర్యాటక రంగం ప్రోత్సహిస్తుంది. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో వృద్ధి అధికమవుతుంది.
- పర్యాటక రంగం పరంగా అంతగా ప్రాచుర్యం చెందని ప్రాంతాలపై దృష్టి సారించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెంది, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది.
- గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా పల్లెల్లో ఉపాధి పెరిగి, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.
- ప్రకృతి సోయగాలు, సంస్కృతులు, ఆచారాలు గల రాష్ట్రంలో గ్రామీణ పర్యాటకానికి మంచి అవకాశం ఉంది.
పోటీ పరీక్షల్లో జనరల్ఎస్సే రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి?
+
సరైన సమాచారాన్ని పొందుపరిచేందుకు, సమకాలీన ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుంది.
1. చాలా ముఖ్య అంశమైతే తప్ప అండర్ లైన్ చేయొద్దు. అవసరమైతే పేజీకి ఒక అండర్ లైన్ ఉండేలా చూసుకోవాలి.
2. సందర్భానుసారం అవసరమైనంతలో కొటేషన్స్‌ను ఉపయోగించొచ్చు. అంతేగానీ పొంతనలేని కొటేషన్స్ వల్ల లాభంమాట అటుంచి నష్టం ఎక్కువ జరుగుతుంది.
3. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా విభజించుకొని రాయాలి. ఒక పేరాగ్రాఫ్ ఒకే అంశానికి సంధించినదై ఉండాలి. ఒక పేరాకు, తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.
4. ఎస్సేలో పాయింట్లు ఉండకూడదు.. టేబుల్ వేయకూడదు.. అనేవి అపోహలు మాత్రమే. సందర్భాన్నిబట్టి అవసరమైన చోట సమాచారాన్ని పాయింట్ల రూపంలో రాయొచ్చు. వెన్ డయాగ్రమ్‌ల వంటివీ చేయొచ్చు.
5. రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మత, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు.
6. ఎస్సే ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించకూడదు. ఇచ్చే పరిష్కారాలు ఆచరణసాధ్యంగా ఉండాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.

పోటీపరీక్షలకు సంబంధించి డేటా ఇంటర్‌ప్రిటేషన్ (డీఐ) అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
పోటీపరీక్షల ఔత్సాహికుల్లోని విశ్లేషణ నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టాబ్యులర్, లైన్‌చార్ట్, బార్‌చార్ట్, పైచార్ట్ తదితరాల రూపంలో ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు వీలైనన్ని మోడల్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ విభాగంపై పట్టుసాధించవచ్చు. డీఐ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం గుర్తించాలంటే ఇచ్చిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విభాగంలో వస్తున్న ప్రశ్నలు మధ్యస్థం నుంచి అధిక కాఠిన్యత కలిగి ఉంటున్నాయి. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాల్సి ఉంటుంది. వేగంగా క్యాలిక్యులేషన్స్ చేయడాన్ని అలవరచుకోవాలి. కచ్చితత్వం కూడా ముఖ్యమే. యావరేజెస్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియో తదితరాలకు సంబంధించిన సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్:
ఎలాంటి అకడమిక్ పరిజ్ఞానం అవసరం లేకుండా.. సమయస్ఫూర్తి, స్వీయ వివేచనతో సమాధానాలివ్వాల్సిన ప్రశ్నలు ఎదురయ్యే విభాగం డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక సంఘటన/సందర్భం/ సమస్యను పేర్కొని, దానికి సంబంధించి ఒక అధికారిగా ఎలా వ్యవహరిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనే తరహా ప్రశ్నలు ఈ విభాగంలో ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన అవసరం లేకపోయినా.. వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న సమస్యలు - వాటికి అధికారులు తీసుకున్న నిర్ణయాలు - ఫలితాలు వంటి వాటిని విశ్లేషించడం ద్వారా నైపుణ్యం లభిస్తుంది.

పోటీ పరీక్షల్లో జాగ్రఫీ; సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
1. జాగ్రఫీకి సంబంధించి ప్రశ్నలు కోర్ అంశాలతో పాటు వాటితో సంబంధమున్న సమకాలీన అంశాల (Contemporary issues) నుంచి కూడా వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఇటీవల భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై దృష్టిసారించాలి.
2. రుతుపవనాలు-ముందస్తు అంచనాలు, పులుల అభయారణ్యాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
3. 2015-టైగర్ సెన్సస్ అంశాలను అధ్యయనం చేయాలి. గతంతో పోల్చితే పులుల సంఖ్యలో వచ్చిన మార్పులు, పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలను గుర్తుంచుకోవాలి.
4. ఇటీవల కాలంలో నదుల అనుసంధానం (River Linking) పై బాగా చర్చ జరుగుతోంది. నీరు, ఆహార భద్రతకు నదుల అనుసంధానం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అభ్యర్థులు నదుల అనుసంధానం స్థితిగతులు, రాష్ట్రాల మధ్య జలవివాదాలు తదితరాలపై దృష్టిసారించాలి.
5. ప్రస్తుతం స్మార్ట్‌సిటీలపైనా పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ అంశం నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
6. ప్రపంచ వ్యాప్తంగా (భారత్‌కు ప్రాధాన్యమిస్తూ...) ఐలాండ్ గ్యాస్ నిల్వలపై దృష్టిసారించాలి. యురేనియం నిక్షేపాలపైనా అవగాహన తప్పనిసరి.
7. సహజ వనరులు, రవాణా వ్యవస్థ, భూస్వరూపాలు, నదులు, వాతావరణం తదితర అంశాలపై దృష్టిసారించాలి. అట్లాస్ సహాయంతో ప్రిపరేషన్ కొనసాగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఎస్ అండ్ టీ:
1. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలి.
2. అంతరిక్ష రంగం; రక్షణ రంగం; సమాచార-సాంకేతిక రంగాలపై దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగమైన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, ప్రయోగించిన దేశీయ, విదేశీ ఉపగ్రహాలు, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ నిర్వహించిన ప్రయోగాలపై దృష్టిసారించాలి.
3. శక్తి రంగం (Energy Sector) నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
4. పర్యావరణం, జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ), వాతావరణ మార్పులు అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి వీటికి సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
5. ఆవరణ వ్యవస్థలు (Eco Systems), అనుకూలనాలు (Adaptations), ఎకలాజికల్ ఇంటరాక్షన్స్, ఇంటర్ గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) అసెస్‌మెంట్ రిపోర్ట్, జీవవైవిధ్యం ఎదుర్కొంటున్న ప్రమాదాలు తదితర అంశాలను రివిజన్ చేయాలి. దేశంలోని ప్రధానమైన Endemic Species, వాటి విస్తరణ, ప్రత్యేక లక్షణాలు ముఖ్యమైనవి.

పోటీపరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
1. భారతదేశంలోని రాష్ట్రాల, రాజధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, జాతీయ చిహ్నాలు, జనాభా, భాషలు, రక్షణ వ్యవస్థ, భారత అంతరిక్ష విజయాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్ రంగం, అణువిద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు-అవి ఉన్న ప్రదేశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, శాంక్చురీలు, బయోస్పియర్ రిజర్వ్ కేంద్రాలు, గిరిజన తెగలు-నివసించే ప్రాంతాలు, నదీతీర పట్టణాలు తదితర అంశాలను సమగ్రంగా చదవాలి.
2. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటులు, ఐక్యరాజ్యసమితి, ఐరాస అనుబంధ సంస్థలు-ప్రధాన కార్యాలయాలు గురించి చదవాల్సి ఉంటుంది.
వీటితో పాటు గ్రంథాలు-రచయితలు, ప్రముఖ ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, ప్రముఖ దినోత్సవాలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, క్రీడలు-ట్రోఫీలు, క్రీడా పదజాలం, వివిధ అంశాల్లో ప్రథమ వ్యక్తులు, భౌగోళిక మారు పేర్లు, అబ్రివేషన్లు, నృత్యాలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి.

పోటీపరీక్షలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ప్రభావం అంశాలకు ఎలా ప్రిపేరవ్వాలి?
+
- సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల అధ్యయనంలో భాగంగా దేశంలో ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నమోదవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించాలి. ఉదాహరణకు తాజా ఉపగ్రహ ప్రయోగాలు - వాటి ద్వారా కలిగే ఫలితాలు - అవి సామాజిక అభివృద్ధికి దోహద పడే తీరు వంటివి. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పారిశ్రామిక అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలి.
- సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న చర్యలు, విధానాల్లో అవలంబిస్తున్న మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో విద్య, వైద్య, సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానంపై సంపూర్ణ అవగాహన అవసరం. వీటితోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రాథమిక నైపుణ్యాలు అందించే కంప్యూటర్ వినియోగం గురించి తెలుసుకోవాలి. అదే విధంగా రోబోటిక్స్, నానో టెక్నాలజీ అంశాలపైనా దృష్టిసారించాలి.
- అభ్యర్థులు దృష్టి సారించాల్సిన మరో ముఖ్యాంశం.. భారత అంతరిక్ష విధానం. ఈ దిశగా భారత్ చేపడుతున్న కొత్త ఉపగ్రహ ప్రయోగాలు, కొత్త కార్యక్రమాల సమాచారాన్ని తెలుసుకోవాలి.
- అంతరిక్ష సాంకేతికత ఆధారంగా సామాజిక అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు ముఖ్యంగా విద్య, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, వరదలు, తుపాన్లు, సునామీలు, వాతావరణ మార్పులకు సంబంధించినవి తెలుసుకోవాలి.
- శక్తి వనరుల అధ్యయనంలో భాగంగా జల, అణు శక్తి వనరులు వాటి వినియోగం దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకోవాలి. వ్యర్థాల ఆధారిత ఇంధన ఉత్పత్తి; సౌర, పవన విద్యుత్ రంగాలు, వాటి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు; అనువైన ప్రాంతాల గురించి సమాచారం తెలుసుకోవాలి.
భారత ఆర్థిక వ్యవస్థ-సమస్యలు, సవాళ్లకు సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
- భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జాతీయ ఆదాయ నిర్వచనాలు, భావనలు కీలకమైన అంశాలు. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి భావనలు, స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి భావనలను సమీకరణాలతో సహా అవగాహన చేసుకోవాలి.
- జాతీయ ఆదాయంతో పాటు వృద్ధి- అభివృద్ధి భావనలను కూడా అధ్యయనం చేయాలి.
- భారతదేశ ప్రణాళికలు, లక్ష్యాలు, వ్యూహాలు, ఆ ప్రణాళికలలో సాధించిన విజయాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించిన లక్ష్యాలు, ఆ లక్ష్యాల ద్వారా సమ్మిళితవృద్ధి ఎలా సాధించవచ్చు? సమ్మిళితవృద్ధి అంటే ఏమిటి? సమ్మిళిత వృద్ధి ద్వారా ఆర్థికవృద్ధి ఎలా సాధించవచ్చు అనే కోణంలో విశ్లేషించుకోవాలి. 2015, జనవరి 1న ప్రారంభించిన ‘నీతి ఆయోగ్’ నిర్మాణం-లక్ష్యాలు, విధులు మొదలైన అంశాలను చదవాలి.
- వివిధ పంచవర్ష ప్రణాళికల కాలాల్లో ప్రారంభించిన పథకాలు, వాటి లక్ష్యాలను కూడా అధ్యయనం చేయాలి. ప్రణాళికల్లోని సంక్షేమ పథకాలు, పేదరిక, నిరుద్యోగ నిర్మూలన పథకాల గురించి చదవాలి.
- పేదరికం, నిరుద్యోగం అనగానేమి? వాటి భావనలు ఏమిటి? పేదరికం, నిరుద్యోగితలకు కారణాలు, నివారణ చర్యలు. పేదరికం, నిరుద్యోగితలను తగ్గించేందుకు ప్రారంభించిన పథకాలు. వీటిలో స్వయం ఉపాధి పథకాలు, వేతన ఉపాధి పథకాల గురించి అధ్యయనం చేయాలి.
పోటీపరీక్షలకోణంలో పర్యావరణం (Environment), సంబంధిత అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పర్యావరణ సంబంధిత అంశాలను వివిధ పోటీ పరీక్షల సిలబస్‌లలో చేర్చారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్‌లో సైతం పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలను పొందుపర్చారు. కేవలం ప్రిలిమ్స్‌లోనే కాకుండా మెయిన్‌సలోని జనరల్ స్టడీస్ పేపర్-3లో పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలను చేర్చారు. సివిల్స్ ప్రిలిమ్స్ (2017)లో పర్యావరణ సంబంధిత అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. అదే విధంగా ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్‌స పరీక్షలో పర్యావరణ పరిరక్షణలో సమాచార సాంకేతిక విజ్ఞానం పాత్రను వివరించండి?, పర్యావరణ అంశాల్లో సత్వర న్యాయాన్ని అందించడంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ పాత్ర, ఇటీవల అది వెలువరించిన నిర్ణయాలను ఉదాహరణలతో వివరించండి? తదితర ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి ధోరణిని పరిశీలించి, ప్రిపరేషన్ కొనసాగించాలి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న మానవుడు.. అదే క్రమంలో సహజ వనరులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. భావితరాల సుస్థిరతను పట్టించుకోకుండా మితిమీరిన వినియోగానికి పాల్పడుతున్నాడు. దాని ప్రభావం వ్యవసాయం, సముద్రమట్టం, జల వలయం, హిమనీనదాలపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణ, కాలుష్య నిర్మూలన వంటివి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పర్యావరణ కాలుష్య కారకాల ప్రభావాలను తెలుసుకునే క్రమంలో సమకాలీనంగా చోటుచేసుకుంటున్న సంఘటనల (సదస్సులు, తీర్మానాలు, వివిధ సంస్థల నివేదికలు..) పరిశీలించడం ముఖ్యం.

జంతువుల విస్తరణకు సంబంధించి పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
జంతువుల విస్తరణకు సంబంధించి అడిగే ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. జంతువుల ఆవాసాలు, అవి నివసించే ప్రదేశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇస్తుంటారు. ఎందుకంటే కొన్ని జంతువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. అందువల్ల ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా కంగారు, ఎకిడ్నా, ప్లాటిపస్, ఎలుగుబంటి తదితర జంతువులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో జంతువుల ఆవాస ప్రాంతాలను, దేశాలను గుర్తుంచుకోవాలి(ఉదాహరణకు కంగారు అనే జంతువు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది). దీంతోపాటు జంతువులకు ప్రత్యేకమైన అభయారణ్యాల గురించి చదవాలి.
పర్వతాలు, కనుమలు వంటి అంశాలపై పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే ప్రధానంగా వింధ్య, సాత్పురా, ఆరావళి పర్వతాలు, వాటిలోని ఎల్తైన శిఖరాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అవి కలిసే ప్రదేశం, వాటిలోని శిలలు; మాల్వా పీఠభూమి; ద్వీపకల్ప పీఠభూమిలోని వివిధ ప్రాణులు తదితరాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు గమనించవచ్చు. ఉదాహరణకు ‘తూర్పు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి?’ అని అడిగారు. ఈ ప్రశ్న సులువైందే. అయినా చాలా మంది తప్పు సమాధానం గుర్తించారు. కారణం సరైన అవగాహన లేకపోవడం. ఈ టాపిక్‌లో అనేక అంశాల మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు వీటిని చదివేటప్పుడు దేశ నైసర్గిక స్వరూప పటాన్ని ముందు ఉంచుకొని, ఒక అంశానికీ మరో అంశానికి సంబంధాన్ని గుర్తుంచుకుంటూ పరిశీలనాత్మక అధ్యయనం చేయాలి.
గ్రూప్స్ పరీక్షల్లో పాలిటీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలా చదవాలి?
+
పాలిటీ విభాగం మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది. సిలబస్‌లోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి గతిశీలతను సంతరించుకొంటుంది. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలు తదితర అంశాలు సిలబస్‌లో ఉంటున్నాయి. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకొన్నప్పుడు సిలబస్ పరిధి చాలా విస్తృతం అవుతుంది.
గత ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా విభజించవచ్చు.
1. విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి (Knowledge based).
2. విషయ అవగాహన (Understanding - Comprehension).
3. విషయ అనువర్తన (Application)

- మొదటిరకం ప్రశ్నలకు సమాధానాలను Facts, Figures ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది. చదివి గుర్తుంచుకుంటే సరిపోతుంది.
- రెండో తరహా ప్రశ్నల ద్వారా సమాచారాన్ని అభ్యర్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అనేది పరిశీలిస్తారు.
- మూడో తరహా ప్రశ్నలు అభ్యర్థి తెలివి, సందర్భానుసార అనువర్తనకు సంబంధించి ఉంటాయి. తన విచక్షణా జ్ఞానంతో సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది.
- రాజ్యాంగ చరిత్ర - రాజ్యాంగ పరిషత్: రాజ్యాంగ చారిత్రక పరిణామం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన ముఖ్య సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ముఖ్య కమిటీలు, ప్రముఖ సభ్యులు, తీర్మానాలు, రాజ్యాంగ ఆధారాలు వంటి అంశాలపై దృష్టి సారించాలి.
- ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు: రాజ్యాంగ పునాదులు, తత్వం, లక్ష్యాలు, ప్రాథమిక హక్కులు - రకాలు, ప్రాముఖ్యత, వాటి సవరణలు, విస్తరణ, సుప్రీంకోర్టు తీర్పులు, సమకాలీన వివాదాలు, ఆదేశిక నియమాలతో ప్రతిష్టంభన, తాజా పరిణామాలపై విస్తృత అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
- కేంద్ర ప్రభుత్వం: కార్యనిర్వాహక స్వభావం, రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నిక, తొలగింపు అధికారాలు, ప్రధానమంత్రి, మంత్రి మండలి, సంకీర్ణ రాజకీయాలు, పార్లమెంటు నిర్మాణం, లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, పార్లమెంటు ప్రాముఖ్యత- క్షీణత, జవాబుదారీతనం లోపించడం, విప్‌ల జారీ, పార్టీ ఫిరాయింపుల చట్టం, నేరమయ రాజకీయాలు. సుప్రీంకోర్టు అధికార విధులు, క్రియాశీలత తదితర పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- రాష్ర్ట ప్రభుత్వం: గవర్నర్ నియామకం, అధికార విధులు విచక్షణాధికారాలు - వివాదాలు, ముఖ్యమంత్రి - మంత్రి మండలి, విధానసభ, విధాన పరిషత్, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
- కేంద్ర రాష్ర్ట సంబంధాలు: సమాఖ్య స్వభావం, అధికార విభజన, శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు, అంతర్రాష్ర్ట మండలి, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, కేంద్ర - రాష్ర్ట సంబంధాల సమీక్షా కమిషన్లు వాటి సిఫార్సులను లోతుగా అధ్యయనం చేయాలి.
- 73, 74వ రాజ్యాంగ సవరణలు: ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, చారిత్రక పరిణామం - మేయో, రిప్పన్ తీర్మానాలు, సమాజ వికాస ప్రయోగం - బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్.ఎం.సింఘ్వి కమిటీలు, వాటి సిఫార్సులు; 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు, నూతన పంచాయతీ వ్యవస్థ, పెసా (PESA) చట్టం మొదలైన అంశాలపై అవగాహన ఉండాలి.
- రాజ్యాంగపరమైన సంస్థలు: ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వొకేట్ జనరల్ ఇతర చట్టపర కమిషన్ల గురించి సాధికారిక సమాచారాన్ని కలిగి ఉండాలి.
- రాజ్యాంగ సవరణలు: ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంచుకోవాలి. ప్రధానంగా 1, 7, 15, 24, 25, 42, 44, 52, 61, 73, 74, 86, 91, 97, 98వ రాజ్యాంగ సవరణలతోపాటు తాజాగా ప్రతిపాదించిన బిల్లులను గుర్తుంచుకోవాలి.
- ప్రభుత్వ విధానాలు హక్కుల సమస్యలు: విధాన నిర్ణయాలు, వాటిని ప్రభావితం చేసే గతిశీలక అంశాలు, అభివృద్ధి, నిర్వాసితులు, పర్యావరణం, ఉద్యమాలు, పౌర సమాజం, మీడియా పాత్ర మొదలైన అంశాలను కూడా ప్రిపరేషన్‌లో భాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి భౌతికశాస్త్రం అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
- భౌతిక శాస్త్రంలో ప్రధానంగా ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఆధునిక భౌతికశాస్త్రం, ఉష్ణం, యాంత్రిక శాస్త్రం, శాస్త్రవేత్తలు-వారి ఆవిష్కరణలు, నోబెల్ గ్రహీతలు తదితర అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కో అంశానికి సంబంధించి ముఖ్యమైన వాటిని ప్రణాళికాబద్ధంగా చదవాలి. ఉదాహరణకు ‘విద్యుత్’ నుంచి ముఖ్యంగా విద్యుత్ ప్రవాహం, విద్యుత్ పొటెన్షియల్, ఓమ్ నియమం, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానం, విద్యుత్ ఘటాలు, విద్యుత్ సాధనాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రాశుల ప్రమాణాలను నేర్చుకోవాలి.
ఉదా: కరెంటు-ఆంపియర్; నిరోధం-ఓమ్. - ఉష్ణం నుంచి ఉష్ణం ప్రమాణాలు (కెలోరీ, జౌల్, ఎర్గ్), ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం, వివిధ రకాల ఉష్ణోగ్రతా మాపకాలు (ఉదాహరణకు సెల్సియస్ ఫారన్‌హీట్, కెల్విన్ మాపకాలు), పదార్థాల ఉష్ణ వ్యాకోచాలు (ముఖ్యంగా నీటి అసంగత వ్యాకోచం) తదితర అంశాలు నేర్చుకోవాలి.
- కాంతి నుంచి కాంతి ధర్మాలు (రుజువర్తనం, వివర్తనం, వికిరణం, పరావర్తనం, వ్యతికరణం), దృక్‌సాధనాలు (కటకాలు, దర్పణాలు, మైక్రోస్కోప్‌లు, టెలిస్కోపులు, టెలివిజన్‌లు), దృష్టి లోపాలు (హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి), అదృశ్య వికిరణాలు (పరారుణ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు, మైక్రోతరంగాలు, లేజర్ కిరణాలు) అంశాలపై దృష్టి సారించాలి.
- ధ్వనికి సంబంధించి ధ్వని ఉత్పత్తి, ధ్వని ప్రసారం, అతిధ్వనుల ఉపయోగాలు, అనునాదం, ప్రతిధ్వని, డాప్లర్ ఫలితం, ధ్వని కాలుష్యం తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- అయస్కాంత పదార్థాల ధర్మాలు, అయస్కాంతీకరణ పద్ధతులు, అయస్కాంత క్షేత్రం, అయస్కాంత పదార్థాల రకాలు (పారా, ఫెర్రో, డయా), భౌమ్య అయస్కాంతత్వం మొదలైన అంశాలను నేర్చుకోవాలి. ఆధునిక భౌతికశాస్త్రంలో రేడియోధార్మికత, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం, అణు రియాకర్లు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- యాంత్రిక శాస్త్రంలో న్యూటన్ గమన నియమాలు, వాటి అనువర్తనాలు, ప్రచోదనం, ప్రక్షేపకం, యాంత్రిక శక్తి, స్థితిజ, గతిజ శక్తులు, భ్రమణ చలనం (అభికేంద్ర, అపకేంద్ర బలాలు వాటి అనువర్తనాలు) చదవాలి.
- వివిధ అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలు-వాటి వాటి అనువర్తనాలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా దైనందిన జీవితంలో ఉపయోగించే అనువర్తనాలను సమగ్రంగా చదవాలి.
- భౌతిక శాస్త్రంలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పాఠశాల స్థాయిలోని 8, 9, 10 తరగతుల ఫిజికల్ సైన్స్ నుంచి సంగ్రహించవచ్చు. వీటితో పాటు ఈ విభాగంలో ప్రామాణిక రచయితలు ప్రచురించిన పుస్తకాలు కూడా చదవాలి. కాబట్టి ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సరైన పుస్తకాలు చదవడంతోపాటు వివిధ దినపత్రికలు గమనిస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, ఆవిష్కరణలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ముఖ్యంగా సొంతంగా నోట్స్ రూపొందించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి ఎలాంటిపశ్నలు వస్తాయి? వాటికి ఎలా ప్రిపేర్ కావాలి?
+
పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ చాలా ముఖ్య విభాగం. ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్‌తోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్ లాంటి అంశాలు ఉంటాయి. క్రమ పరీక్ష, భిన్న పరీక్ష, క్యాలెండర్, దిశలు, దూరాలు, రక్త సంబంధాలు, పోలిక పరీక్ష తదితర అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగ ప్రశ్నలను మ్యాథ్స్ విద్యార్థులే చేయగలరని చాలా మంది భావిస్తారు. కానీ సాధన చేస్తే ఆర్ట్స్, మ్యాథ్స్ అనే భేదం లేకుండా ఎవరైనా సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు. పరీక్షలో సమయం చాలా విలువైంది. క్రమంతప్పకుండా సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. దీంతోపాటు కచ్చితత్వం కూడా అలవడుతుంది. క్రమ పరీక్ష, నంబర్ పోలిక, భిన్న పరీక్ష, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించిన సమస్యలను సాధించడానికి 1 నుంచి 20 వరకు ఎక్కాలు; 1 నుంచి 25 వరకు వర్గాలు; ఘనాలు తెలిసి ఉండాలి. తద్వారా జవాబులను వేగంగా గుర్తించవచ్చు. అలాగే కోడింగ్-డీకోడింగ్ ప్రశ్నలకు సమాధానాలను సులభంగా గుర్తించడానికి ‘ఎ’ నుంచి ‘జెడ్’ వరకు ఆంగ్ల అక్షరాల సంఖ్యా క్రమం తెలిసి ఉండాలి. దిశలు-దూరాలు అధ్యాయంలోని సమస్యలను సాధించడానికి అన్ని దిశలు తెలిసి ఉండాలి. దిశల్లోని మొదటి అక్షరాల (ఉ, ఈ, తూ, ఆ, ద, నై, ప, వా)తో అన్ని దిశలను గుర్తుంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది.
పోటీ పరీక్షలకు సంబంధించి జాతీయాదాయం, విదేశీ వాణిజ్యం, పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి, ద్ర వ్యోల్బణం, ద్రవ్యం - బ్యాంకింగ్ విభాగాల ముఖ్యాంశాలను తెలపండి?
+
జాతీయాదాయం: స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఎన్‌ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, వ్యష్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం, కేంద్ర గణాంక సంస్థ, జాతీయాదాయం-మానవ శ్రేయస్సు, ఆదాయ అసమానతలు, ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల మదింపు పద్ధతులు.
విదేశీ వాణిజ్యం: వాణిజ్య శేషం, చెల్లింపుల శేషం, వర్తక నిబంధనలు, విదేశీ మారక ద్రవ్యం, వాణిజ్య విధానం, మూల్యహీనీకరణ, రీ వాల్యుయేషన్, స్థిర వినిమయ రేటు, అస్థిర వినిమయ రేటు, అప్రెసియేషన్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఎల్‌ఈఆర్‌ఎమ్‌ఎస్, హార్డ్ కరెన్సీ, సాఫ్ట్ కరెన్సీ, హాట్ కరెన్సీ, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్.
పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి: మానవాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ఉపాధి, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు, సాంఘిక భద్రత, గ్రామీణ మౌలిక సౌకర్యాలు, పట్టణ మౌలిక సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి.
ద్ర వ్యోల్బణం: ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణ ప్రభావం, ఫిలిప్స్ రేఖ, టోకు ధరల సూచీ, వినియోగదారుని ధరల సూచీ, స్టాగ్ ఫ్లేషన్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం.
ద్రవ్యం- బ్యాంకింగ్: భారత ద్రవ్య మార్కెట్, భారత మూలధన మార్కెట్, ద్రవ్య విధాన సాధనాలు, మ్యూచువల్ ఫండ్, బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్కరణలు; బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు, బేస్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, విత్తరంగ సంస్కరణలు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, ప్రాథమిక, సెకండరీ మార్కెట్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్, సెబీ, క్యాపిటల్ అడెక్వెసీ రేషియో, నిరర్ధక ఆస్తులు, రుణ రికవరీ ట్రైబ్యునళ్లు, షార్ట్ సెల్లింగ్.

గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి భారతదేశ చరిత్ర అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి?
+
ప్రాచీన భారతదేశ చరిత్ర విభాగంలో ముఖ్యాంశాలు-సింధు నాగరికత, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులు, హర్ష సామాజ్య్రం మొదలైనవి. ఇందులో సింధు, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి.
1. భారతీయ బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించిన భారతీయ బౌద్ధ మతాచార్యుడెవరు?
1) కశ్యప మాతంగుడు
2) ఆచార్య నాగార్జునుడు
3) ఆర్య అసంగుడు
4) ధర్మ కీర్తి
సమాధానం: 2
మధ్యయుగ భారతదేశ చరిత్ర హర్షుడి అనంతర కాలం నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, చోళులు, చాళుక్యులు,విజయనగర సామాజ్య్రం, మొగలులు, మరాఠాలు ఈ విభాగంలోని ముఖ్యులు.
2. దక్షిణ భారతదేశంలో భూదానాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారెవరు?
1) సైనికులు, అధికారులు
2) బ్రాహ్మణులు
3) దేవాలయాలు
4) 2, 3
ఔరంగజేబు మరణించిన సంవత్సరం (1707) నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చివరి మొగల్ రాజులు, బ్రిటషర్ల రాక, భారతదేశ ఆక్రమణ, వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు-ఉద్యమాలు, సామాజిక మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్‌లు, వైస్రాయ్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. మిగతా విభాగాల కంటే ఈ అంశం నుంచే ప్రశ్నలు అధికంగా అడిగే అవకాశం ఉంది.
3. శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి గత ఉద్యమాల కంటే భిన్నమైన అంశం?
1) రైతులు పాల్గొనడం
2) విద్యార్థులు పాల్గొనడం
3) వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడం
4) మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం

పోటీ పరీక్షల్లో కెమిస్ట్రీ ప్రాధాన్యత ఏమిటి? ఏయే పాఠ్యాంశాలు ముఖ్యం?
+
సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ లాంటి పలు పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ విభాగంలో రసాయన శాస్త్రం ఒక ముఖ్య విభాగం. గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కెమిస్ట్రీపై ఆరు నుంచి పది వరకు ప్రశ్నలు వస్తుండటాన్ని గమనించొచ్చు. పాలిమర్‌లు, ఔషధాలు, పర్యావరణ రసాయనశాస్త్ర అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం, రసాయన పదార్థాల ఫార్ములాలు, అణు భారాలు, రసాయన పదార్థాల ఉపయోగాలు లాంటి టాపిక్‌లను రిపీటెడ్‌గా చదవాలి. ఈ పాఠ్యాం శాల నుంచి ఇస్తున్న ప్రశ్నలను గమనిస్తే ఫండమెంటల్స్ పైనే ఎక్కువగా అడుగుతున్నట్లు తెలుసుకోవచ్చు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలతో ఇమిడి ఉన్న రసాయనశాస్త్ర ప్రశ్నలకు హైస్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలతో పాటు పత్రికల్లో వచ్చే విషయ సంబంధ వ్యాసాలు, అప్‌డేట్స్‌ను చదివితే పోటీ పరీక్షల్లో రసాయన శాస్త్ర ప్రశ్నలకు సులువుగా సమాధానం రాయొచ్చు.
గ్రూప్స్ పరీక్షల్లో ఇంధనాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
ఏ పోటీ పరీక్ష అయినా ఎగ్జామినర్ మదిలో తప్పనిసరిగా మెదిలే అంశం ఇంధనాలు. వంట చెరుకుగా వాడే పిడకలు, కలప మొదలుకొని ఎల్‌పీజీ, గోబర్ గ్యాస్ వంటివి కూడా ఇంధనాలే. పెట్రోల్, కిరోసిన్, డీజిల్.. ద్రవ ఇంధనాలు. ఎల్‌పీజీ, సీఎన్‌జీ.. వాయు ఇంధనాలు. వీటికి ఆధారం పెట్రోలియం. క్రూడ్ ఆయిల్‌ను ‘పాక్షిక అంశిక స్వేదన’ పద్ధతిలో రిఫైనరీల్లో శుద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. పోటీ పరీక్షల్లో ఈ ప్రక్రియతోపాటు వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఏయే అనుఘటకాలు వస్తాయో అడిగే అవకాశం ఉంది. ఇంధనాల్లోని రసాయన పదార్థాల గురించీ అడగొచ్చు. ఇంధనం ఏదైనా అది వివిధ హైడ్రో కార్బన్ల మిశ్రమమే. ఎల్‌పీజీలో ప్రధాన అనుఘటకం బ్యూటేన్. సహజ వాయువులో ఉండే ప్రధాన వాయువు మీథేన్. జీవ వ్యర్థాల నుంచి తయారయ్యేది బయోగ్యాస్. పేడ నుంచి తయారయ్యేది గోబర్ గ్యాస్. ఈ రెండింటిలోనూ ప్రధాన అనుఘటకం మీథేనే. ఇవన్నీ హైడ్రోకార్బన్‌లే. వీటిని మండిస్తే కార్బన్‌డైఆక్సైడ్, నీటి ఆవిరి వెలువడతాయి. రాకెట్లలో.. తక్కువ బరువు ఉండి ఎక్కువ శక్తినిచ్చే ఇంధనాలు అవసరం. ద్రవ హైడ్రోజన్ మంచి ఇంధనం. గ్రామ్ ఇంధనం ఇచ్చే శక్తిని బట్టి దాని సామర్థ్యాన్ని తెలియజేస్తారు. ఎక్కువ కెలోరిఫిక్ విలువ ఉంటే దాని సామర్థ్యం అధికం. ఇంధనాలపై ఈ తరహా ప్రశ్నలు అడుగుతారు. అలాగే హైడ్రోకార్బన్‌ల గురించి కూడా విస్తృతంగా చదవాలి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ఉద్యోగ నియామక పరీక్షల్లో విస్తృతంగా ఉండే సిలబస్‌కు అనుగుణంగా మెటీరియల్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
+
గ్రూప్స్ దగ్గరి నుంచి వీఆర్‌వో, వీఆర్‌ఏ వరకు పరీక్షల్లో విజయం సాధించడంలో సరైన మెటీరియల్ ఎంపిక కీలకపాత్ర పోషిస్తుంది. మార్కెట్లో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పేపర్ల వారీగా పుస్తకాలు లభిస్తున్నాయి. అధిక శాతం మంది అభ్యర్థులు ఒక పేపర్‌లో పొందుపర్చిన అన్ని సబ్జెక్టుల సమాచారం లభిస్తుందని వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది సరైన వ్యూహం కాదు. మెటీరియల్ ఎంపికకు ముందు అభ్యర్థులు సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. పేపర్ల వారీగా పేర్కొన్న సబ్జెక్టులను గుర్తించాలి. ఆ తర్వాత సంబంధిత సబ్జెక్టులకు సంబంధించి వేర్వేరుగా సమగ్ర సమాచారం ఉండే పుస్తకాల కోసం అన్వేషణ సాగించాలి. ఒకే పేపర్‌లోని పలు సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త వహించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నీ సంబంధిత పుస్తకంలో ఉన్నాయో? లేదో? గమనించాలి. తర్వాత ఆయా అంశాలకు సంబంధించి గణాంక సహిత సమాచారం, నేపథ్యాల వివరణ ఉందో? లేదో? పరిశీలించాలి. ప్రధానంగా ఎకానమీ, జనరల్ ఎస్సే, సైన్స్ అండ్ టెక్నాలజీలో నిర్దిష్ట అంశంతోపాటు వాటి నేపథ్యం గురించి అవగాహన కలిగి ఉండటం పరీక్షలో విజయానికి ఎంతో దోహదం చేస్తుంది. పూర్తిస్థాయి సిలబస్ స్వరూపం తెలిసింది కాబట్టి వెంటనే అందుబాటులో ఉన్న పుస్తకాలతో ప్రిపరేషన్‌కు ఉపక్రమించకుండా.. ప్రామాణిక పుస్తకాలను సమకూర్చుకుని వాటి ఆధారంగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. దీనికోసం అవసరమైతే వారం, పది రోజుల సమయం కేటాయించడానికి కూడా వెనుకాడొద్దు. మరో ముఖ్య విషయం.. ఒక సబ్జెక్టుకు రెండు లేదా మూడు కంటే ఎక్కువ పుస్తకాలు చదవడం అనవసరపు శ్రమకు గురి చేస్తుందని గ్రహించాలి. సమగ్ర సమాచారం ఉండే పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. బిట్ బ్యాంక్స్, కొశ్చన్ అండ్ ఆన్సర్ తరహాలో ఉండే గైడ్స్, ఇన్‌స్టంట్ మెటీరియల్‌వైపు మొగ్గు చూపకూడదు. కారణం కొన్ని పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉన్నా.. అందులో అడిగే ప్రశ్నల స్వరూపం సంబంధిత అంశం నేపథ్యం, పూర్వాపరాల గురించి అవగాహనను పరీక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు డిస్క్రిప్టివ్ తరహా పుస్తకాల అభ్యసనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే రివిజన్ కోణంలో గత ప్రశ్నపతారలు-సమాధానాలు, ప్రాక్టీస్ బిట్స్ పుస్తకాలు చదవడం ఉపయుక్తం. ఈవిధంగా మెటీరియల్ ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే పరీక్షల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఏ పరీక్షకైనా ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలంటే తొలుత పాఠశాల స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయడం ముఖ్యం.
పోటీపరీక్షల్లో జీవశాస్త్రం సబ్జెక్ట్‌ను ఏవిధంగా ప్రిపేర్ కావాలి? ఏయే పుస్తకాలు చదవాలి?
+
వివిధ ఉద్యోగ నియామక పోటీపరీక్షల్లో జీవశాస్త్రం నుంచి 10 వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మన చుట్టూ ఉండే మొక్కలు, జంతువులు, వాటి స్వరూపం, వర్గీకరణ, రకాలు, విస్తరణ, ప్రత్యేక లక్షణాలు, పోలికలు మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి. మొక్కలు, జంతువులపై అడిగే ప్రశ్నలు కొంత మేరకు గందరగోళానికి గురి చేస్తాయి. ప్రత్యేకించి మొక్కలు, జంతువులు వాటి మధ్య పోలికలు, వర్గం గుర్తించమనే సందర్భంలో ఇటువంటి సందేహాలు ఎక్కవగా వస్తాయి. కాబట్టి వర్గీకరణ, సాధారణ లక్షణాలు, అవయవ నిర్మాణం, ఆహారపు అలవాట్లు వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా ఇవ్వొచ్చు. మరో ప్రధాన విభాగం.. మానవ శరీర ధర్మ శాస్త్రం. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో ఈ అంశం నుంచి తప్పకుండా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీర నిర్మాణంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. జీవశాస్త్రంలో కీలకమైన అంశం.. పరిశోధనలు. ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జీవశాస్త్ర పరిశోధనలు, చేపట్టిన శాస్త్రవేత్తల గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. పరీక్షలో ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రిపరేషన్‌ను ఇంటర్మీడియెట్ స్థాయి వరకు సాగించాలి. అంటే పదో తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలకు మాత్రమే ప్రిపరేషన్‌ను పరిమితం చేయాలి.
పోటీపరీక్షల కోణంలో జీవ వైవిధ్యం, శీతోష్ణస్థితి మార్పు అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
- జీవవైవిధ్యం (Bio diversity).. పోటీపరీక్షల కోణంలో ఒక ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై పోటీపరీక్షల ఔత్సాహికులు అవగాహన పెంపొందించుకోవడం అవసరం.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయి విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెరగాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (Red list) క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్ట మేక పక్షి (Great Indian Bustard).
- దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతుల సమాచారం సేకరించాలి. ఈ విధమైన సమాచారం ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు.
- బట్టమేక పక్షి - Great Indian Bustard
- శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్ (Ardeotis nigriceps)
- దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి.
- ప్రధాన ప్రమాదాలు - రహదారుల, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత.
- దీని సంబంధిత జాతులు: Lesser florican; Beng-al florican; Houbara bustard(ఇది వలస జాతి).
- ఇలా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, నక్షత్ర తాబేలు, కస్తూరి జింక, ఉడుము తదితర జంతువులపై సమగ్ర సమాచార సేకరణ అవసరం. జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న దండెత్తే జాతులపై అవగాహన పెంచుకోవాలి. పార్థీనియం లాంటన కామెరా అనే కలుపు మొక్కలు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ కేన్ టోడ్, బంబుల్ బీ వంటి వాటిపై అవగాహన అవసరం.
- శీతోష్ణస్థితి మార్పు మరో ముఖ్యమైన అంశం. శీతోష్ణస్థితి మార్పు ప్రమాదాలను ఎదుర్కొనే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, శీతోష్ణస్థితి మార్పుపై నేషన్ యాక్షన్ ప్లాన్ (ఎన్‌ఏపీసీసీ), అందులోని జాతీయ మిషన్లు, వాటిలో సాధించిన ప్రగతి, కాప్ సదస్సు వివరాలు.. ముఖ్యమైన అంశాలు.
పోటీ పరీక్షలకు సంబంధించి పాలిటీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
పాలిటీని విశ్లేషణాత్మక దృక్పథంతో చదవడం ద్వారా అభ్యర్థులు ఒకే సమయంలో వివిధ పరీక్షలకు సన్నద్ధత పొందొచ్చు. రాజ్యాంగం మొదలు తాజా రాజకీయ పరిణామాల వరకు సమ్మిళిత ప్రిపరేషన్ కొనసాగించడం లాభిస్తుంది. రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్-ఎన్నికలు-చైర్మన్, ముసాయిదా కమిటీలపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత క్రమంలో రాజ్యాంగ పీఠిక-సవరణలపై అవగాహన పెంపొందించుకోవాలి. అదే విధంగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నిర్మాణ శైలి, ప్రస్తుతం వాటి పనితీరు, అవి వివాదాస్పదం అవుతున్న సంఘటనలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్డినెన్స్‌లు దుర్వినియోగం అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాత్ర గురించి అధ్యయనం చేయాలి. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న, వివాదాస్పదంగా మారుతున్న అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఇటీవల కాలంలో తరచుగా న్యాయ వ్యవస్థ, శాసనశాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం; ఈ రెండు వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడటానికి కారణాలు తెలుసుకోవాలి. న్యాయవ్యవస్థ పనితీరుకు సంబంధించి కేశవానంద భారతి కేసు పూర్వాపరాలు సమీక్షించాలి. దాంతోపాటు రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, క్రమేణా వాటి పరిధి విస్తృతమవుతున్న తీరును అధ్యయనం చేయాలి. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం తదితరాలపై దృష్టిసారించాలి. పాలిటీ పరంగా అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన మరో అంశం స్థానిక స్వపరిపాలన సంస్థలు. వీటి ఏర్పాటు దిశగా చేసిన 73, 74 సవరణలు, వీటికి సంబంధించి బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ సూచనలపై పట్టు సాధించాలి. గ్రామ సభల ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో నిర్వాసితులుగా మారుతున్న ప్రజల స్థితిగతులు, అందుకు దారితీస్తున్న కారణాలను తెలుసుకోవాలి. ఈ క్రమంలో PESA (Panchayati Raj Extension Services Act) యాక్ట్ గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పంచాయతీ సెక్రటరీ పోస్టుల ఔత్సాహికులు రాష్ర్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు - వాటి పనితీరు, పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించాలి. రాష్ట్ర విభజనకు దారితీసిన రాజకీయ, సామాజిక కారణాలు తెలుసుకోవడమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన, ఉద్యోగుల పంపిణీ-విభజన విషయంలో కమలనాథన్ కమిటీ సిఫార్సులు తెలుసుకోవాలి. మొత్తం మీద పాలిటీ పరంగా అభ్యర్థులు కేవలం బిట్స్ ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా.. ఆయా అంశాలకు సంబంధించి నేపథ్యం, కారణం, ప్రస్తుత పనితీరు కోణంలో విస్తృత దృక్పథంతో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్‌కు సన్నద్ధమయ్యే సమయంలోనే మెయిన్ పరీక్ష కోణంలో చదవడం మేలు. సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న రాజకీయపరమైన నిర్ణయాలుగా పేర్కొనే పథకాల (ఉదా: స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ కాన్సెప్ట్స్ తదితర)పై అవగాహన పెంచుకుంటే.. పాలిటీలో పట్టు లభించడమే కాకుండా పరీక్షలోనూ మెరుగ్గా సమాధానాలు ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది.
పోటీపరీక్షలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ఎలా సిద్ధమవాలి?
+
తొలుత ఎస్ అండ్ టీలోని అనేక విభాగాలు, వాటి పరిధి గురించి తెలుసుకోవాలి. ఎస్ అండ్ టీలోని ముఖ్యాంశాలు.. అంతరిక్షం (స్పేస్), రక్షణ రంగం (డిఫెన్స్), శక్తి రంగం (ఎనర్జీ), అణుశక్తి (న్యూక్లియర్ ఎనర్జీ), బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), నానో టెక్నాలజీ, రోబోటిక్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్.
- అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష కార్యక్రమం, అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమం అనే ఉప అంశాలున్నాయి. భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభ దశలో అంతరిక్ష మూల పరిశోధనలు ప్రారంభమైన 1962 నుంచి 1969లో ఇస్రో ఏర్పాటు; 1972లో అంతరిక్ష సంఘం, అంతరిక్ష విభాగం ఏర్పాటు; ఎస్‌ఎల్‌వీ-3, ఏఎస్‌ఎల్‌వీ రాకెట్ల అభివృద్ధి; ఆర్యభట్ట, భాస్కర, రోహిణి, యాపిల్ ఉపగ్రహాల ప్రయోగం తదితరాల గురించి చదవాలి. ప్రస్తుతం ఇస్రో.. ఇన్‌శాట్/జీశాట్, ఐఆర్‌ఎస్, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థల్లో ఉపగ్రహాలను రూపొందిస్తోంది. వీటిని ప్రయోగించడానికి పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లను అభివృద్ధి చేస్తోంది. ఏ రాకెట్‌తో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు? ఉపగ్రహం బరువు? తదితర ప్రశ్నలు వస్తాయి. ఇతర అంతరిక్ష ఏజెన్సీలతో భారత్ ఒప్పందాలు, ఇస్రో కేంద్రాల గురించి తెలుసుకోవాలి. చంద్రయాన్-1, మంగళయాన్, ఆస్ట్రోశాట్, భవిష్యత్‌లో నిర్వహించనున్న చంద్రయాన్-2, మానవ సహిత అంతరిక్ష మిషన్ వంటి కార్యక్రమాలపై కూడా అవగాహన అవసరం.
- బయో టెక్నాలజీ రంగంలో క్లోనింగ్, డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, మూల కణాలు, జన్యు మార్పిడి మొక్కలు, జంతువులు, జీవ ఎరువులు, జీవ క్రిమి సంహారకాలు, బయో ఇన్ఫర్మేటిక్స్, జీవ ఇంధనాలు, టీకాలు, వ్యాధి నిర్ధారణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. వివిధ దే శాల్లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన జంతువులు, వాటి పేర్లు, బయోటెక్నాలజీ రంగంలో వివిధ విధానాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, భారత్‌లో ఈ రంగంలో పరిశోధన చేస్తున్న సంస్థలు, సాధించిన విజయాలను అభ్యసించాలి.
- శక్తి రంగం విభాగంలో సంప్రదాయ, సంప్రదాయేతర శక్తి వనరులు, దేశంలో వాటి అభివృద్ధి, వినియోగంపై సమాచారం సేకరించాలి.
- రక్షణ రంగానికి సంబంధించి క్షిపణి రకాలు, వాటి పరిధి, శ్రేణిపై ప్రశ్నలు వస్తాయి. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తదితర రక్షణ వ్యవస్థలపై, సంబంధిత సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి.
- నానో టెక్నాలజీ, రోబోటిక్స్ లాంటి ఆధునిక టెక్నాలజీ రంగాల్లో ఎక్కువగా ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. డిజిటల్ ఇండియా, ఇ-గవర్నెన్స్, ఈ- కామర్స్ వంటి కార్యక్రమాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి. ఎస్ అండ్ టీ రంగంలో సమకాలీన అంశాల కోసం సైన్స్ రిపోర్టర్, వివిధ దినపత్రికల్లోని సైన్స్ కాలమ్స్ నుంచి సమాచారం సేకరించాలి.
పోటీపరీక్షలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ఎలా సిద్ధమవ్వాలి?
+
గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పరీక్షల్లో జనరల్‌స్టడీస్ పేపర్‌కు సంబంధించి జనరల్ సైన్స్, టెక్నాలజీ అంశాలకు ఒకే విధంగా అభ్యర్థులు ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. జనరల్ సైన్స్‌లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం తదితర విభాగాలుంటాయి. వీటికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం వంటి అంశాలపై కూడా దృష్టిసారించాలి. తొలుత అభ్యర్థులు చేయాల్సింది జనరల్ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం అంశాలకు సంబంధించిన పరిధిని అర్థం చేసుకోవాలి. దీనికోసం గత పరీక్షల జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించాలి. 6-10 తరగతుల పాఠ్యపుస్తకాలను చదవడం ద్వారా సైన్స్ పదాలపై అవగాహన పెరుగుతుంది. ఇలాంటి అవగాహన వల్ల సమకాలీన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకొని చదవడానికి వీలవుతుంది. పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ విన్యాసం వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడితేనే కాంపోజిట్స్, పాలిమర్స్, అణుశక్తి తదితర అంశాలు బాగా అర్థమవుతాయి. ఇలాంటి అవగాహన గ్రూప్-1 అభ్యర్థులకు మరీ ముఖ్యం. ఇది ప్రిలిమినరీ పరీక్ష ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్‌కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌పై పట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది.
గూప్స్‌లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రధానంగా చదవాల్సిన అంశాలేమిటి?
+
మానవాభివృద్ధి సూచిక (Human Development Index), అసమానతలు, సమన్యాయం, లింగ వివక్ష సూచీ, బహుమితీయ పేదరిక సూచీ (Multidimensional Poverty Index); మిలీనియం వృద్ధి లక్ష్యాలు, పంచవర్ష ప్రణాళికలు- లక్ష్యాలు- వ్యూహాలు; ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులు, 11వ పంచవర్ష ప్రణాళిక విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు, వనరుల పంపిణీ; నీతి ఆయోగ్, పేదరికం- భావనలు- అంచనాలు, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు; నిరుద్యోగం-రకాలు, నిరుద్యోగ నిర్మూలనా కార్యక్రమాలు, శ్రామికశక్తి భాగస్వామ్యం, పనిలో పాలుపంచుకునే రేటు; జాతీయాదాయం-భావనలు, జాతీయాదాయ లెక్కింపులో సమస్యలు; పన్నుల వ్యవస్థ- పన్నుల సంస్కరణలు - వివిధ కమిటీలు, వస్తు సేవలపై పన్ను, కోశ విధానం; బ్యాంకింగ్ రంగం, ద్రవ్య మార్కెట్, ద్రవ్య విధానం, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు; వ్యవసాయ రంగం, హరిత విప్లవం, వ్యవసాయ పరపతి, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పరంగా వివిధ పంటల్లో రాష్ట్రాల స్థానం; పారిశ్రామిక తీర్మానాలు (1948, 1956, 1977, 1980, 1991), పారిశ్రామిక విత్త సంస్థలు; సేవా రంగం- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం; 2011 జనాభా లెక్కలు, డెమోగ్రాఫిక్ డివిడెండ్; ద్రవ్యోల్బణం - డబ్ల్యూపీఐ, సీపీఐ, ఐఐపీ, ద్రవ్యం; ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు; ప్రపంచ వాణిజ్య సంస్థ; విదేశీ వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, చెల్లింపుల శేషం, మూల్యహీనీకరణ; ఆర్థిక సంస్కరణలు-సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ తదితర అంశాలను చదవాలి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఏ విధంగా ఉంటుంది?
+
సబ్జెక్టుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని ఔపోసన పట్టాలి. ప్రశ్నల స్థాయిని బట్టి విషయాన్ని మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుని తార్కికంగా, విశ్లేషణాత్మకంగా, విచక్షణా జ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి; విషయ అవగాహనకు సంబంధించినవి, విషయ అనువర్తనకు సంబంధించినవి.
జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి: ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థి పరిజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే విస్తృత పఠనంతో పాటు పునశ్చరణ అవసరం. ఈ ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతుంది.
విషయ అవగాహనకు సంబంధించినవి: కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన, తెలివితేటలను పరీక్షిస్తాయి. ఇవి రెండూ నిరంతర సాధన, ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమవుతాయి.
విషయ అనువర్తనకు సంబంధించినవి: ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతైన ఆలోచనతో పాటు సహజ ప్రతిభ, విచక్షణాశక్తులను ఉపయోగించాలి. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి అప్లికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.

ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఆవరణ శాస్త్రం, జీవ వైవిధ్యం అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి?
+
ఆవరణ శాస్త్రంలో అభ్యర్థులు ప్రాథమిక భావనలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా జాతి (species), జాతి ఉత్పత్తి (speciation), ఆవరణ వ్యవస్థ (ecosystems), వాటి రకాలు, ఆహార శృంఖలాలు, బయో జియో కెమికల్ సైకిల్స్, ఆహార వల (food chain) ఎకోటోన్, జీవుల అనుకూలతలపై అవగాహన పెంచుకోవాలి. జీవశాస్త్రంలోని జంతువృక్ష విజ్ఞానాన్ని ఆవరణ శాస్త్రానికి అన్వయించుకొని చదవడం ద్వారా జీవుల అనుకూలతలపై పట్టు లభిస్తుంది.
జీవ వైవిధ్యం
జీవ వైవిధ్యం(Biodiversity) మరో ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై సమాచారం అవసరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (Red list) క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్టమేక పక్షి (Great Indian Bustard). అతి త్వరలో అంతరించే జాతిగా దీన్ని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతులపై సమాచారం సేకరించాలి. దీని ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు.
బట్టమేక పక్షి - Great Indian Bustard
శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్ (Ardeotis nigriceps)
దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి.
ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత
దీనికి సంబంధించిన జాతులు: Lesser florican; Bengal florican; Houbara bustard (ఇది వలస జాతి)
ఈ విధంగా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఎర్ర చందనం, నక్షత్ర తాబేలు, మానిస్/పంగోలియన్అనే పిపీలికాహారి తదితర ముఖ్య జంతువులపై అవగాహన అవసరం.

ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత దీనికి సంబంధించిన జాతులు: Lesser florican; Bengal florican; Houbara bustard (ఇది వలస జాతి)

గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ సబ్జెక్టు అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి?
+
వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి విశ్వం, సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకోవాలి. భూమికి సంబంధించి భూభ్రమణం, భూపరిభ్రమణం.. వాటి ప్రభావాలను గురించి చదవాలి. భూమి అంతర్నిర్మాణం-పొరలు గురించి తెలుసుకోవాలి. పీఠభూములు, మైదానాలు వంటి ప్రధాన భూ స్వరూపాలు; అంతర్జాతీయ దినరేఖ, స్థానిక కాలం తదితరాలను చదవాలి. ప్రధాన పంటలు-పండించే దేశాలు; వ్యవసాయ రీతులు, వ్యవసాయ ఉత్పత్తులు; అటవీ విస్తరణ, అంతరించిపోతున్న జీవజాతుల గురించి అధ్యయనం చేయాలి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మన దేశ భౌగోళిక ప్రాంతాల ఉనికి, సహజ ఉద్భిజ్జ సంపదపై దృష్టి సారించాలి.
గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి ఇండియన్ ఎకానమీలో భాగంగా వ్యవసాయ రంగ అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి?
+
దేశంలోని ముఖ్య పంటలు, ఆహార ఉత్పత్తుల రవాణా, నిల్వ, మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ, అవరోధాలు తదితరాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. పంటల తీరుతెన్నులు, నీటిపారుదల పద్ధతులు, నీటిపారుదలలో రకాలు, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు వంటివాటిపై అవగాహన అవసరం. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని వనరులు, అభివృద్ధి పాఠ్యాంశాలను చదవడం వల్ల అనేక అంశాలపై స్పష్టత వస్తుంది. భారత వ్యవసాయ నివేదిక, ఆర్థిక సర్వేలు కూడా ఉపకరిస్తాయి.
వ్యవసాయ ఉత్పత్తులు-మద్దతు ధరలు, రాయితీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహారభద్రత అంశాలపై పట్టు సాధించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వాణిజ్య సదుపాయ ఒప్పందం, భారత్‌లో ఆహార భద్రతకు సంబంధించిన తాజా పరిణామాలను అధ్యయనం చేయాలి. టెక్నాలజీ మిషన్లు (టెక్నాలజీ మిషన్- కాటన్, టెక్నాలజీ మిషన్- హార్టికల్చర్ తదితరాలు) ముఖ్యమైనవి.
దేశంలో ఆహార శుద్ధి పరిశ్రమను సన్‌రైజ్ పరిశ్రమగా చెప్పొచ్చు. దీనికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నందువల్ల దానిపై దృష్టిసారించాలి. కానీ, ప్రామాణిక పుస్తకాల్లో ఆహారశుద్ధి పరిశ్రమకు సంబంధించిన సమకాలీన పరిణామాల సమాచారం లభ్యం కావడం లేదు. అందువల్ల కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుని అవగాహన పెంపొందించుకోవచ్చు.
భారత్‌లో అమలవుతున్న భూసంస్కరణలు సాంఘిక, ఆర్థికాభివృద్ధికి ఎంత వరకు దోహదపడ్డాయి? భూ సంస్కరణలు, కౌలు సంస్కరణల అమల్లో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను అధ్యయనం చేయాలి.

గ్రూప్స్ జనరల్ స్టడీస్‌కు సంబంధించి రసాయనశాస్త్ర అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి?
+
గత కొంత కాలంగా కెమిస్ట్రీ విభాగం నుంచి అడుగుతున్న ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రశ్నలన్నీ విస్తృతంగా కాకుండా.. మనచుట్టూ, నిత్య జీవితంలో ఎదురయ్యే విషయాలకు, ఉపయోగించే పదార్థాలకు సంబంధించిన అనువర్తనాలపై ఉండటాన్ని గమనించవచ్చు. రసాయన శాస్త్రాన్ని ప్రధానంగా మూలక రసాయన శాస్త్రం, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం, సాధారణ రసాయన శాస్త్రంగా విభజించి చదువుకోవాలి.
ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు: పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, రేడియోధార్మికత, కేంద్రక రసాయనశాస్త్రం, వివిధ కుటుంబాలకు చెందిన మూలకాలు-ఆవర్తనాలు, లోహశాస్త్రం, జీవాణువులు, పాలీమర్లు, ఇంధనాలు, హైడ్రోకార్బన్లు, కొల్లాయిడ్‌లు, ఆమ్లాలు-క్షారాలు, వాయు నియమాలు, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఎరువులు, క్రిమి సంహారిణులు, ఔషధాలు, వివిధ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు, నోబెల్ బహుమతులు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, గాజు, సిమెంట్, వివిధ పదార్థాల రసాయన నామాలు.
రసాయన శాస్త్రంలో సాధారణంగా రెండు రకాలు ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కంటెంట్ ప్రశ్నలు. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు (అప్లికేషన్ టైప్). కంటెంట్ ప్రశ్నలు.. జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు అన్వయ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి.

పోటీ పరీక్షల్లో జంతువుల విస్తరణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చేందుకు
అవకాశముంది?
+
అవకాశముంది?
జంతువుల విస్తరణకు సంబంధించి అడిగే ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. జంతువుల ఆవాసాలు, అవి నివసించే ప్రదేశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇస్తుంటారు. ఎందుకంటే కొన్ని జంతువులు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కాబట్టి ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా కంగారు, ఎకిడ్నా, ప్లాటిపస్, ఎలుగుబంటి వంటి జంతువులకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. ఇందుకోసం వాటి ఆవాస ప్రాంతాలు, దేశాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణ- కంగారు అనేది ఆస్ట్రేలియాలో కనిపిస్తోంది. ఆ జంతువులకు ప్రత్యేకమైన అభయారణ్యాలను చదవాలి.
పోటీ పరీక్షల కోసం ‘భారతదేశం- నీటిపారుదల వసతులు’ను ఎలా అధ్యయనం చేయాలి?
+
ప్రతి పోటీ పరీక్షలో ఈ పాఠ్యభాగం నుంచి ఒకటి, రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో ఎక్కువమంది ప్రజల జీవనాధారం వ్యవసాయం. దీనికి ప్రధానంగా నీటిసౌకర్యాలు కావాలి. వర్షపాతం రుతుపవనాలపై ఆధారపడి ఉండటం వల్ల భారతదేశమంతా నీటిపారుదల సౌకర్యాల్లో వ్యత్యాసాలున్నాయి. మనదేశానికి ప్రధానంగా ఈశాన్య రుతుపవనాలు, నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం లభిస్తోంది. తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వివిధ పంచవర్ష ప్రణాళికల్లోనూ దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల దృష్ట్యా ఈ పాఠ్యభాగం అత్యంత ప్రధానమైంది. నీటిపారుదల రకాలు, అవి.. ఎక్కువగా కల్పిస్తున్న రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాలువలు, వాటి ప్రత్యేకతలు మొదలైన అంశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. భారతదేశంలో ప్రధాన నదులు, అవి ప్రవహించే రాష్ట్రాల ఆధారంగా ప్రాజెక్టులు, సాగునీటి కాలువలు నెలకొని ఉన్నాయి. సంబంధిత నదీ పరివాహ ప్రాంత రాష్ట్రాలు, జలాల పంపిణీ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివితే క్షుణ్నమైన అవగాహన ఏర్పరుచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 8, 9, 10వ తరగతి సాంఘికశాస్త్ర పుస్తకాలతోపాటు ఇంటర్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
గ్రూప్స్ పరీక్షల్లో జీవ శాస్త్రానికి సంబంధించి ఏయే అంశాలను అధ్యయనం చేయాలి?
+
గ్రూప్-1, 2 తదితర పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్‌స, ఎన్విరాన్‌మెంటల్ సైన్‌సల నుంచి ప్రశ్నలు అడుగుతారని అభ్యర్థులు గమనించాలి. జనరల్ సైన్‌సలోని బయాలజీ విభాగం కోసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (బోటనీ, జువాలజీ) పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. మొక్కలు, జంతువులు - శాస్త్రీయ నామాలు, ప్రత్యేక లక్షణాలు తదితర అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు విటమిన్‌స, హార్మోన్‌స, మూలకాలు, పోషణ లాంటి అంశాలపై విస్తృత అవగాహన ఉండాలి. జెనెటిక్ ఇంజనీరింగ్, డీఎన్‌ఏ టెక్నాలజీ, టిష్యూకల్చర్, సూపర్ ఒవ్యులేషన్, సంకరణం, టెస్ట్‌ట్యూబ్ బేబి, క్లోనింగ్, సరోగసి తదితర ఆధునిక పద్ధతుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. తాజాగా సైన్స్ రంగంలో జరుగుతున్న మార్పులను, కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుంటుండాలి. ఇందుకోసం వివిధ వార్తా పత్రికల ఎడిటోరియల్స్, కాలమ్స్, సైన్‌స రిపోర్టర్ చదవాలి. వీటితోపాటు సైన్స్‌లోని ప్రధాన భావనలను, మూల సిద్ధాంతాలను, చరిత్ర గతిని మార్చిన గొప్ప ఆవిష్కరణలు - శాస్త్రవేత్తలను ఒక పట్టికలా సిద్ధం చేసుకోవాలి. వీటిని వీలు దొరికినప్పుడల్లా పునశ్చరణ చేస్తుండాలి. ఇలా చేస్తే జీవ శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు.
గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి భారతదేశ చరిత్ర అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి?
+
ప్రాచీన భారతదేశ చరిత్ర విభాగంలో ముఖ్యాంశాలు-సింధు నాగరికత, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులు, హర్ష సామాజ్య్రం మొదలైనవి. ఇందులో సింధు, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి.
భారతీయ బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించిన భారతీయ బౌద్ధ మతాచార్యుడెవరు?
1) కశ్యప మాతంగుడు
2) ఆచార్య నాగార్జునుడు
3) ఆర్య అసంగుడు
4) ధర్మ కీర్తి
సమాధానం: 2
మధ్యయుగ భారతదేశ చరిత్ర హర్షుడి అనంతర కాలం నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, చోళులు, చాళుక్యులు, విజయనగర సామాజ్య్రం, మొగలులు, మరాఠాలు ఈ విభాగంలోని ముఖ్యులు.
దక్షిణ భారతదేశంలో భూదానాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారెవరు?
1) సైనికులు, అధికారులు
2) బ్రాహ్మణులు
3) దేవాలయాలు
4) 2, 3
సమాధానం: 4
ఔరంగజేబు మరణించిన సంవత్సరం (1707) నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చివరి మొగల్ రాజులు, బ్రిటషర్ల రాక, భారతదేశ ఆక్రమణ, వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు-ఉద్యమాలు, సామాజిక మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్‌లు, వైస్రాయ్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. మిగతా విభాగాల కంటే ఈ అంశం నుంచే ప్రశ్నలు అధికంగా అడిగే అవకాశం ఉంది.
శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి గత ఉద్యమాల కంటే భిన్నమైన అంశం?
1) రైతులు పాల్గొనడం
2) విద్యార్థులు పాల్గొనడం
3) వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడం
4) మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం
సమాధానం: 4
భారతీయ బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించిన భారతీయ బౌద్ధ మతాచార్యుడెవరు?
1) కశ్యప మాతంగుడు
2) ఆచార్య నాగార్జునుడు
3) ఆర్య అసంగుడు
4) ధర్మ కీర్తి
సమాధానం: 2
మధ్యయుగ భారతదేశ చరిత్ర హర్షుడి అనంతర కాలం నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, చోళులు, చాళుక్యులు, విజయనగర సామాజ్య్రం, మొగలులు, మరాఠాలు ఈ విభాగంలోని ముఖ్యులు.
దక్షిణ భారతదేశంలో భూదానాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారెవరు?
1) సైనికులు, అధికారులు
2) బ్రాహ్మణులు
3) దేవాలయాలు
4) 2, 3
సమాధానం: 4
ఔరంగజేబు మరణించిన సంవత్సరం (1707) నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చివరి మొగల్ రాజులు, బ్రిటషర్ల రాక, భారతదేశ ఆక్రమణ, వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు-ఉద్యమాలు, సామాజిక మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్‌లు, వైస్రాయ్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. మిగతా విభాగాల కంటే ఈ అంశం నుంచే ప్రశ్నలు అధికంగా అడిగే అవకాశం ఉంది.
శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి గత ఉద్యమాల కంటే భిన్నమైన అంశం?
1) రైతులు పాల్గొనడం
2) విద్యార్థులు పాల్గొనడం
3) వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడం
4) మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం
సమాధానం: 4
పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఏ విధంగా ఉంటుంది?
+
సబ్జెక్టుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని ఔపోసన పట్టాలి. ప్రశ్నల స్థాయిని బట్టి విషయాన్ని మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుని తార్కికంగా, విశ్లేషణాత్మకంగా, విచక్షణా జ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి; విషయ అవగాహనకు సంబంధించినవి, విషయ అనువర్తనకు సంబంధించినవి.
జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి: ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థి పరిజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే విస్తృత పఠనంతో పాటు పునశ్చరణ అవసరం. ఈ ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతుంది.
విషయ అవగాహనకు సంబంధించినవి: కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన, తెలివితేటలను పరీక్షిస్తాయి. ఇవి రెండూ నిరంతర సాధన, ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమవుతాయి.
విషయ అనువర్తనకు సంబంధించినవి: ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతైన ఆలోచనతో పాటు సహజ ప్రతిభ, విచక్షణాశక్తులను ఉపయోగించాలి. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి అప్లికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి: ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థి పరిజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే విస్తృత పఠనంతో పాటు పునశ్చరణ అవసరం. ఈ ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతుంది.
విషయ అవగాహనకు సంబంధించినవి: కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన, తెలివితేటలను పరీక్షిస్తాయి. ఇవి రెండూ నిరంతర సాధన, ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమవుతాయి.
విషయ అనువర్తనకు సంబంధించినవి: ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతైన ఆలోచనతో పాటు సహజ ప్రతిభ, విచక్షణాశక్తులను ఉపయోగించాలి. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి అప్లికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
గ్రూప్-1 మెయిన్స్ (రీఎగ్జామ్)లో జనరల్ ఎస్సేను ఎలా ప్రజెంట్ చేస్తే మంచి మార్కులు వస్తాయి?
+
మొదట ఇచ్చిన ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి. ఇతర పేపర్లతో పోల్చితే ఎస్సే పేపర్‌లో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది. మీకు ఎంత సమయం అందుబాటులో ఉంటుందో మిగిలిన వారికీ అంతే ఉంటుందన్న విషయం గుర్తించి, నిర్దేశ సమయం, ముందుగా సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్‌ల ఆధారంగా ఎస్సే రాయాలి. పొంతన లేని కొటేషన్స్, సామెతలు లేకుండా చూడాలి. సందర్భాన్ని బట్టి అవసరమైనంతలో మంచి కొటేషన్స్, సామెతలు ఉపయోగించవచ్చు. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. బాక్స్‌లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్‌లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు సముచితంగా ఉపయోగించాలి. వ్యాసంలో అతి ముఖ్యమైన సమాచారాన్ని అండర్‌లైన్ చేయాలి. ఇలాంటివి పేజీలో రెండు లేదా మూడు అంశాలకు పరిమితం చేయాలి. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి.
నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించేలా ఉండకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. ఎస్సేకు ముగింపు రాసే ముందు అప్పటివరకు రాసిన భాగాన్ని మరోసారి చదవాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.

గ్రూప్స్ పరీక్షల్లో బయాలజీకి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి?
+
గ్రూప్-1, 2 తదితర సర్వీసులకు సంబంధించిన సిలబస్‌ను ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచారు. దీనిలో భాగంగా జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్‌స, ఎన్విరాన్‌మెంటల్ సైన్‌స రెండు అంశాలుగా ఉంటుందని గమనించాలి. బయాలజీ విభాగం కోసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (బోటనీ, జువాలజీ) వరకు పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. మొక్కలు, జంతువులు, వాటి వర్గీకరణ, విస్తరణ, సాధారణ, ప్రత్యేక లక్షణాలు తదితర అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు విటమిన్‌స, హార్మోన్‌స, మూలకాలు, పోషణ లాంటి అంశాలపై విస్తృత అవగాహన ఉండాలి. టెక్నాలజీకి సంబంధించి జీవశాస్త్ర విభాగంలో ముఖ్యంగా మొక్కల్లో, జంతువుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఏవిధంగా ఉంది? అది మానవ సంక్షేమానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలు ముఖ్యమైనవి. జెనిటిక్ ఇంజనీరింగ్, డీఎన్‌ఏ టెక్నాలజీ, టిష్యూకల్చర్, సూపర్ ఒవ్యులేషన్, సంకరణం, టెస్టుట్యూబ్ బేబీ, క్లోనింగ్, సరోగసి తదితర ఆధునిక పద్ధతుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నోటిఫికేషన్‌కు సంబంధించి రాతపరీక్షలో సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌కు ఎలా సిద్ధమవ్వాలి? రిఫరెన్స్ పుస్తకాలు తెలియజేయండి?
+
పేపర్-2లో Strength of Material, Fluid Mechanics and Machinery సబ్జెక్టులు ఉన్నాయి. సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌ను బట్టి పటిష్ట ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించొచ్చు. వీటిలో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ నుంచి 75 మార్కులకు, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్‌లో కొత్తగా ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, థియరీ ఆఫ్ ఫెయిల్యూర్, థిక్ సిలిండర్ తదితర అంశాలను చేర్చారు. ఇంజనీరింగ్ మెకానిక్స్‌లో ఫోర్స్, మూమెంట్స్ ఫ్రిక్షన్, ఈక్విలిబ్రియంలకు సంబంధించిన అంశాలను ముందుగా చదవాలి. దీనివల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్‌లోని ఇతర అంశాలను తేలిగ్గా చదివి, అర్థం చేసుకోవచ్చు. ఫ్లూయిడ్ మెకానిక్స్‌పై పట్టు సాధిస్తే పేపర్-3లోనూ మంచి స్కోర్ సాధించవచ్చు. అందువల్ల దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి.
రిఫరెన్స్ పుస్తకాలు:
రిఫరెన్స్ పుస్తకాలు:
సివిల్ ఇంజనీరింగ్: R.S.Kurmi; Gupta and Gupta; R.Agor; Dr. P.Jayaram Reddy
మెకానికల్ ఇంజనీరింగ్: R.K.Jain, R.K.Rajput, R.S.Kurmi, Handa and Handa
రిఫరెన్స్ పుస్తకాలు:
- Strength of materials by S.Ramamrutham
- Fluid mechanics and hydraulic machine by R.K.Bansal
రిఫరెన్స్ పుస్తకాలు:
సివిల్ ఇంజనీరింగ్: R.S.Kurmi; Gupta and Gupta; R.Agor; Dr. P.Jayaram Reddy
మెకానికల్ ఇంజనీరింగ్: R.K.Jain, R.K.Rajput, R.S.Kurmi, Handa and Handa
కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే ఏం చేయాలి?
+
కరెంట్ అఫైర్స్‌కు నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా, దాన్నుంచి ప్రశ్న రావొచ్చు. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే రోజూ వార్తా పత్రికలు చదవడం తప్పనిసరి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లను ఎంపిక చేసుకొని, చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పోటీ పరీక్షలను బట్టి కరెంట్ అఫైర్స్ ప్రశ్నల సరళి, క్లిష్టత మారుతుంది. అయితే ప్రధానంగా ఈ కింది విభాగాల సమకాలీన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు.
వాణిజ్య వ్యవహారాలు.
సైన్స్ అండ్ టెక్నాలజీ.
పర్యావరణం.
వార్తల్లో వ్యక్తులు.
రాజకీయ సంఘటనలు
భౌగోళిక ప్రాధాన్య ప్రదేశాలు
రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు.
క్రీడల సమాచారం.
దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు
అంతర్జాతీయ సదస్సులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పరిధి ఆధారంగా ప్రిపరేషన్
పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని,దానికి అనుగుణంగా సిద్ధంకావాలి. ఇందుకోసం గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, వాటి క్లిష్టతను పరిశీలించాలి. బ్యాంకు పరీక్షల్లో ఎక్కువగా బ్యాంకింగ్, ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వాల వార్షిక బడ్జెట్‌లు, ఆర్థిక సర్వేలు, ప్రభుత్వ పథకాలు, ఆర్‌బీఐ ప్రకటించే పాలసీ రేట్లు, పంచవర్ష ప్రణాళికలు, వివిధ కమిషన్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు రాష్ట్రస్థాయి సంఘటనలను కూడా చదవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాలు, పురస్కారాలు వంటి వాటిని చదవాలి.

గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి ఎకానమీకి ఎలా సిద్ధమవాలి?
+
గ్రూప్స్ జనరల్ స్టడీస్ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, బ్యాంకింగ్, భూ సంస్కరణలు, పన్నుల వ్యవస్థ, పారిశ్రామిక తీర్మానాలు, బడ్జెట్, విదేశీ వాణిజ్యం, జాతీయాదాయం, జనాభా, ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, సెబీ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, మానవాభివృద్ధి అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నట్లు గుర్తించొచ్చు. ప్రణాళికలను అధ్యయనం చేసే క్రమంలో వివిధ ప్రణాళికల లక్ష్యాలు, ప్రణాళికల్లో రంగాల మధ్య వనరుల కేటాయింపు, 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను అధ్యయనం చేయాలి.
స్వయం ఉపాధి, వేతన ఉపాధి పథకాలను విడిగా గుర్తించేలా చదవాలి. 2011 జనాభా లెక్కలను అంశాల వారీగా అధ్యయనం చేయాలి. ఆర్థిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పదజాలంపై అవగాహన పెంపొందించుకోవాలి. పన్నుల వ్యవస్థ- కోశ విధానం నుంచి జీఎస్‌లో 1 నుంచి 2 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విధించే పన్నులు.. రాజా చెల్లయ్య, కేల్కర్ కమిటీల సిఫార్సులను అధ్యయనం చేయాలి. బడ్జెట్‌లోని వివిధ కాన్సెప్టులపై అవగాహన అవసరం.
విదేశీ వాణిజ్యంలో భాగంగా ప్రధాన ఎగుమతులు, దిగుమతులు; మూలధన అకౌంట్‌లో రూపాయి మార్పిడికి సంబంధించిన అంశాలపై నోట్స్ రూపొందించుకోవాలి. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదికలోని వివిధ సూచీలు, వాటికి సంబంధించి భారత్ పరిస్థితిని విశ్లేషించాలి.

పోటీ పరీక్షల్లో పాలిటీ ప్రాధాన్యం ఏమిటి? ముఖ్యంగా ఏ అంశాలపై దృష్టి సారించాలి?
+
ప్రతి పోటీ పరీక్షలో పాలిటీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. పరీక్షలో విజయం సాధించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఇండియన్ పాలిటీపై అవగాహన పెంచుకోవాలంటే సబ్జెక్ట్‌ను విశ్లేషణాత్మకంగా, లోతుగా అధ్యయనం చేయాలి. ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చదువుతున్నప్పుడు వర్తమాన అంశాలకు అన్వయిస్తూ, తులనాత్మకంగా చదవాలి.
ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ అభివృద్ధి, లక్షణాలు; ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు; కేంద్ర కార్యనిర్వాహక, శానన నిర్మాణ, న్యాయ వ్యవస్థలు; రాష్ర్టప్రభుత్వం; కేంద్ర, రాష్ర్ట సంబంధాలు; స్థానిక ప్రభుత్వాలు; రాజకీయ పార్టీలు; ఎన్నికల సంస్కరణలు; వివిధ సంస్థలు మొదలైన అంశాలపై అవగాహన ఉండటం తప్పనిసరి.
‘చదువుతున్నప్పుడు పాలిటీ సులభంగానే అర్థమవుతుందిగానీ, చదివిన అంశం ఎక్కువ కాలం గుర్తుండటం లేదు. కన్‌ఫ్యూజన్ వల్ల కొన్నిసార్లు తెలిసిన ప్రశ్నలకూ సరైన సమాధానాన్ని గుర్తించలేకపోతున్నాం’ అని గతంలో పోటీ పరీక్షలు రాసిన చాలా మంది విద్యార్థులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం సబ్జెక్ట్‌ను క్రమ పద్ధతిలో లోతుగా అధ్యయనం చేయకపోవడమే.

పోటీ పరీక్షల కోసం ‘భారతదేశం - నీటి పారుదల వసతులు’ను ఎలా అధ్యయనం చేయాలి?
+
ప్రతి పోటీ పరీక్షలో భారతదేశం - నీటిపారుదల నుంచి 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజల జీవనాధారం వ్యవసాయం. దీనికి ప్రధానంగా నీటి సౌకర్యాలు కావాలి. వర్షపాతం రుతుపవనాలపై ఆధారపడి ఉండటం వల్ల భారతదేశమంతా నీటిపారుదల సౌకర్యాల్లో వ్యత్యాసాలున్నాయి. అందువల్ల ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వివిధ పంచవర్ష ప్రణాళికల్లోనూ దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల దృష్ట్యా ఈ అంశం అత్యంత ప్రధానమైంది. నీటిపారుదల రకాలు, అవి ఎక్కువగా కల్పిస్తున్న రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాలువలు, వాటి ప్రత్యేకతలు మొదలైన అంశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. భారతదేశంలో ప్రధాన నదులు, అవి ప్రవహించే రాష్ట్రాల ఆధారంగా ప్రాజెక్టులు, సాగునీటి కాలువలు నెలకొని ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇలాంటి అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివితే క్షుణ్నమైన అవగాహన ఏర్పరచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 8, 9, 10వ తరగతి సాంఘికశాస్త్ర పుస్తకాలతోపాటు ఇంటర్ జాగ్రఫీ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి.
పోటీ పరీక్షల్లోజాగ్రఫీ ప్రిపరేషన్‌కు సంబంధించి కొన్ని సూచనలివ్వండి.
+
పోటీ పరీక్షల్లో భూగోళ శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ విభాగంలో ప్రశ్నల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. జాగ్రఫీ చదివేటప్పుడు తప్పనిసరిగా అట్లాస్‌ను ముందుంచుకోవాలి. పాఠ్యాంశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తే ఎక్కువ అంశాలు గుర్తుంటాయి. ఎందుకంటే దీంట్లో ఒక అంశం మరొకదాంతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు నైసర్గిక స్థితి ఆధారంగా వర్షపాతం ఉంటుంది. వర్షపాతాన్ని బట్టి అడవులు విస్తరించి ఉన్నాయి. చదివేటప్పుడు ఇదే క్రమాన్ని పాటిస్తే సులభంగా అర్థమవుతుంది. పరీక్షల్లో భారతదేశ భూగోళ శాస్త్రంపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల రాష్ట్రాలు - రాజధానులు, నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, వర్షపాతం, అడవులు మొదలైన అంశాలపై అవగాహన ఉండటం తప్పనిసరి. దేశంలో అతి పెద్దవి, అతి చిన్నవి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నవాటిని గుర్తుంచుకోవాలి.
పోటీ పరీక్షల్లో ‘విద్యుత్’ నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు?
+
భౌతిక శాస్త్రంలో ‘విద్యుత్’ పాఠ్యాంశం చాలా విస్తృతమైంది. దీన్ని ప్రణాళికాబద్ధంగా చదవాలి. ముఖ్యంగా విద్యుత్ పొటెన్షియల్, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలపై సమస్యలను సాధన చేయాలి. కానిస్టేబుల్ పరీక్షల కోసం 6 నుంచి పదో తరగతి వరకు భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఓమ్ నియమం, విద్యుదయ స్కాంత ఫలితాలు, వాటి అనువర్త నాలు, విద్యుదయస్కాంత ప్రేరణ అనువర్తనాలు ప్రధానమైనవి. ఓమ్ నియమం, లెంజ్ నియమం, ఫ్లెమింగ్ కుడిచేతి, ఎడమచేతి నిబంధనలు, ఫారడే విద్యుద్విశ్లేషణ తదితర నియమాలను నేర్చుకోవాలి. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ వంటి వాటి నిర్మాణం, అవి పనిచేసే విధానంలోని సూత్రాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి. రాశుల ప్రమాణాలను నేర్చుకోవాలి. ఉదా: కరెంటు- ఆంపియర్; పొటెన్షియల్ భేదం- వోల్ట్; నిరోధం- ఓమ్; విశిష్ట నిరోధం- ఓమ్. మీటర్; విద్యుత్ సామర్థ్యం- వాట్; విద్యుత్ రసాయన తుల్యాంకం-గ్రామ్/ కూలుంబ్.
పోటీ పరీక్షల్లో విటమిన్లు, హార్మోన్లపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వీటిని ఏవిధంగా చదవాలి?
+
అన్ని రకాల పోటీ పరీక్షల్లో హార్మోన్లు, విటమిన్లపై సర్వసాధారణంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ రెండు అంశాల్లో ప్రతి దాని నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. విటమిన్లు, వాటి చారిత్రక అంశాలు, గుర్తించిన వారు, వాటి రకాలు, ఉనికి, విధులు మొదలైన విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా వివిధ రకాల హార్మోన్లు, వాటిని ఉత్పత్తి చేసే గ్రంథులు, ఉత్పత్తికి అవసరమైన మూలకాలు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు/ ప్రభావం గురించి చదవాలి.
మొక్కలకు సంబంధించిన హార్మోన్లపై ముఖ్యంగా వాటి ప్రభావం వల్ల కలిగే ఫలితాల గురించి అడుగుతారు.
ఉదాహరణ:
1) ఫలాలు త్వరగా రాలిపోవడానికి ఏ హార్మోన్ దోహదం చేస్తుంది?
2) విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఏ హార్మోన్ అవసరం?
3) ఫలాలు త్వరగా పక్వం చెందడానికి అవసరమయ్యే హార్మోన్ ?
ప్రశ్నలో కొద్ది మార్పుతో భిన్న సమాధానాలున్న ప్రశ్నలను అడగవచ్చు.
విటమిన్ల రకాలు, అవి లభించే పదార్థాలు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు మొదలైన అంశాలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి.

పోటీ పరీక్షల్లో భారతదేశ పర్వతాలు, కనుమలు వంటి అంశాలపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రధానంగా వింధ్య, సాత్పురా, ఆరావళి పర్వతాలు, వాటిలో ఎత్తయిన శిఖరాలు; పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అవి కలిసే ప్రదేశం, వాటిలోని శిలలు; మాల్వా పీఠభూమి; ద్వీపకల్ప పీఠభూమిలోని వివిధ ప్రాణులు తదితరాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు గమనించవచ్చు. ఉదాహరణకు ‘తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి?’ అని అడిగారు. ఈ ప్రశ్న సులువైనదే అయినా చాలామంది తప్పు సమాధానం గుర్తించారు. దీనికి కారణం సరైన అవగాహన లేకపోవడమే. ఈ టాపిక్‌లో అనేక అంశాల మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వీటిని చదివేటప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపం పటాన్ని ముందుంచుకొని, ఒక అంశానికి మరొక అంశానికి సంబంధం గుర్తుంచుకుంటూ పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయాలి.
పోటీ పరీక్షల్లో జడవాయువులపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? వీటికోసం ఎలా సన్నద్ధమవ్వాలి?
+
పోటీ పరీక్షల్లో వివిధ మూలకాలు, వాటి ఉపయోగాలకు సంబంధించిన ప్రశ్నలను తరచుగా అడుగుతున్నారు. మూలకాలను వివిధ కుటుంబాలుగా విభజించారు. వీటిలో జడవాయువులు అనే కుటుంబం ఒకటి. గతంలో ఈ చాప్టర్‌పై చాలా పరీక్షల్లో ప్రశ్నలు అడిగారు. అందువల్ల మూలకాల పేర్లు, వాటి ఉనికి, ఆవిష్కరణ, వివిధ క్షేత్రాల్లో వాటి అనువర్తనాలు తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. గతంలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జడవాయు కుటుంబంలోని మూలకాల పేర్లపై కింది ప్రశ్న అడిగారు.
ప్ర: కిందివాటిలో జడవాయువు కానిదేది?
1) ఆర్గాన్
2) హీలియం
3) బ్రోమిన్
4) క్రిప్టాన్
ఇచ్చిన ఆప్షన్లలో ‘బ్రోమిన్’ సరైన సమాధానం. ఇది జడవాయు కుటుంబానికి పక్కనే ఉన్న హాలోజన్లకు చెందింది.
‘గజ ఈతగాళ్లు సముద్ర లోతుల్లో శ్వాస కోసం ఉపయోగించే వాయు మిశ్రమంలో నైట్రోజన్ బదులు హీలియంను ఎందుకు ఉపయోగిస్తారు?’ అనే ప్రశ్న రావొచ్చు. అధిక పీడనం వద్ద నైట్రోజన్ రక్తంలో కరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించరు. అదేవిధంగా నియాన్ లైట్లలో వివిధ రంగుల కాంతి గురించి ప్రశ్నలు అడగవచ్చు. అందువల్ల ఈ అంశాలన్నింటిపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. వీటి కోసం ఇంటర్మీడియెట్ రసాయనశాస్త్రం పాఠ్యపుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి.

పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి ఏవిధమైన ప్రశ్నలు వస్తాయి? దీనికి ఎలా సన్నద్ధమవ్వాలి?
+
గ్రూప్స్ జనరల్ స్టడీస్‌లో మెంటల్ ఎబిలిటీ ముఖ్య విభాగం. గ్రూప్స్‌తోపాటు కానిస్టేబుల్, ఎస్సై తదితర పరీక్షల్లోనూ దీని ప్రాధాన్యం ఎక్కువే. దీంట్లో భాగంగా వెర్బల్, నాన్‌వెర్బల్, లాజికల్ రీజనింగ్‌తోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్ లాంటి అంశాలుంటాయి. క్రమ పరీక్ష, భిన్న పరీక్ష, క్యాలెండర్, దిశలు, దూరాలు, రక్త సంబంధాలు, పోలిక పరీక్ష తదితర అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. మెంటల్ ఎబిలిటీ విభాగానికి చెందిన ప్రశ్నలను మ్యాథ్‌స విద్యార్థులే చేయగలుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ సాధన చేస్తే ఆర్‌ట్స, మ్యాథ్‌స అనే భేదం లేకుండా ఎవరైనా ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. పరీక్షలో సమయం చాలా విలువైంది. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కచ్చితత్వం కూడా అలవడుతుంది. క్రమ పరీక్ష, నంబర్ పోలిక, భిన్న పరీక్ష, డేటా ఇంటర్ ప్రిటేషన్‌కు సంబంధించిన సమస్యలను సాధించడానికి 1 నుంచి 20 వరకు ఎక్కాలు; 1 నుం చి 25 వరకు వర్గాలు, ఘనాలు తెలిసి ఉండాలి. తద్వారా వేగంగా జవాబులు గుర్తించవచ్చు. అదేవిధంగా కోడింగ్-డీకోడింగ్‌లోని ప్రశ్నలకు సులభంగా సమాధానం గుర్తించడానికి A నుంచి Z వరకు, Z నుంచి A వరకు సంఖ్యా క్రమం తెలిసి ఉండాలి. దిశలు-దూరాలు అధ్యాయంలోని సమస్యలను సాధించడానికి అన్ని దిశలు తెలిసి ఉండాలి. దిశల్లోని మొదటి అక్షరాలతో (ఉ, ఈ, తూ, ఆ, ద, నై, ప, వా) అన్ని దిశలను గుర్తుంచుకోవాలి.
పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది.
పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది.