UPSC Exams FAQs
ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఇండియన్ పాలిటీ, ఎకానమీలోని ముఖ్యాంశాలు తెలియజేయండి?
+
ఇండియన్ పాలిటీకి సంబంధించి స్టాక్ అంశాలతో పాటు సమకాలీన పరిణామాలపై దృష్టిసారించడం ముఖ్యం. రాజ్యాంగ రచన, పీఠిక, దాని తత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు-శాసన వ్యవస్థ; న్యాయ వ్యవస్థ; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర అంశాలపై దృష్టిసారించాలి. రాజ్యాంగంలోని ముఖ్య అధికరణలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పారిభాషిక పదాలు, ప్రధాన రాజ్యాంగ సవరణలు, ఎన్నికల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి.
ప్రాథమిక హక్కులు-విస్తరణ, విద్యా హక్కు, సమాచార హక్కు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాల అభ్యున్నతికి సంబంధించిన సంక్షేమ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. వివిధ కమిషన్లు, వాటి కూర్పు, ప్రస్తుత చైర్మన్లు వంటి వాటిపై దృష్టిసారించాలి.
దేశంలోని పంచాయతీ రాజ్ వ్యవస్థ, పరిణామ క్రమం, నిర్మాణాన్ని తెలుసుకోవాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లోని ముఖ్య అంశాలపై దృష్టిసారించాలి. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు/కార్యక్రమాల (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వంటి) గురించి తెలుసుకోవాలి.
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు; నీతి ఆయోగ్; పేదరికం-నిర్మూలన కార్యక్రమాలు; నిరుద్యోగం-తగ్గించే ఏర్పాట్లు; జనాభా; సహజ వనరులు, పరిశ్రమల విస్తరణ; ద్రవ్యోల్బణం, జాతీయ ఆదాయం, ఆర్థిక సంస్కరణలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలకు సంబంధించి సమకాలీన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. జీడీపీలో వివిధ రంగాల వాటాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులు; ఎగుమతులు తదితర అంశాలు ముఖ్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విధానాలు, భూ సంస్కరణల గురించి తెలుసుకోవాలి. ఆర్థిక సర్వే, బడ్జెట్‌లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించడం ముఖ్యం.
ప్రాథమిక హక్కులు-విస్తరణ, విద్యా హక్కు, సమాచార హక్కు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాల అభ్యున్నతికి సంబంధించిన సంక్షేమ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. వివిధ కమిషన్లు, వాటి కూర్పు, ప్రస్తుత చైర్మన్లు వంటి వాటిపై దృష్టిసారించాలి.
దేశంలోని పంచాయతీ రాజ్ వ్యవస్థ, పరిణామ క్రమం, నిర్మాణాన్ని తెలుసుకోవాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లోని ముఖ్య అంశాలపై దృష్టిసారించాలి. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు/కార్యక్రమాల (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వంటి) గురించి తెలుసుకోవాలి.
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు; నీతి ఆయోగ్; పేదరికం-నిర్మూలన కార్యక్రమాలు; నిరుద్యోగం-తగ్గించే ఏర్పాట్లు; జనాభా; సహజ వనరులు, పరిశ్రమల విస్తరణ; ద్రవ్యోల్బణం, జాతీయ ఆదాయం, ఆర్థిక సంస్కరణలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలకు సంబంధించి సమకాలీన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. జీడీపీలో వివిధ రంగాల వాటాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులు; ఎగుమతులు తదితర అంశాలు ముఖ్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విధానాలు, భూ సంస్కరణల గురించి తెలుసుకోవాలి. ఆర్థిక సర్వే, బడ్జెట్‌లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించడం ముఖ్యం.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో దృష్టిసారించాల్సిన అంశాలు తెలియజేయండి?
+
- సిలబస్‌లోని ప్రతి అంశంపైనా దృష్టిసారించాలి. ఆసక్తి లేదనో.. లేదంటే కష్టంగా ఉందనో కొన్ని అంశాలను వదిలేయడం మంచిది కాదు. యూపీఎస్సీ.. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ప్రతి అంశంపైనా దృష్టిసారిస్తుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
- గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సమకాలీన అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. సిలబస్‌లోని అంశాలను, వర్తమాన అంశాలతో జోడించి అధ్యయనం చేయడం లాభిస్తుంది.
- గత రెండేళ్ల ప్రశ్నపత్రాలను చూస్తే ప్రశ్నల స్థాయి పెరిగిందన్న విషయం తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బట్టీ పద్ధతికి స్వస్తిచెప్పి, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
- ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత ఉండొచ్చనే విషయంపై చర్చలు, ఆలోచనలు అనవసరం. ప్రశ్నల కాఠిన్యత, అభ్యర్థుల పెర్‌ఫార్మెన్స్‌పై కటాఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రస్తుతం పట్టించుకోకుండా మొత్తం దృష్టంతా ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌పైనే ఉంచడం మంచిది.
- మాక్‌టెస్ట్‌లు రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం 7-10 టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లు తెలుస్తాయి. బలహీనంగా ఉన్నామనుకున్న అంశాలపై దృష్టిసారించేందుకు వీలుంటుంది.
- ప్రిపరేషన్‌కు ఇంటర్నెట్‌ను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. రోజువారీ వార్తల్లో కొత్తగా వచ్చే కాన్సెప్టులపై స్పష్టత కోసం యూట్యూబ్‌లో నిపుణులు అందించే క్లాసులు వినవచ్చు.
- కొన్ని ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు ఆన్‌లైన్ మాక్‌టెస్టులు నిర్వహించి సమాధానాలను విశ్లేషిస్తాయి. ఇవి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి. ఐఏఎస్ బాబా, ఫోరమ్ ఐఏఎస్ తదితర వెబ్‌సైట్లలో ఉచిత మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. గ్రామీణ విద్యార్థులు, కోచింగ్ తీసుకోలేని వారు వీటిని ఉపయోగించుకోవచ్చు.
- కరెంట్ అఫైర్స్ కోసం ఏదైనా ఒక కోచింగ్ సంస్థ విడుదల చేసే మ్యాగజైన్ చదవాలి. పీఐబీ అప్‌డేట్స్‌ను సంకలనం చేసి మార్కెట్లో మ్యాగజైన్స్‌గా వస్తున్నాయి. వీటిని చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ విభాగానికి సన్నద్ధత లభిస్తుంది. ఇక నిత్యం పేపర్ చదవడం వల్ల సివిల్స్ మెయిన్స్‌లో వ్యాసరూప ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయొచ్చు.
- జనరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్ అంశాలకు రిఫరెన్స్ పుస్తకాలతో పాటు సమకాలీన పరిణామాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ విభాగాల నుంచి కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానిస్తూ ప్రశ్నలు వస్తున్నాయి.
రిఫరెన్స్ పుస్తకాలు...
- ప్రాచీన, మధ్యయుగ చరిత్ర: పాత ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
- ఆధునిక చరిత్ర: స్పెక్ట్రం.
- భారతీయ సంస్కృతి: ఎన్‌సీఈఆర్‌టీ 11వ తరగతి ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్.
- ఇండియన్ పాలిటీ: లక్ష్మీకాంత్.
- జాగ్రఫీ: ఎన్‌సీఈఆర్‌టీ 9 నుంచి 12వ తరగతి పుస్తకాలు, ఫిజికల్ జాగ్రఫీకి Goh Cheng Leong.
- జనరల్ సైన్స్: 8 నుంచి 10వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
- ఇండియన్ ఎకానమీ: 2019 బడ్జెట్, రమేష్‌సింగ్ పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు.
సివిల్స్ పాలిటీకి ఎలా సిద్ధమవాలి?
+
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో పాలిటీని కీలక విభాగంగా చెప్పొచ్చు. ఈ సబ్జెక్టుపై పట్టు సాధించడానికి భారత రాజ్యాంగంపై క్షుణ్నంగా అవగాహన ఏర్పరచుకోవాలి. రాజ్యాంగ పీఠిక మొదలు.. అందులోని అధికరణలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. ఇందుకోసం ముందుగా బీఏ మూడు సంవత్సరాల పొలిటికల్ సైన్స్ పుస్తకాలను చదవాలి. ఇలా మౌలిక అంశాలపై పట్టు సాధిస్తూనే.. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చేసిన సవరణలు, వాటికి సంబంధించి రూపొందిన చట్టాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా.. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సంస్థలు, వాటి విధి విధానాలు, సభ్యులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి.
- గత నాలుగైదేళ్ల సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. పాలిటీకి సంబంధించి మౌలిక అంశాలను తాజా పరిణామాలతో అనుసంధానిస్తూ సమాధానం ఇవ్వాల్సిన విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు.
- పాలిటీని ఇతర సబ్జెక్ట్‌లతో ముఖ్యంగా జాగ్రఫీ, ఎకానమీలతో అనుసంధానం చేసుకుంటూ చదివితే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌లోని జనరల్ ఎస్సే నుంచి జనరల్ స్టడీస్ పేపర్-4 వరకు అన్నిటితోనూ అనుసంధానం చేసుకుంటూ చదివే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం కనీసం నాలుగేళ్ల పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం మేలు చేస్తుంది.
- ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్, ఇంట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - డి.డి.బసు, అవర్ కాన్‌స్టిట్యూషన్-సుభాష్ కశ్యప్, అవర్ పార్లమెంట్-సుభాష్ కశ్యప్ పుస్తకాలను చదవడం వల్ల పాలిటీకి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్న నేపథ్యంలో తాజాగా చర్చనీయాంశమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. మొత్తంగా పాలిటీ ప్రిపరేషన్‌కు సంబంధించి అభ్యర్థులు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ముందుకు సాగితేనే ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే సమయంలో పట్టు సాధించే అవకాశాలు మెరుగవుతాయి.
పోటీపరీక్షలకు సంబంధించి అర్థమెటిక్, గణిత అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
- ప్రస్తుతం వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో అర్థమెటిక్ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
- అర్థమెటిక్‌లో భాజనీయతా సూత్రాలు, లాభనష్టాలు, కాలం-దూరం, సగటు, దశాంశ భిన్నాలు, శాతాలు, కాలం-పని, ట్రైన్ ప్రాబ్లమ్స్, భాగస్వామ్యం, బారువడ్డీ-చక్రవడ్డీ, నిష్పత్తి-అనుపాతం, సూక్ష్మీకరణలు, వైశాల్యాలు, నంబర్ సిరీస్, గసాభా-కసాగు, ఘనపరిమాణాలు, పడవలు-ప్రవాహాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- మ్యాథ్స్‌కు సంబంధించిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు, ప్రసిద్ధిగాంచిన రంగాలు కూడా తెలుసుకోవడం మేలు.
- నంబర్లపై పట్టు సాధిస్తే... మిగతా ప్రిపరేషన్ అంతా సులువవుతుంది. నంబర్ సిస్టమ్స్, బాడ్‌మస్ నిబంధనలను తెలుసుకోవాలి. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, శాతాలు వంటి ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేషన్‌సలో వేర్వేరు మోడల్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఎక్కాలు, వర్గాలు-వర్గమూలాలు, ఘన మూలాలను గుర్తుంచుకుంటే ప్రశ్నకు వేగంగా సమాధానం గుర్తించొచ్చు.
- ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న మ్యాథ్స్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. అర్థమెటిక్ కోసం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలతోపాటు ఇతర ఏదైనా ప్రామాణిక మెటీరియల్‌ను అనుసరించొచ్చు.
పోటీపరీక్షలకు సంబంధించి ఇండియన్ పాలిటీ, ఎకానమిలోని ముఖ్యాంశాలు ఏవి?
+
- ఇండియన్ పాలిటీలో ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త అంశాలు, వ్యాఖ్యానాలు, వివరణలు చేరుతుంటాయి. వీటిలో ముఖ్యమైన వాటిపై దృష్టిసారించాలి. రాజ్యాంగ రచన, పీఠిక, దాని తత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు-శాసన వ్యవస్థ; న్యాయ వ్యవస్థ; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర అంశాలపై దృష్టిసారించాలి. రాజ్యాంగంలోని ముఖ్య అధికరణలను గుర్తుంచుకోవాలి. పారిభాషిక పదాలు, ప్రధాన రాజ్యాంగ సవరణలు, ఎన్నికల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి.
- ప్రాథమిక హక్కులు-విస్తరణ, విద్యా హక్కు, సమాచార హక్కు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాల అభ్యున్నతికి సంబంధించిన సంక్షేమ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. వివిధ కమిషన్లు, వాటి కూర్పు, ప్రస్తుత చైర్మన్లు వంటి వాటిపై దృష్టిసారించాలి.
- దేశంలోని పంచాయతీ రాజ్ వ్యవస్థ, పరిణామ క్రమం, నిర్మాణాన్ని తెలుసుకోవాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లోని ముఖ్య అంశాలను తెలుసుకోవాలి. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు/కార్యక్రమాల (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, రూర్బన్, స్వచ్ఛ గ్రామ్..) గురించి తెలుసుకోవాలి.
- భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు; నీతి ఆయోగ్; పేదరికం-నిర్మూలన కార్యక్రమాలు; నిరుద్యోగం-తగ్గించే ఏర్పాట్లు; జనాభా; సహజ వనరులు, పరిశ్రమల విస్తరణ; ద్రవ్యోల్బణం, జాతీయ ఆదాయం, ఆర్థిక సంస్కరణలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- జాతీయ, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలకు సంబంధించి సమకాలీన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. జీడీపీ/జీఎస్‌డీపీలో వివిధ రంగాల వాటాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులు; ఎగుమతులు; మౌలిక వసతులు తదితర అంశాలు ముఖ్యమైనవి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విధానాలు, భూ సంస్కరణల గురించి తెలుసుకోవాలి.
భారతదేశ, రాష్ట్ర భౌగోళిక అంశాలతో పాటు విపత్తు విభాగాన్ని ఎలా చదవాలి?
+
- దేశ, రాష్ట్రాలకు సంబంధించి వర్షపాతం, నేలలు, వ్యవసాయం, సహజ వనరులు తదితర అంశాలు ముఖ్యమైనవి.
- రాష్ట్ర ఉనికి, విస్తీర్ణం తదితర అంశాలపై అవగాహన అవసరం. వివిధ జిల్లాల్లో ప్రముఖ కొండలు/గుట్టలు, వాటిపేర్లు; ఖనిజ వనరులు తదితరాలను తెలుసుకోవాలి.
- దేశంలోని ప్రధాన నదులు, వాటి జన్మస్థలాలు,ఉపనదులపై దృష్టిసారించాలి. రాష్ట్రంలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా; వాటి ఉప నదులు, ప్రాజెక్టులపై ప్రశ్నలు వస్తున్నాయి.
- దేశ, రాష్ట్ర శీతోష్ణస్థితి, రుతుపవనాల ప్రభావాన్ని తెలుసుకోవాలి. రుతుపవనాలను ప్రభావితం చేస్తున్న ఎల్‌నినో, లానినోపై అవగాహన అవసరం. ఒండ్రు, ఎర్ర, నల్లరేగడి, లేటరైట్ మృత్తికలు, లక్షణాలు, విస్తరణ, ప్రధాన పంటల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
- దేశం, రాష్ట్రంలోని అడవులు, రకాలు, విస్తరణ, వృక్ష జాతులు, అటవీ ఉత్పత్తులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ముఖ్యమైనవి. జాగ్రఫీ అంశాల అధ్యయనానికి అట్లాస్ ఉపయోగించడం ముఖ్యం.
- విపత్తు నిర్వహణలో భూకంపాలు, సునామీ, వరదలు తదితర విపత్తులు; ఉపశమన చర్యలు; జాతీయ, రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ యంత్రాంగం; విపత్తు నిర్వహణ చట్టం-2005; జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
పోటీ పరీక్షల్లో ‘భారతదేశ నైసర్గిక స్వరూపం’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
భారతదేశ భూగోళ శాస్త్రంలో ‘నైసర్గిక స్వరూపాలు’ విభాగానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీనిలోని హిమాలయాలు, గంగా - సింధు మైదానాలకు సంబంధించి 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి దీనిలోని ప్రధాన అంశాలైన హిమాలయాల పొడవు, వాటిలోని సమాంతర శ్రేణులు, ఆ శ్రేణుల్లో ఎత్తయిన శిఖరాలు, కనుమలు, లోయలు, మైదానాలు, దానిలోని భూ స్వరూపాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అలాగే గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని పరిశీలిస్తూ మాదిరి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ఈ విభాగం నుంచి మంచి మార్కులు సాధించవచ్చు.
పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలను ఎలా అధ్యయనం చేయాలి?
+
సివిల్స్, గ్రూప్స్, ఇతర పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలపై పట్టు సాధించాలంటే అట్లాస్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. దీనివల్ల ప్రపంచ, భారత, రాష్ట్ర భౌగోళిక అంశాల (నదులు, పర్వతాలు, మైదానాలు, అడవులు తదితర)పై ప్రాథమిక నైపుణ్యాలు లభిస్తాయి. ఆ తర్వాత ఆయా పరీక్షల సిలబస్‌లో పొందుపరచిన అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేయాలి. జాగ్రఫీలో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం సహజ వనరులు, అవి నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లోనే అవి ఎందుకు ఎక్కువగా లభిస్తున్నాయనే దాన్ని తెలుసుకోవాలి. ప్రధాన పంటలు, ప్రాంతాలు; జనాభా విస్తరణ, పరిశ్రమలు, రవాణా, ఉష్ణోగ్రత తదితర అంశాలపైనా దృష్టిసారించాలి. విపత్తు నిర్వహణ అంశాలు కూడా ముఖ్యమైనవే. భూకంపాలు, సునామీలు, వరదలు తదితర విపత్తులు, కారణాలు, నిర్వహణ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రధాన విపత్తులు, సంభవించిన సంవత్సరాలను కూడా తెలుసుకోవాలి. విపత్తు నిర్వహణ సంస్థలపైనా (ఉదా: ఎన్‌డీఎంఏ) అవగాహన అవసరం. పర్యావరణం, పర్యావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాలు, నివారణ చర్యలపైనా పట్టు సాధించాలి. అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పలు దేశాల మధ్య ఒప్పందాలు, ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ఒప్పందాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ఎకాలజీలో ప్రశ్న - సమాధానం కోణంలో కాకుండా డిస్క్రిప్టివ్ పద్ధతిలో అధ్యయనం సాగించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపరేషన్‌లో అనుసరించాల్సిన విధానాలేమిటి?
+
ఉద్యోగ నియామక పరీక్షలకు ఖాళీలతో సంబంధం లేకుండా పోటీ లక్షల్లోనే ఉంటుందనేది నిస్సందేహం. అయితే ఎంత పోటీ ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. సందిగ్ధత వీడి, సన్నద్ధత దిశగా నడవాలని సూచిస్తున్నారు. పరీక్ష ఏదైనా ఔత్సాహికులు ముందుగా ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధమవాలి. ఒత్తిడి అనే మాటకు తావివ్వకూడదు. పోటీ లక్షల్లో ఉన్నా పోస్ట్ సాధించాలనే గట్టి సంకల్పం, విజయం సాధించగలమనే నిండైన ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించగలరు. సంకల్ప బలంతో విజయం దిశగా దూసుకెళ్లగలరు.
- అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రధానం. సమయ పాలన విషయంలో కొందరు 'వారం ఆధారిత' విధానాన్ని అనుసరిస్తారు. ఒక వారంలో ఒక సబ్జెక్టు, మరో వారం మరో సబ్జెక్టును చదువుతారు. ఇది విజయానికి సరైన ప్రణాళిక కాదు. పేపర్ల వారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని, రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే అన్ని అంశాల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది. అంతకుముందు చదివిన అంశాలను రివిజన్ చేసేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి.
- చదివిన అంశాలను గుర్తుంచుకునేందుకు చక్కటి మార్గం షార్ట్ నోట్స్ రూపకల్పన. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలను పాయింట్లుగా, లేదా తమకు అనుకూలమైన రీతిలో (చార్ట్‌లు, గ్రాఫ్‌లు వంటివి) షార్ట్‌నోట్స్ రూపొందించుకోవాలి. చదివిన అంశాలను ఇతరులతో చర్చించటం కూడా మెమరీ పరంగా బాగా ఉపయోగపడే విధానం.
- సొంత నోట్స్ రూపొందించుకోవడం విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. నోట్స్ రూపకల్పనలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలి. చదివిన ప్రతి అంశాన్నీ నోట్స్‌లో పొందుపరిస్తే సమయం వృథా అవుతుంది. గణాంకాలు, సంవత్సరాలు, నివేదికలు-సిఫార్సులు వంటి ముఖ్యాంశాలను మాత్రమే రాసుకోవాలి. క్విక్ రివిజన్‌కు ఉపయోగపడేలా నోట్స్ రూపొందించుకోవాలి.
- అసలు చదువుతున్న అంశాల్లో ఏవి ముఖ్యమైనవనే సందేహం కలుగుతుంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించటం వల్ల ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ప్రశ్న అడిగే విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు ముఖ్యమైనవి. సీనియర్ ఫ్యాకల్టీ, గత విజేతల సూచనల మేరకు ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ప్రతి అంశాన్నీ ఆస్వాదిస్తూ చదవాలి. చదవటాన్ని, సబ్జెక్టు అధ్యయనాన్ని హాబీగా మార్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతుంటే దానికి సంబంధించిన మరో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. అప్పుడే చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి.
గూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల కోసం జనరల్ సైన్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి?
+
జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అలాగే మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తో మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్‌లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్‌పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి.
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ గురించి వివరాలను తెలపండి?
+
రెల్వేస్, సెంట్రల్ వాటర్, సెంట్రల్ ఇంజనీరింగ్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ వంటి జాతీయ స్థాయి విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి పోస్టుల భర్తీ కోసం.. యూపీఎస్‌సీ ప్రతి ఏటా ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. అర్హత: బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మెకానికల్) ఉత్తీర్ణత లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సుల్లో వైర్‌లెస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్ లేదా రేడియో ఇంజనీరింగ్ సబ్జెక్టులను చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలకు: www.upsc.gov.in
వివరాలకు: www.upsc.gov.in
యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్ ఎగ్జామ్‌కు సంబంధించిన వివ రాలను తెలపండి?
+
యూపీఎస్సీ ప్రతి ఏడాది జియాలజిస్ట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/మెరైన్ జియాలజీలో మాస్టర్ డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండు భాగాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తుంది. జనరల్ ఇంగ్లిష్, జియాలజీ, హైడ్రాలజీ అంశాల్లో రాత పరీక్ష ఉంటుంది. వెబ్‌సైట్: www.upsc.gov.in
ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరాలంటే ఎలా?
+
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) ద్వారా భర్తీ చేసే ఆల్ ఇండియా సర్వీసెస్‌లలో ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఒకటి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సీఎస్‌ఈకి అర్హులు. ఇందులో వచ్చిన ర్యాంక్, ప్రాధాన్యతలాధారంగా ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక చేస్తారు. ఈ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులు విదేశాంగ శాఖ, విదేశాల్లోని భారత రాయబార/హై కమిషనర్ కార్యాలయాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సాధారణంగా ప్రిలిమ్స్ జూన్‌లో.. మెయిన్స్ అక్టోబర్/నవంబర్‌ల్లో.. ఇంటర్వ్యూ ఏప్రిల్‌లో ఉంటాయి
వివరాలకు www.upsc.gov.in చూడొచ్చు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సాధారణంగా ప్రిలిమ్స్ జూన్‌లో.. మెయిన్స్ అక్టోబర్/నవంబర్‌ల్లో.. ఇంటర్వ్యూ ఏప్రిల్‌లో ఉంటాయి
వివరాలకు www.upsc.gov.in చూడొచ్చు.
ప్రస్తుతం ఇంటర్(ఎంపీసీ) చేస్తున్నాను. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ(ఎన్‌డీఏ) గురించి సమాచారం అందించండి?
ఇంటర్ తర్వాత లభించే ఆర్మీ ఉద్యోగాల గురించి వివరించండి?
+
ఇంటర్ తర్వాత లభించే ఆర్మీ ఉద్యోగాల గురించి వివరించండి?
నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ) పుణె సమీపంలోని కడక్‌వాస్లా వద్ద ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన, లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు అర్హులు. అవివాహితులై ఉండాలి. వయస్సు 161/2 నుంచి 19 ఏళ్లలోపు ఉండాలి.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని అన్ని ప్రముఖ దినపత్రికల ద్వారా అందిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు వారి ఆప్షన్ మేరకు ఆర్మీ, నేవీ, ఎరుుర్‌ఫోర్స్ విభాగాల్లో నాలుగేళ్ల శిక్షణ ఉంటుంది. ఇందులో మూడేళ్లు క్లాస్ రూం టీచింగ్ అందించి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వారి బీఎస్సీ సర్టి ఫికెట్ అందజేస్తారు. అనంతరం సంబంధిత అకాడెమీల్లో పద్దెనిమిది నెలల పాటు ప్రాక్టికల్స్ శిక్షణ ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది.
రాత పరీక్ష: పేపర్-1 మ్యాథమెటిక్స్ 300 మార్కులకు ఉంటుంది. సమయం 2 1/2 గంటలు. పేపర్-2 జనరల్ ఎబిలిటీ 600 మార్కులకు ఉంటుంది. సమయం 2 1/2 గంటలు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
సిలబస్ :
పేపర్ 1(మ్యాథమెటిక్స్) - అర్థిమెటిక్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగినోమెట్రీ, స్టాటిస్టిక్స్.
పేపర్ 2(జనరల్ ఎబిలిటీ) - పార్ట్-ఏ ఇంగ్లిష్ (200 మార్కులు) - పార్ట్-బీ జనరల్ నాలెడ్జ్(400 మార్కులు)
విభాగాల వారీగా పరిశీలిస్తే... సెక్షన్ ఏలో ఫిజిక్స్, సెక్షన్ బీలో కెమిస్ట్రీ, సెక్షన్ సీలో జనరల్ సైన్స్, సెక్షన్ డీలో (హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్), సెక్షన్ ఈలో జాగ్రఫీ, సెక్షన్ ఎఫ్‌లో కరెంట్ అఫైర్స్.
ఎన్‌డీఏకు సంబంధించి ప్రకటన ప్రతి సంవత్సరం ఏప్రిల్/మే, అక్టోబర్/ నవంబర్ నెలలో వస్తుంది. సైనిక దళాల్లో ఇతర ఉద్యోగాలు :
ఎ) సోల్జర్ జనరల్ డ్యూటీ: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. ఉన్నత విద్యార్హతలు ఉంటే మార్కుల పర్సంటేజీ పరిగణనలోకి తీసుకోరు. వయస్సు 171/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి.
బి) సోల్జర్ టెక్నికల్ - ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వయస్సు 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
సి) సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ - కనీసం 50 శాతం మార్కులతో ఏ గ్రూపుతోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి.
వయసు : 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
డి) సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ : కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయూలజీ, ఇంగ్లిష్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. వయసు: 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని అన్ని ప్రముఖ దినపత్రికల ద్వారా అందిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు వారి ఆప్షన్ మేరకు ఆర్మీ, నేవీ, ఎరుుర్‌ఫోర్స్ విభాగాల్లో నాలుగేళ్ల శిక్షణ ఉంటుంది. ఇందులో మూడేళ్లు క్లాస్ రూం టీచింగ్ అందించి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వారి బీఎస్సీ సర్టి ఫికెట్ అందజేస్తారు. అనంతరం సంబంధిత అకాడెమీల్లో పద్దెనిమిది నెలల పాటు ప్రాక్టికల్స్ శిక్షణ ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది.
రాత పరీక్ష: పేపర్-1 మ్యాథమెటిక్స్ 300 మార్కులకు ఉంటుంది. సమయం 2 1/2 గంటలు. పేపర్-2 జనరల్ ఎబిలిటీ 600 మార్కులకు ఉంటుంది. సమయం 2 1/2 గంటలు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
సిలబస్ :
పేపర్ 1(మ్యాథమెటిక్స్) - అర్థిమెటిక్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగినోమెట్రీ, స్టాటిస్టిక్స్.
పేపర్ 2(జనరల్ ఎబిలిటీ) - పార్ట్-ఏ ఇంగ్లిష్ (200 మార్కులు) - పార్ట్-బీ జనరల్ నాలెడ్జ్(400 మార్కులు)
విభాగాల వారీగా పరిశీలిస్తే... సెక్షన్ ఏలో ఫిజిక్స్, సెక్షన్ బీలో కెమిస్ట్రీ, సెక్షన్ సీలో జనరల్ సైన్స్, సెక్షన్ డీలో (హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్), సెక్షన్ ఈలో జాగ్రఫీ, సెక్షన్ ఎఫ్‌లో కరెంట్ అఫైర్స్.
ఎన్‌డీఏకు సంబంధించి ప్రకటన ప్రతి సంవత్సరం ఏప్రిల్/మే, అక్టోబర్/ నవంబర్ నెలలో వస్తుంది. సైనిక దళాల్లో ఇతర ఉద్యోగాలు :
ఎ) సోల్జర్ జనరల్ డ్యూటీ: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. ఉన్నత విద్యార్హతలు ఉంటే మార్కుల పర్సంటేజీ పరిగణనలోకి తీసుకోరు. వయస్సు 171/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి.
బి) సోల్జర్ టెక్నికల్ - ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వయస్సు 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
సి) సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ - కనీసం 50 శాతం మార్కులతో ఏ గ్రూపుతోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి.
వయసు : 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
డి) సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ : కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయూలజీ, ఇంగ్లిష్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. వయసు: 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.
నేను డిగ్రీ పూర్తి చేశాను. ఐఈఎస్, ఐఎస్‌ఎస్ పరీక్ష రాయాలనుకుంటున్నా. ఈ సర్వీసులో చేరటానికి అర్హతలేంటి? పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
+
ప్లానింగ్ క మిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, వివిధ మంత్రిత్వ శాఖలకు ఎకనామిక్స్ అడ్వైజర్స్, టారిఫ్ కమిషన్, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్, నేషనల్ శాంపిల్ సర్వే విభాగాల్లో... ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ.. ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసెస్ (ఐఈఎస్), ఇండియన్ స్టాటిస్టిక్ సర్వీసెస్ (ఐఎస్‌ఎస్)ను నిర్వహిస్తోంది. పీజీలో ఎకనామిక్స్, అప్లయిడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామిట్రిక్స్ చేసినవారు ఐఈఎస్‌కు... స్టాటికల్, మ్యాథమెటికల్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్ చేసినవారు ఐఎస్‌ఎస్‌కు అర్హులు. ఐఈఎస్, ఐఎస్‌ఎస్ నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష 1000 మార్కులకు, ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది.