Skip to main content

భారతదేశ, రాష్ట్ర భౌగోళిక అంశాలతో పాటు విపత్తు విభాగాన్ని ఎలా చదవాలి?

- ఆర్.సూర్యకుమారి, హైదరాబాద్.
Question
భారతదేశ, రాష్ట్ర భౌగోళిక అంశాలతో పాటు విపత్తు విభాగాన్ని ఎలా చదవాలి?
  • దేశ, రాష్ట్రాలకు సంబంధించి వర్షపాతం, నేలలు, వ్యవసాయం, సహజ వనరులు తదితర అంశాలు ముఖ్యమైనవి.
  • రాష్ట్ర ఉనికి, విస్తీర్ణం తదితర అంశాలపై అవగాహన అవసరం. వివిధ జిల్లాల్లో ప్రముఖ కొండలు/గుట్టలు, వాటిపేర్లు; ఖనిజ వనరులు తదితరాలను తెలుసుకోవాలి.
  • దేశంలోని ప్రధాన నదులు, వాటి జన్మస్థలాలు,ఉపనదులపై దృష్టిసారించాలి. రాష్ట్రంలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా; వాటి ఉప నదులు, ప్రాజెక్టులపై ప్రశ్నలు వస్తున్నాయి.
  • దేశ, రాష్ట్ర శీతోష్ణస్థితి, రుతుపవనాల ప్రభావాన్ని తెలుసుకోవాలి. రుతుపవనాలను ప్రభావితం చేస్తున్న ఎల్‌నినో, లానినోపై అవగాహన అవసరం. ఒండ్రు, ఎర్ర, నల్లరేగడి, లేటరైట్ మృత్తికలు, లక్షణాలు, విస్తరణ, ప్రధాన పంటల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
  • దేశం, రాష్ట్రంలోని అడవులు, రకాలు, విస్తరణ, వృక్ష జాతులు, అటవీ ఉత్పత్తులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ముఖ్యమైనవి. జాగ్రఫీ అంశాల అధ్యయనానికి అట్లాస్ ఉపయోగించడం ముఖ్యం.
  • విపత్తు నిర్వహణలో భూకంపాలు, సునామీ, వరదలు తదితర విపత్తులు; ఉపశమన చర్యలు; జాతీయ, రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ యంత్రాంగం; విపత్తు నిర్వహణ చట్టం-2005; జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

Photo Stories