Skip to main content

పోటీపరీక్షలకు సంబంధించి అర్థమెటిక్, గణిత అంశాలకు ఎలా సిద్ధమవాలి?

- ఎం.రాంకుమార్, రాజమండ్రి.
Question
పోటీపరీక్షలకు సంబంధించి అర్థమెటిక్, గణిత అంశాలకు ఎలా సిద్ధమవాలి?
  • ప్రస్తుతం వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో అర్థమెటిక్ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
  • అర్థమెటిక్‌లో భాజనీయతా సూత్రాలు, లాభనష్టాలు, కాలం-దూరం, సగటు, దశాంశ భిన్నాలు, శాతాలు, కాలం-పని, ట్రైన్ ప్రాబ్లమ్స్, భాగస్వామ్యం, బారువడ్డీ-చక్రవడ్డీ, నిష్పత్తి-అనుపాతం, సూక్ష్మీకరణలు, వైశాల్యాలు, నంబర్ సిరీస్, గసాభా-కసాగు, ఘనపరిమాణాలు, పడవలు-ప్రవాహాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • మ్యాథ్స్‌కు సంబంధించిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు, ప్రసిద్ధిగాంచిన రంగాలు కూడా తెలుసుకోవడం మేలు.
  • నంబర్లపై పట్టు సాధిస్తే... మిగతా ప్రిపరేషన్ అంతా సులువవుతుంది. నంబర్ సిస్టమ్స్, బాడ్‌మస్ నిబంధనలను తెలుసుకోవాలి. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, శాతాలు వంటి ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేషన్‌‌సలో వేర్వేరు మోడల్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఎక్కాలు, వర్గాలు-వర్గమూలాలు, ఘన మూలాలను గుర్తుంచుకుంటే ప్రశ్నకు వేగంగా సమాధానం గుర్తించొచ్చు.
  • ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న మ్యాథ్స్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. అర్థమెటిక్ కోసం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలతోపాటు ఇతర ఏదైనా ప్రామాణిక మెటీరియల్‌ను అనుసరించొచ్చు.

Photo Stories