Skip to main content

సివిల్స్ పాలిటీకి ఎలా సిద్ధమవాలి?

- కె.రమేశ్, హైదరాబాద్.
Question
సివిల్స్ పాలిటీకి ఎలా సిద్ధమవాలి?
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో పాలిటీని కీలక విభాగంగా చెప్పొచ్చు. ఈ సబ్జెక్టుపై పట్టు సాధించడానికి భారత రాజ్యాంగంపై క్షుణ్నంగా అవగాహన ఏర్పరచుకోవాలి. రాజ్యాంగ పీఠిక మొదలు.. అందులోని అధికరణలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. ఇందుకోసం ముందుగా బీఏ మూడు సంవత్సరాల పొలిటికల్ సైన్స్ పుస్తకాలను చదవాలి. ఇలా మౌలిక అంశాలపై పట్టు సాధిస్తూనే.. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చేసిన సవరణలు, వాటికి సంబంధించి రూపొందిన చట్టాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా.. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సంస్థలు, వాటి విధి విధానాలు, సభ్యులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి.
  • గత నాలుగైదేళ్ల సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. పాలిటీకి సంబంధించి మౌలిక అంశాలను తాజా పరిణామాలతో అనుసంధానిస్తూ సమాధానం ఇవ్వాల్సిన విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు.
  • పాలిటీని ఇతర సబ్జెక్ట్‌లతో ముఖ్యంగా జాగ్రఫీ, ఎకానమీలతో అనుసంధానం చేసుకుంటూ చదివితే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌లోని జనరల్ ఎస్సే నుంచి జనరల్ స్టడీస్ పేపర్-4 వరకు అన్నిటితోనూ అనుసంధానం చేసుకుంటూ చదివే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం కనీసం నాలుగేళ్ల పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం మేలు చేస్తుంది.
  • ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్, ఇంట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - డి.డి.బసు, అవర్ కాన్‌స్టిట్యూషన్-సుభాష్ కశ్యప్, అవర్ పార్లమెంట్-సుభాష్ కశ్యప్ పుస్తకాలను చదవడం వల్ల పాలిటీకి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్న నేపథ్యంలో తాజాగా చర్చనీయాంశమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. మొత్తంగా పాలిటీ ప్రిపరేషన్‌కు సంబంధించి అభ్యర్థులు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ముందుకు సాగితేనే ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే సమయంలో పట్టు సాధించే అవకాశాలు మెరుగవుతాయి.

Photo Stories