Skip to main content

నేను ప్రస్తుతం బీకామ్‌ చదువుతున్నాను. నాకు సివిల్‌ సర్వీసెస్‌తోపాటు బ్యాంక్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావాలని ఉంది. సలహా ఇవ్వండి?

Question
నేను ప్రస్తుతం బీకామ్‌ చదువుతున్నాను. నాకు సివిల్‌ సర్వీసెస్‌తోపాటు బ్యాంక్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావాలని ఉంది. సలహా ఇవ్వండి?

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి 19 ఉన్నత స్థాయి సర్వీసుల్లోకి అభ్యర్థుల ఎంపిక కోసం ప్రతి ఏటా నిర్వహించే పరీక్ష.. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌. సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశలు ఉంటాయి. సిలబస్‌ విస్తృతంగా ఉంటుంది. పూర్తి అంకితభావంతో కనీసం ఏడాదికిపైగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో, క్లర్కికల్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌(ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌), ఎస్‌బీఐ(స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నిర్వహించే పరీక్షల విధానం, సిలబస్‌ భిన్నంగా ఉంటాయి.  రెండు పరీక్షలకు ప్రత్యేక వ్యూహం, అంకితభావం, పట్టుదల, ప్రిపరేషన్‌ ప్లానింగ్, ధృడమైన సంకల్పం, క్రమశిక్షణ చాలా అవసరం. ప్రధానంగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌æ పరీక్ష సిలబస్‌లో.. కరెంట్‌ అఫైర్స్, చరిత్ర, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, ప్రభుత్వ విధానాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి అంశాలు ఉంటాయి, బ్యాంకింగ్‌ పరీక్షలకు క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్‌పై పట్టుండాలి. రెండు పరీక్షలకు ఎంతో విస్తృతమైన ప్రిపరేషన్‌ అవసరం ఉంటుంది. ఒకే సమయంలో రెండింటికి సన్నద్ధం కావాలంటే.. చాలా హార్డ్‌వర్క్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొదట రెండింటికి ప్రిపేర్‌ కాగలరా ? లేదా రెండింటిలో ఏదో ఒకటి షార్ట్‌లిస్ట్‌ చేసుకొని ముందుకు వెళ్లాలా.. అనేది నిర్ణయించుకోవడం మేలు. 

Photo Stories