Skip to main content

నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. నాకు బ్యాంకింగ్ అవేర్‌నెస్ పూర్తిగా పరిచయం లేదు. ఈ విభాగం...

- కె. యామినీ పార్వతి, విజయనగరం
Question
నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. నాకు బ్యాంకింగ్ అవేర్‌నెస్ పూర్తిగా పరిచయం లేదు. ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఏయే అంశాలపై దృష్టి సారించాలో తెలపండి?
బ్యాంకు పరీక్షలు రాసే చాలామంది అభ్యర్థులకు బ్యాంకింగ్ అవేర్‌నెస్ టాపిక్ కొత్తదే. రోజూ బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి చాలా ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. అంటే ఒక బ్యాంకులో ఒక రోజు జరిగే పనులపై అవగాహన ఉండాలి. ఏదైనా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న ఒక సాధారణ వ్యక్తి గరిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పే రీతిలో ఈ విభాగం నుంచి ప్రశ్నల కూర్పు ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు డిపాజిట్ చేయడానికి ఉపయోగించే స్లిప్‌ను ఏమంటారు? అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి?ఎన్ని రకాల అకౌంట్లు ఉంటాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండాలి. వీటితో పాటు బ్యాంకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండే వివిధ సంస్థల (రెగ్యులేటరీ బాడీస్) గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థలకు సంబంధించిన వెబ్‌సైట్లను పరిశీలించడం, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ లాంటి మ్యాగజైన్లను క్రమం తప్పకుండా చదవడం ద్వారా కావాల్సిన వివరాలను సేకరించవచ్చు. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ సంస్థలు, వాటి నిబంధనల గురించి చదవాలి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, సూక్ష్మ రుణ సంస్థలు లాంటి అనుబంధ అంశాలపై కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నమూనా ప్రశ్నలను సాధించడం, ఆన్‌లైన్ టెస్టులను సాధన చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు.

Photo Stories