Skip to main content

పోటీ పరీక్షల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఏయే అంశాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు?

ఎస్.జ్యోతి, గట్టుప్పల్, నల్గొండ.
Question
పోటీ పరీక్షల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఏయే అంశాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు?
ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక పరిజ్ఞానం ఎలాంటి పోటీ పరీక్షలకైనా అవసరమే. అన్ని రకాల పోటీ పరీక్షలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలికాంశాలపై తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగమైన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి 1, 2 ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి. బ్యాంకింగ్ సంబంధిత పారిభాషిక పదాలు, ఆర్‌బీఐ విధులు, వాణిజ్య బ్యాంకులు- చరిత్ర, విధులు, బ్యాంకులు వినియోగదారులకు అందజేస్తున్న సేవలు, బ్యాంకింగ్ సంస్కరణలను అధ్యయనం చేసిన కమిటీలు, కేంద్ర ప్రభుత్వం- బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య సంబంధం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వివిధ రంగాల అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా దోహదపడుతుందో అధ్యయనం చేయాలి. ప్రామాణిక వార్త పత్రికలు, మేగజీన్లను చదువుతూ బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడూ వివరాలు సేకరించాలి. వీటితో పాటు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను పరిశీలించడం ప్రయోజనకరం. వీటి ఆధారంగా జనరల్ నాలెడ్‌‌జ, కరెంట్ అఫైర్‌‌స విభాగాల్లో వచ్చే ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించవచ్చు.

Photo Stories