Bank Exams
బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ విభాగాలకు ఎలా సిద్ధమవాలి?
+
కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కు పత్రికలు ఉపయోగించుకోవడం ముఖ్యం. ముఖ్య అంశాలను ప్రత్యేకంగా నోట్స్‌లో రాసుకోవాలి. ఆ అంశంతో ముడిపడిన ఇతర అంశాలపైనా దృష్టిసారించాలి. ఉదాహరణకు యూఎస్, ఇజ్రాయెల్.. యునెస్కో నుంచి వైదొలగిన అంశాన్ని తీసుకుంటే ఆయా దేశాల రాజధానులు, కరెన్సీ, అధ్యక్షులు, ఇటీవల కాలంలో ఆయా దేశాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలపై దృష్టిసారించాలి. ఇలాచేస్తే ప్రశ్న ఏ విధంగా వచ్చినా సరైన సమాధానం ఇచ్చేందుకు వీలవుతుంది.
- బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, బ్యాంకింగ్ టెర్మినాలజీ, నియామకాలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అధిక శాతం ప్రశ్నలు పరీక్షకు ముందు మూడు, నాలుగు నెలల్లో చోటుచేసుకున్న పరిణామాలపైనే వస్తున్నాయి. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ సాగించాలి. జాతీయ అంశాల్లో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు-నివేదికలు తదితరాలను అధ్యయనం చేయాలి. అంతార్జాతీయ అంశాలకు సంబంధించి వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, సదస్సులు, తీర్మానాలు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు, ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి వాటిని చదవాలి.
- ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఆవిష్కరణలు, క్షిపణులు, ఇంధన వనరులు; సమాచార, సాంకేతిక రంగాల్లోని పరిణామాలు తదితరాలను అధ్యయనం చదవాలి.
- క్రీడల్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల గురించి తెలుసుకోవాలి. వివిధ టోర్నీలు, విజేతలపై దృష్టిసారించాలి. క్రీడా వేదికలు, వివిధ దేశాలు సాధించిన పతకాలు, క్రీడా పదజాలం వంటివి ముఖ్యమైనవి.
- స్టాక్ జీకేలో భాగంగా జనాభా, రవాణా వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థలు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్వ్‌లు, ప్రముఖుల బిరుదులు, ఐక్యరాజ్యసమితి-అనుబంధ సంస్థలు, ఐరాస సంవత్సరాలు, దేశాల కరెన్సీలు, నియామకాలు, అధ్యయన శాస్త్రాలు, దినోత్సవాలు తదితరాలు ముఖ్యమైనవి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అసిస్టెంట్స్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
బ్యాంక్ పరీక్షల్లో రీజనింగ్‌కు అధిక ప్రాముఖ్యం ఉంది. అభ్యర్థి ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్ ప్రశ్నలను రీజనింగ్ నుంచి ఎక్కువగా ఇస్తారు. ఇందులో ముఖ్యంగా సీటింగ్ అరేంజ్‌మెంట్, లాజికల్ స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇన్ ఈక్వాలిటీస్, డేటా సఫీషియన్సీ, అనలిటికల్ రీజనింగ్, ఆల్ఫాబెట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు రావొచ్చు. వీటికి సమాధానం గుర్తించాలంటే అభ్యర్థి కచ్చితమైన కన్‌క్లూజన్లు, పాజిబిలిటీల మధ్య వ్యత్యాసాలను గమనించాలి. సమాధానంలో ఏ మాత్రం తేడా అనిపించినా అది పాజిబిలిటీగాను, కచ్చితమైన సమాధానం వస్తే అది కన్‌క్లూజన్‌గానూ పరిగణించాలి. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. వీటిపై రెండు నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సీటింగ్ అరేంజ్‌మెంట్ ప్రశ్నల్లో.. వ్యక్తులందరూ ఒకే వైపు ముఖం ఉండేవిధంగా కూర్చొని ఉన్నవి; కొంతమంది వెలుపలి వైపు, మరికొంతమంది లోపలి వైపు కూర్చొని ఉండే ప్రశ్నలు ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. వీటిని జాగ్రత్తగా చేయాలి. వీటిని సాధించడంలో చిన్న పొరపాటు చేసినా, దానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తప్పుగా గుర్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. ఇన్‌ఈక్వాలిటీస్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు రావచ్చు. నంబర్ సిరీస్ నుంచి గతంతో పోలిస్తే మరింత క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగం నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. నాన్ వెర్బల్‌కు సంబంధించిన ప్రశ్నలను అడగడం లేదు. అయితే వీటిపై కొంతైనా అవగాహన ఉండటం ప్రయోజనకరం.
బ్యాంకు పరీక్షల్లో విజయానికి ఎలా చదవాలి?
+
బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనలో అన్వయ సామర్థ్యం అవసరం ఎంతగానో ఉంటుంది. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి. అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్‌లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటన్నిటికీ ప్రధాన పరిష్కారం నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి. అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తిచేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అని విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కాదా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి.
సమయపాలన కీలకం:
రోజూ ప్రతి సబ్జెక్టును చదివేలా టైం మేనేజ్‌మెంట్ ను అలవరచుకోవాలి. చదివిన అంశాల పునశ్చరణకు కొంత సమయం కేటాయించుకోవాలి. ఇప్పటికే పలు బ్యాంక్ పరీక్షలు రాసిన అభ్యర్థులు వాటిలో తమకు వచ్చిన మార్కులు, ఎందులో వెనుకంజలో ఉన్నామో గమనించి, ఆ అంశాలపై మరింత దృష్టి సారించాలి. పరీక్షకు రెండు వారాల ముందు నుంచి రివిజన్‌కే కేటాయించాలి. కనీసం అయిదు మాక్‌టెస్ట్‌లకైనా హాజరు కావాలి.

నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. నాకు బ్యాంకింగ్ అవేర్‌నెస్ పూర్తిగా పరిచయం లేదు. ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఏయే అంశాలపై దృష్టి సారించాలో తెలపండి?
+
బ్యాంకు పరీక్షలు రాసే చాలామంది అభ్యర్థులకు బ్యాంకింగ్ అవేర్‌నెస్ టాపిక్ కొత్తదే. రోజూ బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి చాలా ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. అంటే ఒక బ్యాంకులో ఒక రోజు జరిగే పనులపై అవగాహన ఉండాలి. ఏదైనా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న ఒక సాధారణ వ్యక్తి గరిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పే రీతిలో ఈ విభాగం నుంచి ప్రశ్నల కూర్పు ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు డిపాజిట్ చేయడానికి ఉపయోగించే స్లిప్‌ను ఏమంటారు? అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి?ఎన్ని రకాల అకౌంట్లు ఉంటాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండాలి. వీటితో పాటు బ్యాంకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండే వివిధ సంస్థల (రెగ్యులేటరీ బాడీస్) గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థలకు సంబంధించిన వెబ్‌సైట్లను పరిశీలించడం, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ లాంటి మ్యాగజైన్లను క్రమం తప్పకుండా చదవడం ద్వారా కావాల్సిన వివరాలను సేకరించవచ్చు. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ సంస్థలు, వాటి నిబంధనల గురించి చదవాలి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, సూక్ష్మ రుణ సంస్థలు లాంటి అనుబంధ అంశాలపై కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నమూనా ప్రశ్నలను సాధించడం, ఆన్‌లైన్ టెస్టులను సాధన చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అసిస్టెంట్స్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
బ్యాంక్ పరీక్షల్లో రీజనింగ్‌కు అధిక ప్రాముఖ్యం ఉంది. అభ్యర్థి ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్ ప్రశ్నలను రీజనింగ్ నుంచి ఎక్కువగా ఇస్తారు. ఇందులో ముఖ్యంగా సీటింగ్ అరేంజ్‌మెంట్, లాజికల్ స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇన్ ఈక్వాలిటీస్, డేటా సఫీషియన్సీ, ఎనలిటికల్ రీజనింగ్, ఆల్ఫాబెట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే అభ్యర్థి కచ్చితమైన కన్‌క్లూజన్లు, పాసిబిలిటీల మధ్య వ్యత్యాసాలను గమనించాలి. సమాధానంలో ఏ మాత్రం తేడా అనిపించినా అది పాసిబిలిటీగాను, కచ్చితమైన సమాధానం వస్తే అది కన్‌క్లూజన్‌గానూ పరిగణించాలి. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. వీటిపై రెండు నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సీటింగ్ అరేంజ్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల నిర్వహించిన బ్యాంక్ పరీక్షలలో 10 నుంచి 15 మార్కులకు ప్రశ్నలు అడిగారు. సీటింగ్ అరేంజ్‌మెంట్ ప్రశ్నల్లో.. వ్యక్తులందరూ ఒకే వైపు ముఖం ఉండేవిధంగా కూర్చొని ఉన్నవి; కొంతమంది వెలుపలి వైపు, మరికొంతమంది లోపలి వైపు కూర్చొని ఉండే ప్రశ్నలు ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. వీటిని జాగ్రత్తగా చేయాలి. వీటిని సాధించడంలో చిన్న పొరపాటు చేసినా, దానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తప్పుగా గుర్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. ఇన్‌ఈక్వాలిటీస్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు రావచ్చు. నంబర్ సిరీస్ నుంచి గతంతో పోలిస్తే మరింత క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగం నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. నాన్ వెర్బల్‌కు సంబంధించిన ప్రశ్నలను అడగడం లేదు. అయితే వీటిపై కొంతైనా అవగాహన ఉండటం ప్రయోజనకరం.
పోటీ పరీక్షల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఏయే అంశాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు?
+
ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక పరిజ్ఞానం ఎలాంటి పోటీ పరీక్షలకైనా అవసరమే. అన్ని రకాల పోటీ పరీక్షలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలికాంశాలపై తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగమైన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి 1, 2 ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి. బ్యాంకింగ్ సంబంధిత పారిభాషిక పదాలు, ఆర్‌బీఐ విధులు, వాణిజ్య బ్యాంకులు- చరిత్ర, విధులు, బ్యాంకులు వినియోగదారులకు అందజేస్తున్న సేవలు, బ్యాంకింగ్ సంస్కరణలను అధ్యయనం చేసిన కమిటీలు, కేంద్ర ప్రభుత్వం- బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య సంబంధం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వివిధ రంగాల అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా దోహదపడుతుందో అధ్యయనం చేయాలి. ప్రామాణిక వార్త పత్రికలు, మేగజీన్లను చదువుతూ బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడూ వివరాలు సేకరించాలి. వీటితో పాటు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను పరిశీలించడం ప్రయోజనకరం. వీటి ఆధారంగా జనరల్ నాలెడ్‌జ, కరెంట్ అఫైర్‌స విభాగాల్లో వచ్చే ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించవచ్చు.
నేను తెలుగు మీడియంలో చదివాను. పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్ విభాగంలో స్సెల్లింగులు, యాంటోనిమ్స్, సినానిమ్స్ విషయాల్లో నేను పొరపాట్లు చేస్తున్నాను. వీటిపై పట్టు సాధించడానికి ఎలా చదవాలి?
+
ఇంగ్లిష్లో స్పెల్లింగ్స్ అనేవి చాలా సంక్లిష్టమైనవి. ఇవి ప్రతిసారి ఉచ్ఛరించే విధానానికి అనుగుణంగా ఉండవు. అందువల్ల వీటిని జాగ్రత్తగా, ఏకాగ్రతతో నేర్చుకోవాలి. ఒక పదం స్పెల్లింగ్ గురించి తెలుసుకునేటప్పుడు దాని ఉచ్ఛారణా పద్ధతిని పక్కనబెట్టి పూర్తిగా అక్షరాలపైనే దృష్టి సారించాలి. వీటిని నేర్చుకోవడానికి ఆంగ్లంలో కొన్ని నియమాలు ఉన్నప్పటికీ రాయడం ద్వారా వీటిపై పట్టు సాధించడమే ఉత్తమ విధానం. ఇంగ్లిష్ పత్రికలు, మేగజీన్ల లాంటివాటిని చదువుతున్నప్పుడే కొత్త పదాలను గుర్తించి వాటి స్పెల్లింగ్, అర్థాలు, వెర్బ్, అడ్వెర్బ్ రూపాలు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఆంగ్ల పదాలకు సంబంధించి ఇచ్చే అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
ఉదా: Brake, Break; Vapour,Vaporisation
ఉదా: Brake, Break; Vapour,Vaporisation
ఎస్‌బీఐ అసిస్టెంట్స్ క్లరికల్ కేడర్ పోస్టుల పరీక్షలో మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
+
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ, క్లరికల్ పరీక్షల్లో మాత్రమే ఉండే విభాగం.. మార్కెటింగ్ ఆప్టిట్యూడ్. ఎస్‌బీఐ మినహాయించి మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామకాలకు నిర్వహించే ఐబీపీఎస్ పీవోస్, క్లరికల్ కేడర్ పరీక్షల్లో మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ విభాగమే లేదు. ప్రస్తుతం ఎస్‌బీఐ అసిస్టెంట్స్ క్లరికల్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకుంటే ఈ విభాగంలో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
గత నెల 19, 20 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్షలో అడిగిన ప్రశ్నలు:
టార్గెట్ గ్రూప్ అంటే ఏమిటి?
సేవలు అందించడానికి, కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఎంచుకునే ప్రజా సమూహాన్ని టార్గెట్ గ్రూప్ అంటారు. ఉదా: ఉన్నతవిద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు విద్యా రుణాలు అందించడానికి బ్యాంకులు వీరిని టార్గెట్ గ్రూప్‌గా ఎంచుకుంటాయి. అదేవిధంగా పొదుపు ఖాతాల కోసం ఎవరికైతే బ్యాంకు అకౌంట్ లేదో వారందరినీ, కరెంట్ ఖాతాల కోసం వ్యాపార సంస్థలను టార్గెట్ గ్రూప్‌గా భావిస్తారు.
క్రాస్ సెల్లింగ్, అప్‌సెల్లింగ్ మధ్య తేడాలేంటి?
ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు అదనపు సేవలు అందించడం/ఉత్పత్తుల అమ్మకాన్ని క్రాస్ సెల్లింగ్ అంటారు. ఉదా: సేవింగ్ బ్యాంకు ఖాతా ఉన్నవారికి ఇంటి రుణం మంజూరు చేయడం లేదా కరెంట్ ఖాతా ఉన్నవారికి బీమా పాలసీ అమ్మకం. ప్రస్తుతం ఉన్నదానికి అదనపు విలువ ను జోడించడాన్ని అప్‌సెల్లింగ్ అంటారు. ఉదాహ రణకు క్రెడిట్ కార్డ్‌పై రూ.25,000 పరిమితి ఉంటే.. దాన్ని రూ.40,000కు పెంచడం.
పేటెంట్ రైట్స్ అంటే ఏమిటి?
వివిధ సంస్థలు, కంపెనీలు తమ లోగోలను, బ్రాండ్లను వేరేవారు వాడకుండా రిజిస్టర్ చేసుకుంటాయి. దీన్నే పేటెంట్ రైట్స్ అంటారు.
కో బ్రాండింగ్ అంటే ఏమిటి?
రెండు కంపెనీలు/సంస్థలు కలిసి మార్కెట్‌లో తమ అమ్మకాలను పెంచుకోవడానికి కలిసి పనిచేయడాన్ని కో బ్రాండింగ్ అంటారు. ఉదాహరణకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎక్కువ మంది ప్రజలు తమ బీమా పాలసీలు తీసుకొనేలా చేయడానికి స్టార్ యూనియన్ దైచీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. స్టార్ (బ్యాంక్ ఆఫ్ ఇండియా), యూనియన్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), దైచీ (జపనీస్ ఇన్సూరెన్స్ కంపెనీ).

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల పరీక్షలో జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? అత్యధిక మార్కులు సాధించడం ఎలా?
+
ఎస్బీఐ గ్రూప్ మినహాయించి మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) అక్టోబరులో ఉమ్మడి రాతపరీక్షను నిర్వహించనుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
ఇప్పటివరకు ఐబీపీఎస్ నిర్వహించిన మూడు పీవోస్ పరీక్షలను పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ రంగం విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు గమనించవచ్చు. స్టాక్ జీకే నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్లో సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను చదవాలి. ప్రభుత్వ పథకాలు, వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు, ముఖ్యమైన దినోత్సవాలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, క్రీడలు - క్రీడాకారులు- ఇటీవల జరిగిన క్రీడల కప్లు, టోర్నమెంట్లు, ఆర్థిక విషయాలు, ప్రణాళికలు, అబ్రివేషన్స్, అంతర్జాతీయ సంస్థలు - ప్రధాన కార్యాలయాలు, సదస్సులు, పుస్తకాలు - రచయితలు, దేశీయ, అంతర్జాతీయ సంఘటనలు, దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, భారత అంతరిక్ష పరిశోధనలు - ఇటీవలి విజయాలు, దేశ రక్షణ వ్యవస్థ, క్షిపణులు, కమిటీలు - చైర్మన్లు మొదలైన వర్తమాన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ - తాజా పరపతి విధానాలు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, కొత్త బ్యాంకుల ఏర్పాటు, ఆర్బీఐ ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు - అధ్యక్షులు, ఆ కమిటీల సిఫారసులు, ప్రస్తుత పాలసీ రేట్లు, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, ముఖ్యమైన బ్యాంకుల అధిపతులు, బ్యాంకింగ్ పదజాలం, డిపాజిట్లు - వాటి రకాలు, నాబార్డ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఏటీఎంలు, చెక్కులు, కేవైసీ (నో యువర్ కస్టమర్) విధానాలు, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లాంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. స్టాక్ జీకేకు సంబంధించి దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంట్లు, క్రీడలకు సంబంధించిన ట్రోఫీలు, పదజాలం, అభయారణ్యాలు - అవి ఉన్న రాష్ట్రాలు, రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు లాంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
అందువల్ల పరీక్షలో ఈ విభాగాన్ని మొదటగా పూర్తిచేసి, ఎక్కువ సమయం తీసుకునే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాంటి విభాగాలను చివర్లో చేయాలి. జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే రోజూ ఒక దినపత్రికను చదివి నోట్స్ రూపొందించుకోవడం తప్పనిసరి. దీంతోపాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్ను చదవాలి. www.sakshieducation.comలో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అభ్యర్థులకు బాగా ఉపకరిస్తాయి.
గత పీవో పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు:
1. Which indian movie has been nominated as India's official entry to 2014 Oscars?
Ans: The Good Road
2. With which sport Pullela Gopichand isassociated with?
Ans: Badminton
3. Who is the present chairman of the State Bank of India?
Ans: Arundhati Battacharya

ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. బ్యాంక్ మేనేజర్ కావాలన్నది నా ఆశయం. ఏం చదవాలి?
+
మీ లక్ష్యాన్ని సాధించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి... ప్రముఖ బ్యాంకులు నిర్వహించే పరీక్షలు రాసి ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగం సాధించడం. ఆ తర్వాత వృత్తిపరమైన చక్కని పనితీరు, విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడం వల్ల పదోన్నతులు లభిస్తాయి. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్ కావచ్చు. రెండో మార్గం... ఫైనాన్షియల్, బిజినెస్ అంశాల్లో ఉన్నత కోర్సులు చేయడం. దీనివల్ల మల్టీనేషనల్ బ్యాంకులు, ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందవచ్చు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు. బ్యాంకు మేనేజర్ ఉద్యోగం సాధించడం అసాధ్యమేమీ కాదు. ప్రయత్నించండి.
బ్యాంకుల్లో క్లరికల్, పీఓ పోస్టులే కాకుండా మరేతర పోస్టుల భర్తీ ఉంటుందా?
+
బ్యాంకుల్లో క్లరికల్, పీఓ కాకుండా కొన్నిరకాల స్పెషలిస్ట్ ఉద్యోగాలు ఉంటాయి(ఉదాహరణకు మార్కెటింగ్, అగ్రికల్చరల్ , ఐటీ..). వీటిని ఆయా రంగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఇందుకోసం చేపట్టే నియామక ప్రక్రియ బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటుంది.
ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ తర్వాత రిక్రూట్‌మెంట్ ప్రక్రియ అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా ఉంటుందా?
+
కామన్ రిటెన్ ఎగ్జామినేషన్‌కు శ్రీకారం చుట్టినా... ఆయా బ్యాంకుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మాత్రం వేర్వేరుగానే ఉంటుంది. అంటే ప్రతి బ్యాంకు.. తమ పరిధిలోని ఖాళీల కోసం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు పేర్కొంటూ ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. వాటికి సరితూగే అభ్యర్థులు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్‌ను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. కామన్ ఎగ్జామినేషన్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు ఐబీపీఎస్ స్కోర్ కార్డ్ అందిస్తుంది. దీనికి ఏడాది వరకు గుర్తింపు ఉంటుంది. అంటే.. ఆ ఏడాది సమయంలో నిర్దేశిత 19 బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్‌కు ఆ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటున్న బ్యాంకులు?
+
ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్‌ను ఆమోదించిన బ్యాంకులు
అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, దేనాబ్యాంక్ , ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, విజయ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఈ పరీక్ష ఆధారంగా నియామకం చేపట్టే బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అసోసియేట్ బ్యాంకులు లేవు. ఇవి సొంతంగా రిక్రూట్ చేసుకుంటాయి.

క్లరికల్ కేడర్‌లో కెరీర్ ప్రారంభించిన వ్యక్తి ఏ స్థాయికి చేరుకొవచ్చు?
+
క్లరికల్ కేడర్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన వారికి క్లర్క్, క్యాషియర్, టైపిస్ట్ అనే మూడురకాల పనులను ఒకటిగా చేసిన హోదా ఇస్తారు. ప్రస్తుతం వీరికి ప్రారంభంలో నెలకు ’10 వేల వేతనం లభిస్తుంది. తర్వాత హోదాను బట్టి నెలకు ’ 40వేల వరకు సంపాదించవచ్చు. పదోన్నతులను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ప్రయత్నించిన వారు.. ఐదు సంవత్సరాల్లో ఆఫీసర్‌గా జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి ప్రమోషన్ పొందొచ్చు. ఆ స్థాయి నుంచి క్రమంగా ప్రమోషన్ల ఆధారంగా జనరల్ మేనేజర్ హోదా వరకు చేరుకోవచ్చు. కనీసం చీఫ్ మేనే జర్ స్థాయి వరకు తప్పకుండా చేరుకునే అవకాశం వస్తుంది. ఒకసారి ఆఫీసర్ ప్రమోషన్ పొందాక వారి కెరీర్ గ్రాఫ్ ఇతర ఆఫీసర్లతో సమానంగా ఉంటుంది.
బ్యాంకుల్లో పీఓగా ప్రవేశించిన వారి కెరీర్ గ్రాఫ్ ఏవిధంగా ఉంటుంది?
+
బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన వారు తమ సామర్థ్యం, అనుభవం ఆధారంగా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ)గా కెరీర్ ప్రారంభించిన వారు బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడొచ్చు. సాధారణంగా పీఓగా కెరీర్ ప్రారంభించిన వారు పదవీ విరమణలోపు సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరుకోవచ్చు. వీరి బేసిక్ పే నెలకు ’14,500. విధులు నిర్వహించే ప్రదేశం ఆధారంగా ప్రారంభంలో కనీసం ’21,000 వరకు వేతనం లభిస్తుంది. ప్రమోషన్ల ఆధారంగా నెలకు ’52,000 వరకు సంపాదించవచ్చు. ఆకర్షణీయ వేతనంతోపాటు పలు రకాల సౌకర్యాలు ఆదనం. జూనియర్, మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. తర్వాతి స్థాయి టాప్ ఎగ్జిక్యూటివ్. జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులకు అసిస్టెంట్ మేనేజర్ హోదా ఇస్తారు. మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో డిప్యూటీ మేనేజర్, మేనేజర్ అనే రెండు హోదాలు ఉంటాయి. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉండే హోదాలు.. చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ డిజిగ్నేషన్లకు టాప్ ఎగ్జిక్యూటివ్ హోదా ఇస్తారు. ఈ విధంగా మొత్తం ఏడు స్కేళ్లు, ఆ తర్వాత రెండు స్కేళ్లు ఉంటాయి. వాటిలో ఒకటి చీఫ్ జనరల్ మేనేజర్. కాగా రెండోది అత్యున్నతమైన మేనేజింగ్ డెరైక్టర్ స్థాయి.
ఐబీపీఎస్ పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలి?
+
ఐబీపీఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి ఇంగ్లిష్, మ్యాథ్స్, రీజనింగ్‌లలో నైపుణ్యం కీలకం. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. ఈ జ్ఞానాన్ని బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ మోడల్ పేపర్‌లోని ప్రశ్నలకు అన్వయిస్తూ వీలైనంత ప్రాక్టీస్ చేయాలి. పీఓ పరీక్ష నేపథ్యంగా పెట్టుకున్న వారు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. గత రెండేళ్ల ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో సింహభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఆధారపడిన ప్రశ్నలే ఇస్తున్నారు.
క్లరికల్ కేడర్‌కు ప్రిపేరయ్యే వారు మాత్రం 8,9,10 తరగతుల్లోని అర్థమెటిక్ విభాగాన్ని ఔపోసన పట్టాలి. అందులో ప్రతి ప్రశ్నకూ రఫ్ వర్క్ చేయకుండా మనసులో గణించడం ద్వారా సమాధానాలు కనుక్కోనే విధంగా సాధన చేయాలి.
రీజనింగ్ విభాగంలో మొదట నమూనాలను అర్థం చేసుకోవాలి. విద్యార్థి దశలో ఏస్థాయిలోనూ ఈ విభాగంతో పరిచయం ఉండదు. కాబట్టి ప్రాథమిక స్థాయి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఒక మాదిరి అవగాహన వచ్చాక సమయాన్ని నిర్దేశించుకుని సమస్యను సాధించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌లో ప్రాథమిక అంశాలపై అవగాహన వచ్చాక మోడల్ ప్రశ్నలపై దృష్టిసారించడం మంచిది. ఈ విభాగంలో మోడల్ ప్రశ్నలను బట్టీ పట్టడం సముచితం కాదు. కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదువుకున్న వారు ప్రాథమిక విషయాలను పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది. జనరల్ అవేర్‌నెస్‌కు మాత్రం ప్రతిరోజు దిన పత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డైయిలీని కూడా చదవాలి.

ఐబీపీఎస్ పీఓ, క్లరికల్ కేడర్ కోసం నిర్వహించే పరీక్షల మధ్య తేడా? రిఫరెన్స్ పుస్తకాలను తెలపండి?
+
ఐబీపీఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి ఇంగ్లిష్, మ్యాథ్స్, రీజనింగ్‌లలో నైపుణ్యం కీలకం. క్లరికల్, పీఓ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలో దాదాపుగా సబ్జెక్టులు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. పీఓ ఉద్యోగాలకు జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిపి ఉంటే.. క్లరికల్ ఉద్యోగాలకు బ్యాంకింగ్ రంగ నేపథ్యంలో జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ వేర్వేరుగా ఉంటాయి.
రిఫరెన్స్ బుక్స్:
ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్
ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ - ఎ.కె. కపూర్
ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ - ఎస్.ఎల్ గులాటీ
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్-దిల్హాన్ పబ్లికేషన్స్
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియన్సీ-కిరణ్ పబ్లికేషన్స్
నాన్ వెర్బల్ రీజనింగ్ - ప్రభాత్ జావేద్
అనలిటికల్ రీజనింగ్ - ఎం.కె. పాండే
వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్. అగర్వాల్

ఐబీపీఎస్ క్లరికల్ కేడర్ కోసం నిర్వహించే పరీక్ష వివరాలు తెలపండి?
+
ఐబీపీఎస్ క్లరికల్ కేడర్ కోసం నిర్వహించే కామన్ రిటెన్ ఎగ్జామినేషన్‌లో అయిదు సెక్షన్లు ఉంటాయి. అవి.. రీజనింగ్(మార్కులు-50); ఇంగ్లిష్ లాంగ్వేజ్(మార్కులు-50); న్యూమరికల్ ఎబిలిటీ (మార్కులు-50); జనరల్ అవేర్‌నెస్(బ్యాంకింగ్ పరిశ్రమ గురించి కూడా ప్ర శ్నలుంటాయి-మార్కులు-50); కంప్యూటర్ నాలెడ్జ్ (మార్కులు-50); కాలవ్యవధి: రెండున్నర గంటలు. వ్యవధిలో జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీటిని రెండున్నరగంటల వ్యవధిలో రాయాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. తప్పు సమాధానాలకు సరైన సమాధానానికి ఇచ్చే ఒక మార్కులో 0.25 నెగటివ్ మార్కులు ఉంటాయి.
ఐబీపీఎస్ పీఓ పరీక్ష ఏ విధంగా ఉంటుంది?
+
ఐబీపీఎస్ పీఓల భర్తీ కోసం నిర్వహించే కామన్ రిటెన్ ఎగ్జామినేషన్‌లో మొత్తం అయిదు సెక్షన్లు ఉంటాయి. అవి..రీజనింగ్(మార్కులు-50); ఇంగ్లిష్ లాంగ్వేజ్(మార్కులు-25); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(మార్కులు-50); జనరల్ అవేర్‌నెస్ (మార్కులు-50); కంప్యూటర్ నాలెడ్జ్ (మార్కులు-50); కాలవ్యవధి: రెండున్నర గంటలు. 60 నిమిషాల వ్యవధిలో 25 మార్కులకు ఇంగ్లిష్ కాంపోజిషన్‌పై డిస్క్రిప్టివ్ పరీక్ష కూడా ఉంటుంది. ఎస్సే రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, లెటర్ రైటింగ్ తదితర ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షలోని అయిదు సెక్షన్లకు వేర్వేరుగా కటాఫ్ నిర్ణయిస్తారు. ప్రతి సెక్షన్‌లోనూ కటాఫ్ దాటితేనే ఆ అభ్యర్థి రాసిన డిస్క్రిప్టివ్ పేపర్‌ను మూల్యాంకనం చేస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా అమలు చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అప్పటికే పొందిన మార్కుల నుంచి 0.25 మార్కులను తీసేస్తారు.
ఐబీపీఎస్ క్లరికల్, పీఓ కేడర్ కోసం నిర్వహించే పరీక్ష అర్హతలను తెలపండి?
+
ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్‌మెంట్ ట్రైనీ హోదా గల పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ రాయడానికి కనీస అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. దీంతోపాటు నోటిఫికేషన్ సమయానికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.
క్లరికల్ కేడర్‌కు అర్హత: పదోతరగతి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు పాసయితే సరిపోతుంది, లేదా 10+2/ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.

బ్యాంకుల్లో ఖాళీల భర్తీ కోసం ఇటీవల ప్రారంభించిన ఐబీపీఎస్ ఎగ్జామ్ వివరాలను తెలపండి?
+
బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి కాలం వరకు ఉద్యోగాల నియామకానికి.. ఆయా బ్యాంకులు వేర్వేరుగా లేదా రెండు, మూడు బ్యాంకులు ఉమ్మడిగా పరీక్షను నిర్వహించేవి. ఇలాంటి సందర్భాల్లో రెండు బ్యాంకుల పరీక్షలు ఒకే సారి రావడం.. ప్రిపరేషన్‌పరంగా, ఆర్థికంగా కూడా నిరుద్యోగులకు భారంగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఐబీపీఎస్ జాతీయ స్థాయిలో కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. సంవత్సరానికి రెండు సార్లు పీఓ, క్లరికల్ కేడర్‌కు పరీక్షలను నిర్వహిస్తున్నారు. రెండు వేర్వేరుగా ఉంటాయి. ఈ స్కోర్‌కు ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. దీని ఆధారంగా ఆ సమయంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసే బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కోర్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఆరు నెలల తర్వాత మరోసారి ఈ పరీక్షకు హాజరుకావచ్చు. దీని స్కోర్ ఆధారంగా ద్వారా 19 బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.ibps.in
వెబ్‌సైట్: www.ibps.in
సాధారణంగా బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్స్ కోసం నిర్వహించే పరీక్షల్లో ఏయే అంశాలు ఉంటాయి?
+
బ్యాంకుల్లో నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో... రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రశ్నల తీరు, క్లిష్టత, మార్కుల కేటాయింపు సంబంధిత అంశాల్లో తేడా ఉంటుంది.
బ్యాంకుల్లో ఖాళీలను సాధారణంగా ఏవిధంగా భర్తీ చేస్తారు?
+
దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియలో సాధారణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే దశలు ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గతంలో అన్ని బ్యాంకులు.. వేటికవే సొంతంగా రిక్రూట్‌మెంట్ నిర్వహించుకునేవి. దీంతో ఒకే రోజు రెండు బ్యాంకుల పరీక్షలు రావడం, ఆర్థికంగా కూడా ఉద్యోగార్థులకు భారం కావడంతో ఇటీవలి ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. దీనిద్వారా 19 ప్రభుత్వరంగ బ్యాంకులు నియామకాలు చేపడుతున్నాయి. ఈ పరీక్ష ఆధారంగా నియామకం చేపట్టే బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అసోసియేట్ బ్యాంకులు లేవు. ఇవి సొంతంగా రిక్రూట్ చేసుకుంటాయి.