Skip to main content

study abroad

ప్రస్తుతం ఎమ్మెస్సీ(అపై ్లడ్‌ జియూలజీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఈ అంశంలో విదేశీ విశ్వవిద్యాలయూల్లో పరిశోధన చేయూలని ఉంది. ప్రవేశం పొందడానికి మార్గాలేమిటి?
+
విదేశాల్లో విద్యాభ్యాసం చేయూలనుకునే విద్యార్థులు GRE, TOEFL వంటి పరీక్షలు రాయూలి. ఈ పరీక్షల్లో సంపాదించిన మార్కులతోపాటు అకడమిక్‌ రికార్డు, సబ్జెక్టు ప్రాధాన్యం, పరిశోధన/బోధన అనుభవం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రవేశం కల్పిస్తారు. యూఎస్‌లోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతోపాటు మరికొన్ని విద్యాసంస్థలు ఈ అంశంలో పరిశోధనకు అవకాశం కల్పిస్తున్నారుు.
నేను ఎమ్మెస్సీ బయూలజీ చదివాను. జర్నలిజంలో నాలుగేళ్ల అనుభవం ఉంది. నా వయసు 25 సంవత్సరాలు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నాను. ఇందుకు సంబంధించి ఎమైనా కోర్సులున్నాయూ?
+
జర్నలిజంలో మీకు నాలుగేళ్ల అనుభవం ఉందన్నారు. దీని ఆధారంగా జర్నలిజంలో ఎంఎస్‌ చేస్తే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అమెరికాలో ఎన్నో పేరెన్నికగన్న యూనివర్శిటీలు జర్నలిజం కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి.
నేను ఎంఎ(ఎకనామిక్స్‌) చదువుతున్నాను. అమెరికాలో సినిమా డెరెక్షన్‌ కోర్సు చేసి డెరైక్టర్‌గా స్థిరపడాలనుకుంటున్నాను?
+
అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలు డెరైక్షన్‌, ఫిల్మ్‌ప్రొడక్షన్‌ కోర్సులు అందిస్తున్నారుు.  ఎంఎ చదివారు కాబట్టి అక్కడ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదవడానికి అవసరమైన కొన్ని కోర్సులను పూర్తి చేయూలి.
మరో మార్గమేంటంటే.. ట్రాన్స్‌ఫర్‌ స్టూడెంట్‌గా బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫిల్మ్‌ డెరైక్టర్‌ మేజర్‌  కోర్సు చేసిన తరువాత అందులో మాస్టర్స్‌ డిగ్రీని సంపాదించవచ్చు.
నేను డిగ్రీ చదువుతున్నాను. అమెరికాలో ఫిల్మ్‌ డెరైక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం ఏంటి?
+
అమెరికాలో దాదాపు 22 యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు సినీ రంగానికి చెందిన పలు కోర్సులను (డెరైక్షన్‌, ఎడిటింగ్‌, ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌ తదితర) డిప్లొమా, డిగ్రీ స్థాయిల్లో అందిస్తున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో అధిక శాతం న్యూయార్క్‌, లాస్‌ఏంజెలిస్‌లలోనే ఉన్నాయి. వీటిలో ప్రవేశించే ముందు సంబంధిత కళాశాలకు యూనివర్సిటీల గుర్తింపు ఉందా? సర్టిఫికెట్లు మంజూరు చేస్తారా? ఫ్యాకల్టీకి సినీ రంగంలో అనుభవం ఏదైనా ఉందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవడం సులువవుతుంది. సాధారణంగా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాచిలర్‌ డిగ్రీ కనీస అర్హతగా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఫిల్మ్‌ కోర్సుల్ని పూర్తి చేసుకున్న వారికి సాధారణంగా మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ టైటిల్‌తో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇక.. ఫిల్మ్‌ స్కూల్స్‌ కూడా మూడు విభాగాలుగా ఉంటాయి. అవి..
ఇండస్ట్రీ ఫిల్మ్‌ స్కూల్స్‌: ఇవి విద్యార్థులకు హాలీవుడ్‌లో కెరీర్‌ అన్వేషణకు ఉపయోగపడే రీతిలో బోధిస్తాయి.
ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ స్కూల్స్‌: హాలీవుడ్‌ కాకుండా ఇతర ప్రాంతాల్లో సినిమా అవకాశాలను మెరుగుపరిచే విధంగా బోధన ఉంటుంది.
ఎక్స్‌పరిమెంటల్‌ స్కూల్స్‌: ఇవి సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రాధాన్యమిస్తూ.. బోధన సాగిస్తాయి. కళాత్మక దృష్టి ఉన్న వారికి ఈ ఎక్స్‌పరిమెంటల్‌ స్కూల్స్‌ చక్కని వేదికలు.
ఆయా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థుల్లోని రైటింగ్‌ స్కిల్స్‌ను ప్రధాన ప్రామాణికంగా పరిగణిస్తాయి. అంతేకాక.. ఈ రంగం పట్ల విద్యార్థులకున్న ఆసక్తిని బేరీజు వేసేందుకు వారు నిర్మించిన లఘుచిత్రాలు ఉంటే ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశించాక ఆసక్తిని బట్టి స్పెషలైజేషన్లు ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ప్రస్తుతం అమెరికాలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, పెన్సెల్వే నియా స్టేట్‌ యూనివర్సిటీ (పార్క్‌ క్యాంపస్‌), బోస్టన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లాస్‌ ఏంజెలిస్‌, రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు ప్రముఖమైనవి.
వెబ్‌సైట్‌:  www.educationusa.state.gov
బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాను. ఇప్పటివరకు అకడెమిక్‌ రికార్డు 70 శాతంపైగానే ఉంది. పీజీ స్థాయిలో విదేశాల్లో చదవాలనుకుంటున్నాను. వివరాలు తెలియజేయండి?
+
ఆస్ట్రేలియాలో డీకిన్‌ యూనివర్సిటీ, లాట్రోబ్‌ యూనివర్సిటీలలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ అందుబాటులో ఉంది. వీటిలో ప్రవేశించడానికి ఐఈఎల్‌టీఎస్‌లో 6-6.5 బ్యాండ్లు సాధించాలి. అమెరికాలో.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఎంఐటీ, జాన్‌ హాప్‌కిన్స్‌, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లలో పీజీ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సులు బోధిస్తున్నారు. అమెరికాలో చదవాలంటే 16 ఏళ్ల అకడెమిక్‌ రికార్డు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం మీకు అమెరికా అవకాశం లేనట్లే. కెనడాలో వాటర్‌లూ, మెక్‌గిల్‌ వంటి యూనివర్సిటీల్లోనూ మీరు ప్రయత్నించవచ్చు.
ప్రస్తుతం బీఫార్మసీ చదువుతున్నాను. అమెరికా లేదా యూకేలో ఎంఫార్మసీ చేయాలంటే ఎలా?
+

విదేశాల్లో ఎంఫార్మసీ కాసింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమెరికాలో రెండేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సులో ప్రవేశించాలంటే ఫార్మసీ కాలేజ్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లో నిర్దేశిత స్కోరు సొంతం చేసుకోవాలి. దాదాపు 35 వేల నుంచి 55 వేల అమెరికన్‌ డాలర్ల మేర ఫీజు ఉంటుంది. అక్కడ ఫార్మసీకి సంబంధించి.. లాంగ్‌ ఐల్యాండ్‌ యూనివర్సిటీ, మాసాచుసెట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ హెల్త్‌ సెన్సైస్‌, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ, ఓహియో స్టేట్‌ యూనివర్సిటీలు పేరుగడించాయి. యూకేలో కొన్ని యూనివర్సిటీలు ఏడాది వ్యవధిలోనే ఎంఫార్మసీని బోధిస్తున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్‌ స్ట్రాచ్‌కై ్లడ్‌, రాబర్ట్‌ గోర్డాన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌(స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ)లు నాణ్యమైన బోధనకు గుర్తింపుగా ఉన్నాయి.

ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌గా బీఎస్సీ చదువుతున్నాను. మాస్టర్స్‌ స్థాయిలో విదేశాల్లో చదవాలనుకుంటున్నాను. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌లో పీజీ చేయడానికి అనుకూలమైన దేశాల గురించి తెలియజేయగలరు. విదేశీ డిగ్రీతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకునే వీలుందా?
+
గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యావరణ కాలుష్యం తదితర కారణాలతో... వాటిని నియంత్రించడానికి నిపుణుల అవసరం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతోంది. కాబట్టి ముందుగా ఈ కోర్సు భవిష్యత్తు గురించి ఆందోళన చెందక్కర్లేదు. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెన్సీలు, రీసైక్లింగ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ విభాగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.. మాస్టర్స్‌ స్థాయిలో ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌గా అన్ని దేశాల్లో కోర్సుల బోధన సాగుతోంది. అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశించాలంటే మాత్రం పూర్వ అకడెమిక్‌ రికార్డు 16 ఏళ్లు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం మీకు అమెరికా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. యూకే, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్‌ తదితర దేశాల్లో 15 ఏళ్ల అకడెమిక్‌ ట్రాక్‌తోనే పీజీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
బీఏ సైకాలజీ చదువుతున్నాను. యూకేలో.. పీజీలో క్లినికల్‌ సైకాలజీలో ప్రవేశించడానికి మార్గం ఏమిటి?
+
యూకేలో పీజీ స్థాయిలో క్లినికల్‌ సైకాలజీలో అడుగుపెట్టాలంటే.. అదే విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తయ్యాక గుర్తింపుపొందిన క్లినికల్‌ సైకాలజిస్ట్‌ దగ్గర పనిచేసిన అనుభవం ఉండాలి. ఆ ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికెట్‌ ఆధారంగానే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు అప్రంటిషిప్‌ పూర్తి చేసుకుంటే మార్గం సులభం అవుతుంది.
డిగ్రీ చదువుతున్నాను. అమెరికాలో టెక్స్‌టైల్‌ విభాగంలో పీజీ చేయడానికి మార్గం ఏమిటి?
+
అమెరికాలో పలు యూనివర్సిటీలు టెక్స్‌టైల్‌ రంగానికి చెందిన పలు అంశాలు (డిజైన్‌, ప్రాసెస్‌, టెక్నాలజీస్‌ ఇన్‌ ప్రాసెసింగ్‌, మ్యానుఫాక్చరింగ్‌) స్పెషలైజేషన్లుగా పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో.. కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ ఫ్యాబ్రిక్‌ డిజైన్‌, ఫిలడెల్ఫియా యూనివర్సిటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌), కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీలు పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిలో అడుగుపెట్టడానికి 16 ఏళ్ల అకడెమిక్‌ రికార్డుతోపాటు జీఆర్‌ఈ, టోఫెల్‌ స్కోర్లు కావాలి.
బీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్నాను. విదేశాల్లో ఎల్‌ఎల్‌ఎం చేయడానికి అవకాశం ఉందా?
+
లాలో బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత ఎక్కడైనా ఎల్‌ఎల్‌ఎం చేసే అవకాశం ఉంది.  మన న్యాయ విధానాలను బట్టి యూకే పాపులర్‌ కంట్రీగా నిలుస్తోంది. ఇక.. అకడెమిక్‌గా పదో తరగతి నుంచి కచ్చితంగా ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఉంటేనే ఎల్‌ఎల్‌ఎంకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. అమెరికాలో చదవాలంటే.. మాత్రం ఎల్‌.ఎస్‌.ఎ.టి. (ఎల్‌-శాట్‌)రాయాలి. అకెడమిక్‌ సెషన్‌కు ఏడాది ముందుగానే దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ముందుగానే సిద్ధం కావాలి.
అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఐచ్ఛికాంశాలుగా బీకాం చదువుతున్నాను. ఇదే విభాగంలో లండన్‌, లేదా కెనడాలో పీజీ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
+
కెనడాలో పీజీ చదవడానికి 16 ఏళ్ల అకడెమిక్‌ ట్రాక్‌ తప్పనిసరి. కాబట్టి
మీరు ముందుగా ఆ మేరకు మన దేశంలోనే ఎంకాం చదవడం శ్రేయస్కరం.   ప్రస్తుత మీ విద్యార్హతలతో యూకేలో దరఖాస్తు చేసుకునే వీలుంది. ప్రస్తుతం ఈ కోర్సు బోధనలో మాంచెస్టర్‌, లాంకెస్టర్‌, నాటింగ్‌హామ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు పేరు గడించాయి. అకడెమిక్‌ సెషన్‌కు కనీసం ఏడాది ముందు దరఖాస్తు చేసుకుంటేనే సానుకూల ఫలితం ఆశించవచ్చు. దరఖాస్తుతోపాటు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు సర్టిఫికెట్లు, స్టేట్‌ మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, రెండు రికమండేషన్‌ లెటర్లు జత చేయాలి. అక్కడ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కాల వ్యవధి ఏడాది నుంచి ఏడాదిన్నర ఉంటుంది. ట్యూషన్‌ ఫీజు సగటున్న 15వేల పౌండ్లు. నివాస ఖర్చులకు ఏడాదికి పది వేల పౌండ్లు సిద్ధం చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.educationukin.org చూడండి.