Skip to main content

టోఫెల్ పరీక్ష గురించి వివరించండి?

- రవీంద్ర, సంగారెడ్డి.
Question
టోఫెల్ పరీక్ష గురించి వివరించండి?
  • ఇంగ్లిష్‌లో మాట్లాడే దేశాలన్నీ.. విద్యార్థి ఇంగ్లిష్ భాషా నైపుణ్యాల గురించి తెలుసుకునేందుకు టోఫెల్ స్కోరును ప్రామాణికంగా భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా,కెనడా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల యూనివర్సిటీల్లో సీటు సంపాదించుకున్న యువత ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం గురించి ఈ స్కోరు తెలియజేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు అర్హత పరీక్షగా టోఫెల్‌ను భావిస్తున్నారు.
  • ఈ పరీక్ష ఇంటర్నెట్ ఆధారితంగా ఉంటుంది. దేశంలో ఏటా 30-40 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన తేదీల్లో పరీక్ష రాసుకునే సౌలభ్యం ఉంటుంది.
  • ఇందులో ఇంగ్లిష్‌కు సంబంధించి అభ్యర్థి రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. నాలుగున్నర గంటల సమయంలో పరీక్ష పూర్తిచేయాలి. ఈ పరీక్షను ఎన్నిసార్లైనా రాసుకునే సౌలభ్యం ఉంది.

పరీక్ష విధానం:

  • రీడింగ్ సెక్షన్: ఇందులో 3 లేదా 4 ప్యాసేజీలు ఉంటా యి. దీనికి సంబంధించి ఒక్కో ప్యాసేజీకి 12 నుంచి 14 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు వీటికి 60 నుంచి 80 నిమిషాల్లో సమాధానాలు రాయాలి.
  • లిజనింగ్ సెక్షన్: ఈ సెక్షన్‌లో అభ్యర్థులకు కొన్ని లెక్చర్స్‌ను వినిపిస్తారు. అభ్యర్థులు లెక్చర్‌కు సంబంధించి నోట్స్ రాసుకోవాలి. లెక్చర్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటిని 60 నుంచి 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
  • స్పీకింగ్ సెక్షన్: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఇండిపెండెంట్ స్పీకింగ్ టాస్క్స్ సెక్షన్‌లో అభ్యర్థులను అడిగే ప్రశ్నలకు, వారి ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా సమాధానాలు ఇవ్వాలి. ఇక ఇంటిగ్రేటెడ్ స్పీకింగ్ టాస్క్స్ సెక్షన్‌లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను ఉపయోగిస్తూ సమాధానాలు తెలపాలి.
  • రైటింగ్ సెక్షన్: ఒక టాపిక్ ఇచ్చి, దానికి సంబంధించిన అంశంపై రాయమని అడుగుతారు. అభ్యర్థి రాసిన సమాధానాల ఆధారంగా 0-5 స్కేల్‌తో అసెస్ చేస్తారు.

వెబ్‌సైట్: www.ets.org

Photo Stories