జీఆర్‌ఈ పరీక్ష గురించి వివరించండి?
- సుమన్, నిజామాబాద్.
Question
జీఆర్‌ఈ పరీక్ష గురించి వివరించండి?
- గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్(జీఆర్‌ఈ).. ఈ పరీక్షను అమెరికాలోని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ అనే సంస్థ నిర్వహిస్తోంది. అమెరికాలోని విద్యాసంస్థలు అభ్యర్థి సామర్థ్యాన్ని జీఆర్‌ఈ స్కోర్ ద్వారా అంచనా వేస్తాయి. అర్హులైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తాయి. ఈ పరీక్ష స్కోర్ ఐదేళ్ల వరకు చెల్లుతుంది.
- ఈ పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి.
- జీఆర్‌ఈ రివైజ్డ్ జనరల్ టెస్ట్: వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. విద్యార్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. అన్ని అంశాల్లోనూ మంచి స్కోర్ సాధించాలి. 340కు వెర్బల్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లలో 130 నుంచి 150 స్కోర్ సాధించాలి. అనలిటికల్ రైటింగ్‌లో 6కు కనీసం 3 స్కోర్ పొందాలి.
- సబ్జెక్టు టెస్ట్: ఇందులో బయోకెమిస్ట్రీ, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ లిటరేచర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ వంటి 8 సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. విద్యార్థి స్పెషలైజేషన్ ఆధారంగా ఇందులో సబ్జెక్టును ఎంచుకోవచ్చు.
వెబ్‌సైట్: www.ets.org/gre