Skip to main content

Study Abroad FAQs Listing

టోఫెల్ పరీక్ష గురించి వివరించండి?
+
  • ఇంగ్లిష్‌లో మాట్లాడే దేశాలన్నీ.. విద్యార్థి ఇంగ్లిష్ భాషా నైపుణ్యాల గురించి తెలుసుకునేందుకు టోఫెల్ స్కోరును ప్రామాణికంగా భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా,కెనడా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల యూనివర్సిటీల్లో సీటు సంపాదించుకున్న యువత ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం గురించి ఈ స్కోరు తెలియజేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు అర్హత పరీక్షగా టోఫెల్‌ను భావిస్తున్నారు.
  • ఈ పరీక్ష ఇంటర్నెట్ ఆధారితంగా ఉంటుంది. దేశంలో ఏటా 30-40 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన తేదీల్లో పరీక్ష రాసుకునే సౌలభ్యం ఉంటుంది.
  • ఇందులో ఇంగ్లిష్‌కు సంబంధించి అభ్యర్థి రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. నాలుగున్నర గంటల సమయంలో పరీక్ష పూర్తిచేయాలి. ఈ పరీక్షను ఎన్నిసార్లైనా రాసుకునే సౌలభ్యం ఉంది.

పరీక్ష విధానం:

  • రీడింగ్ సెక్షన్: ఇందులో 3 లేదా 4 ప్యాసేజీలు ఉంటా యి. దీనికి సంబంధించి ఒక్కో ప్యాసేజీకి 12 నుంచి 14 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు వీటికి 60 నుంచి 80 నిమిషాల్లో సమాధానాలు రాయాలి.
  • లిజనింగ్ సెక్షన్: ఈ సెక్షన్‌లో అభ్యర్థులకు కొన్ని లెక్చర్స్‌ను వినిపిస్తారు. అభ్యర్థులు లెక్చర్‌కు సంబంధించి నోట్స్ రాసుకోవాలి. లెక్చర్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటిని 60 నుంచి 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
  • స్పీకింగ్ సెక్షన్: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఇండిపెండెంట్ స్పీకింగ్ టాస్క్స్ సెక్షన్‌లో అభ్యర్థులను అడిగే ప్రశ్నలకు, వారి ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా సమాధానాలు ఇవ్వాలి. ఇక ఇంటిగ్రేటెడ్ స్పీకింగ్ టాస్క్స్ సెక్షన్‌లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను ఉపయోగిస్తూ సమాధానాలు తెలపాలి.
  • రైటింగ్ సెక్షన్: ఒక టాపిక్ ఇచ్చి, దానికి సంబంధించిన అంశంపై రాయమని అడుగుతారు. అభ్యర్థి రాసిన సమాధానాల ఆధారంగా 0-5 స్కేల్‌తో అసెస్ చేస్తారు.

వెబ్‌సైట్: www.ets.org

జీఆర్‌ఈ పరీక్ష గురించి వివరించండి?
+
  • గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్(జీఆర్‌ఈ).. ఈ పరీక్షను అమెరికాలోని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ అనే సంస్థ నిర్వహిస్తోంది. అమెరికాలోని విద్యాసంస్థలు అభ్యర్థి సామర్థ్యాన్ని జీఆర్‌ఈ స్కోర్ ద్వారా అంచనా వేస్తాయి. అర్హులైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తాయి. ఈ పరీక్ష స్కోర్ ఐదేళ్ల వరకు చెల్లుతుంది.
  • ఈ పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి.
    1. జీఆర్‌ఈ రివైజ్డ్ జనరల్ టెస్ట్: వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. విద్యార్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. అన్ని అంశాల్లోనూ మంచి స్కోర్ సాధించాలి. 340కు వెర్బల్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లలో 130 నుంచి 150 స్కోర్ సాధించాలి. అనలిటికల్ రైటింగ్‌లో 6కు కనీసం 3 స్కోర్ పొందాలి.
    2. సబ్జెక్టు టెస్ట్: ఇందులో బయోకెమిస్ట్రీ, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ లిటరేచర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ వంటి 8 సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. విద్యార్థి స్పెషలైజేషన్ ఆధారంగా ఇందులో సబ్జెక్టును ఎంచుకోవచ్చు.

    వెబ్‌సైట్: www.ets.org/gre
శాట్ పరీక్ష గురించి వివరించండి?
+
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎస్‌ఏటీ-శాట్). ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి. మొత్తం మూడు గంటల 45 నిమిషాల వ్యవధిలో పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ పరీక్షను ఒకటి లేదా రెండు సార్లు రాయవచ్చు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించడం ద్వారా ఎంచుకున్న కాలేజీలో సీటు వచ్చే అవకాశం లేదు. కాలేజీ నిర్ధారించిన అంచనాలకు అనుగుణంగా అకడమిక్ అర్హతలు ఉన్నాయో లేదో గమనించాలి.

శాట్‌లో సబ్జెక్ట్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిని రాయడం ద్వారా అభ్యర్థిలోని విషయావగాహన అర్థం అవుతుంది. లిటరేచర్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, చైనీస్, జపనీస్, కొరియన్ లాంటి సబ్జెక్టులపై టెస్టులు రాయవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఈ టెస్ట్ రాయడం ద్వారా సరైన కాలేజీని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. కాలేజీల్లో ప్రవేశాలకు కూడా మార్గం సుగమం అవుతుంది. సబ్జెక్టు సిలబస్, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.sat.collegeboard.org
ప్రస్తుతం ఎమ్మెస్సీ(అపై ్లడ్‌ జియూలజీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఈ అంశంలో విదేశీ విశ్వవిద్యాలయూల్లో పరిశోధన చేయూలని ఉంది. ప్రవేశం పొందడానికి మార్గాలేమిటి?
+
విదేశాల్లో విద్యాభ్యాసం చేయూలనుకునే విద్యార్థులు GRE, TOEFL వంటి పరీక్షలు రాయూలి. ఈ పరీక్షల్లో సంపాదించిన మార్కులతోపాటు అకడమిక్‌ రికార్డు, సబ్జెక్టు ప్రాధాన్యం, పరిశోధన/బోధన అనుభవం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రవేశం కల్పిస్తారు. యూఎస్‌లోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతోపాటు మరికొన్ని విద్యాసంస్థలు ఈ అంశంలో పరిశోధనకు అవకాశం కల్పిస్తున్నారుు.
నేను ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశాను. నాకు యుఎస్‌లో ఎంఎస్‌ చేయూలని ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం వల్ల అక్కడ కొత్త వారికి ఉద్యోగాలు రావడంలేదని, ఎంఎస్‌ చేసిన తరువాత ఉద్యోగం కోసం మరలా ఇండియూకు తిరిగిరావాల్సి ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య అమెరికాలో ఎంఎస్‌ చేయడం మంచిదేనా?
+

చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారుు.  ఆర్థిక మాంద్యంలో ఉన్నా, ఉద్యోగ మార్కెట్‌పై ఆర్థిక మాంద్య ప్రభావం పెద్దగా లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ కావాలంటే అమెరికానే బెస్ట్‌!!

నేను ఎంఎస్సీ పూర్తి చేసి నెట్‌కు ప్రిపేరవుతున్నాను. అమెరికాలో పీహెచ్‌డీ చేయూలనుకొంటున్నాను. యుఎస్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏం చేయూలో సలహా ఇవ్వండి?
+

ఇండియూలో ఎంఎస్సీ చదివి నేరుగా అమెరికా యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ  అడ్మిషన్‌ పొందడం చాలా కష్టం. ఇంతకుముందు మీరేమైనా పేపర్లను పబ్లిష్‌ చేసినా, లేదా రీసెర్చ్‌ అనుభవం ఏదైనా ఉంటే అడ్మిషన్‌ పొందడం సులువు. అక్కడ ఎంఎస్‌ చేసిన తరువాత పీహెచ్‌డీ చేయడానికి అనువుగా ఉండే ఏదైనా కోర్సు చేయడం మంచిది.

నేను ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. యుఎస్‌లో ఇంజనీరింగ్‌ చేయాలనుకుంటున్నాను. అమెరికాలో ఇంజనీరింగ్‌ చేయడానికి ఒక యూనివర్సిటీని ఎంచుకున్నాను. నేను అక్కడ చదువు కోవాలంటే ఏఏ పరీక్షలు రాయూలి?
+
ఏ యూనివర్సిటీలో చదవాలో నిర్ణరుుంచుకోవడం చాలా మంచిది. ఆ యూనివర్సిటీ అడ్మిషన్లను ఎలా జరుపుతుందో తెలుసుకోండి. అమెరికాలోని అన్ని మంచి యూనివర్సిటీలు TOEFL, SAT స్కోర్లను తప్పనిసరిగా అడుగుతారుు. మీరు TOEFL, SAT  కోసం ప్రిపేరవండి. ఫైనాన్షియల్‌ అసిస్టెంట్స్‌ కోసం నవంబర్‌,లేదా డిసెంబర్‌ లోపు ఈ పరీక్షలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
నేను బయోటెక్నాలజీలో బీఎస్సీ చేశాను. జర్మనీలో పీజీ చేయాలని ఉంది. అక్కడి కోర్సులు నా సబ్జెక్టుకు అనువుగా ఉన్నాయి. నేను ఏ కన్సెల్టెన్సీకి వెళ్లినా నిరుత్సాహపరిచారు. నాకు మంచి సలహా ఇవ్వండి?
+
ముందుగా జర్మనీలో పీజీ చేయాలంటే ఇక్కడ చేసే మూడేళ్ళ డిగ్రీ అర్హత సరిపోదు. మీరు డిగ్రీ స్థాయిలో  మరో రెండు నుంచి మూడేళ్ల విద్యను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇండియాలోనే మీరు పీజీ పూర్తి చేసి తర్వాత జర్మనీలో మాస్టర్స్‌ డిగ్రీకి దరఖాస్తు చేసుకుంటే బాగుంటుంది. అక్కడ మాస్టర్స్‌ అయిన తర్వాత పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. మీ అర్హత పరీక్షలో 80 శాతం మించి మార్కులు సాధించాలి. ఇక టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ లో స్కోర్లు తప్పనిసరి.
నేను కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాను. యూకేలో చదువు కొనసాగించాలని ఉంది. వచ్చే నెల్లో ఐఈఎల్‌టీఎస్‌ రాస్తాను. యూకే యూనివర్సిటీల్లో కోర్సులు, స్కాలర్‌ షిప్‌ వివరాలు తెలపండి?
+
ఐఈఎల్‌టీఎస్‌ స్కోరును బట్టే యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవటానికి వీలవుతుంది. ముందు మీరు ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు సాధించండి. ఇక యూకేలో ఇంటర్నేషనల్‌ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు మృగ్యమనే చెప్పాలి.
అక్కడి ప్రభుత్వం కోర్సు పూర్తి చేసిన తర్వాత కోర్సుకు సంబంధించిన వర్క్‌ చేయటానికి మరో రెండేళ్లు అక్కడ ఉండే అవకాశాన్ని ఇస్తోంది. ఆ సమయంలో ఇతర ఉద్యోగుల్లాగే వారికీ  జీతాలు చెల్లిస్తారు.
నేను పాలిటెక్నిక్‌ డి ప్లొమా చేశాను. యుకె లేదా యుఎస్‌లో బీటెక్‌ చేయూలనుకుంటున్నాను. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏఏ పరీక్షలు రాయూలి?
+
యుఎస్‌లో బ్యాచిలర్‌ డి గ్రీ చేయడానికి పాలిటెక్నిక్‌ చేసిన వారు అర్హులు కాదు. మీరు యుకె, ఆస్ట్రేలియూల్లో బ్యాచిలర్‌ డిగ్రీ చేయడానికి ప్రయత్నించండి.
బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఆస్ట్రేలియాలో ఎంబీఎ ఫార్మసీ చేయాలని ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకోవాలని ఉంది. శిక్షణ ఇచ్చే సంస్థ, శిక్షణా కాలం, ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష ఫీజు వివరాలు తెలపండి. అలాగే ఆస్ట్రేలియాలో టాప్‌ యూనివర్సిటీలను తెలపండి?
+
హైదరాబాద్‌లోని ఆరు విసు సెంటర్లు  ఐఈఎల్‌టీఎస్‌కు శిక్షణ ఇస్తున్నాయి.  రోజుకు 2 గంటల చొప్పున నెల రోజులు లేదా రోజుకు ఒక గంట చొప్పున రెండు నెలల శిక్షణ ఉంటుంది. ఇక మంచి యూనివర్సిటీల ఎంపికను మీ పూర్తి ప్రొఫైల్‌ చూస్తే గాని చెప్పలేం. రాయల్‌ మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌, యూనివర్సిటీ ఆప్‌ వెస్ట్రన్‌ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియాలు... ఆస్ట్రేలియాలో పేరుగాంచిన యూని వర్సిటీలు. ఇక ఆస్ట్రేలియాలో ఫార్మసిస్టుగా పని చేయటానికి మీరు లెసైన్సింగ్‌ పరీక్ష లో ఉత్తీర్ణులు కావాలి.
ఫైనాన్స్‌ రంగంలో నాకు అనుభవం ఉంది. నేను 2002లో బీటెక్‌, 2006లో ఉస్మానియూ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పూర్తి చేశాను. ఇప్పుడు న్యూజిలాండ్‌ లేదా ఆస్ట్రేలియూలో ఎంబీయే చదవాలంటే ఎలా?
+
ఎంబీయే చదవడానికి న్యూజిలాండ్‌ కంటే ఆస్ట్రేలియూ బాగుంటుంది. ఇందుకోసం మీరు IELTS పరీక్ష రాయూలి. మీ అకడమిక్‌ ప్రొఫైల్‌,  IELTS స్కోరు ఆధారంగా యూనివర్సిటీలు ఎంపిక చేసుకుంటారుు.
నేను సీఎ ఇంటర్‌ చదువుతున్నాను. ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియూ వెళ్లాలనుకుంటున్నాను. అక్కడ ఏ కోర్సు చదివితే బాగుంటుంది. ఎటువంటి ఉద్యోగాలకు డిమాండ్‌ ఉంది?
+
సీఎ ఇంటర్‌ పూర్తరుున తరువాత ఆస్ట్రేలియూలో  ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీయే, లేదా ప్రొఫెషనల్‌ అకౌంటెన్సీ కోర్సులు  చదివితే  మంచి అవకాశాలు ఉంటారుు. ఫైనాన్షియల్‌ ప్రొఫెషనల్స్‌కు ఆస్ట్రేలియూలో మంచి డిమాండ్‌ ఉంది.
నేను లోకల్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ నుంచి బీటెక్‌ చేశాను. నాకు యూకే లేక యూఎస్‌లో ఎంబీఏ చేయూలని ఉంది. ఈ దేశాల్లోని టాప్‌ యూనివర్సిటీలు కనీసం రెండేళ్లు వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న అభ్యర్ధులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని అంటున్నారు. నేను ఈసీఈతో బీటెక్‌ చేశాను కాబట్టి సాఫ్ట్‌వేర్‌ లేక హార్డ్‌వేర్‌ కంపెనీల్లోనే పనిచేయూలా లేక బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ వంటి ఏ రంగంలోనైనా అనుభవం ఉంటే సరిపోతుందా? ఏం చేస్తే నేను ఆ దేశాల్లో ఎంబీఏ చేయగలను?
+
మీరు విన్నది నిజమే. అమెరికా, బ్రిటన్‌లలోని మంచి యూనివర్సిటీలన్నీ ఎంబీఏలో ప్రవేశానికి ఉద్యోగ అనుభవాన్ని కోరుతున్నారుు. కనీసం రెండు నుంచి మూడేళ్లు పూర్తి కాల అనుభవం కావాలి. మాన్యుఫ్యాక్చరింగ్‌, రిటైల్‌, ఫైనాన్స్‌ లేదా కాన్సెప్ట్‌ సెల్లింగ్‌ కంపెనీల్లో పాలనాపరమైన లేదా సాంకేతిక పరమైన అనుభవాన్ని అడుగుతున్నారు. ప్రత్యేకించి ఫలానా రంగంలోనే అనుభవం కావాలన్న నిబంధన ఏదీ లేదు.
నేను ఎమ్మెస్సీ బయూలజీ చదివాను. జర్నలిజంలో నాలుగేళ్ల అనుభవం ఉంది. నా వయసు 25 సంవత్సరాలు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నాను. ఇందుకు సంబంధించి ఎమైనా కోర్సులున్నాయూ?
+
జర్నలిజంలో మీకు నాలుగేళ్ల అనుభవం ఉందన్నారు. దీని ఆధారంగా జర్నలిజంలో ఎంఎస్‌ చేస్తే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అమెరికాలో ఎన్నో పేరెన్నికగన్న యూనివర్శిటీలు జర్నలిజం కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి.
ఉస్మానియూ యూనివర్సిటీ మహిళా కళాశాలలో బీఎస్సీ (బయోటెక్నాలజీ) చేస్తున్నాను. డిగ్రీ తర్వాత విదేశాల్లో ఏ కోర్సులు చేసే అవకాశం ఉంది?అసలు విదేశాలకు వెళ్లాలంటే.. ఏ పరీక్షలు రాయూలి?
+
మీరు అమెరికాలో చదవాలని భావిస్తే జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలి. మీకు ఇంకా గ్రాడ్యుయేట్‌ స్థారుులో నాలుగు సంవత్సరాల విద్య పూర్తి కాలేదు కాబట్టి ట్రాన్స్‌ఫర్‌ స్టూడెంట్‌గా అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగంలో మీకు కనీసం 6 నెలల చక్కటి పరిశోధనానుభవం ఉంటే యూఎస్‌ యూనివర్సిటీలు నేరుగా ఎంఎస్‌ కోర్సులో చేర్చుకుంటారుు. ఇక ఆస్ట్రేలియూ, యూకే, ఐర్లాండ్‌ దేశాల్లో చదవదలుచుకుంటే టోఫెల్‌, ఐబిట్‌ లేక ఐఈఎల్‌టిఎస్‌ పరీక్షలు రాయూలి. వీటిలో స్కోరు ఆధారంగా నేరుగా అక్కడ మాస్టర్‌ ప్రోగ్రాంలోకి ప్రవేశించవచ్చు.
నేను బీటెక్‌ చదువుతున్నాను. జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలనుకుంటున్నాను. వీటి పరీక్షా విధానం తెలపండి?
+
జీఆర్‌ఈ అనేది విద్యార్థి తార్కిక జ్ఞానం, విశ్లేషణా సామర్ధ్యాలను అంచనా వేసే పరీక్ష. ఇందులో ప్రధానంగా వెర్బల్‌ ఇంగ్లిష్‌, క్వాంట్స్‌, ఎనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌ (ఏడబ్ల్యూఏ) అంశాలు ఉంటారుు. టోఫెల్‌లో వినటం, చదవటం, మాట్లాడటం, రాయటం వంటి ప్రాథమిక భాషా కౌశలాలను ఇంటర్నెట్‌ ఆధారంగా పరీక్షిస్తారు. ఇంకా ఈ పరీక్షలపై పూర్తి వివరాల కోసం ఈ కింది వెబ్‌సైట్‌లను సంప్రదించండి. www.ets.org/gre, www.ets.org/toefl 
ఆస్ట్రేలియూలో ఎంబీఏ చేయటానికి ఎంత ఖర్చవుతుంది?
+
సుమారు 14,000 నుంచి 20,000 ఆస్ట్రేలియూ డాలర్లు ఖర్చ వుతారుు.
నేను ఎంఎ(ఎకనామిక్స్‌) చదువుతున్నాను. అమెరికాలో సినిమా డెరెక్షన్‌ కోర్సు చేసి డెరైక్టర్‌గా స్థిరపడాలనుకుంటున్నాను?
+
అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలు డెరైక్షన్‌, ఫిల్మ్‌ప్రొడక్షన్‌ కోర్సులు అందిస్తున్నారుు.  ఎంఎ చదివారు కాబట్టి అక్కడ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదవడానికి అవసరమైన కొన్ని కోర్సులను పూర్తి చేయూలి.
మరో మార్గమేంటంటే.. ట్రాన్స్‌ఫర్‌ స్టూడెంట్‌గా బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫిల్మ్‌ డెరైక్టర్‌ మేజర్‌  కోర్సు చేసిన తరువాత అందులో మాస్టర్స్‌ డిగ్రీని సంపాదించవచ్చు.
నేను ఉస్మానియూ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశాను. అమెరికాలో పీహెచ్‌డీ చేయూలని అనుకొంటున్నాను. అక్కడ చదువుకుంటూ ఏదైనా పార్ట్‌టైం ఉద్యోగం చేసుకోవచ్చా. గంటకి ఎన్ని డాలర్లు ఇస్తారు?
+
అమెరికాలో పీహెచ్‌డీ చేయూలంటే 18 సంవత్సరాల (10+2+4 బ్యాచిలర్‌+2 మాస్టర్‌) విద్య తప్పనిసరి. బ్యాచ్‌లర్‌, మాస్టర్స్‌ డిగ్రీలో ఏదీ దూరవిద్యావిధానం ద్వారా చదివి ఉండకూడదు. అమెరికన్‌ యూనివర్సిటీల్లో నేరుగా పీహెచ్‌డీ అడ్మిషన్లు లభించడం ఎంతో కష్టం. రీసెర్చ్‌లో ఆరు నెలల నుంచి సంవత్సరం అనుభవం ఉన్న వారినే యూనివర్సిటీలు రికమండ్‌ చేస్తారుు. మీకు రీసెర్చ్‌లో ఉన్న అనుభవం, ఏవైనా పేపర్లు పబ్లిష్‌ చేసి ఉంటే అడ్మిషన్‌ దొరకడం తేలిక. మీ ప్రొఫైల్‌ ఆధారంగా యూనివర్సిటీకి సంబంధించిన విభాగాలే ఆర్థిక సహాయం చేస్తారుు. ఈ సమయంలో విద్యార్థికి వారంలో 20 గంటలు పని చేసుకొనే అవకాశం కల్పించడంతోపాటు గంటకు 20-25 డాలర్లు చెల్లిస్తారు.
నేను ఎంసీఏ పూర్తి చేశాను. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలను కొంటున్నాను? అమెరికా, ఆస్ట్రేలియూలతో పోల్చితే యుకెలో విద్యావిధానం ఎలా ఉంటుంది? ఉద్యోగ విషయంలో భారతీయులకు ఏ దేశం అనుకూలంగా ఉంది?
+

ఎంసీఏ  చేశారు కాబట్టి మీరు ఎంఎస్‌-కంప్యూటర్స్‌ లేదా ఎంబీఏ చేయవచ్చు. రెండేళ్ల పని అనుభవం ఉంటే.. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక  యూనివర్సిటీల్లో ఎంబీయే చదివే అవకాశం ఉంది. దీనికి మీ అకడమిక్‌ పర్సంటేజీ, GMAT,TOEFL ల్లో మంచి స్కోర్లు సాధించాలి. ఈ కోర్సు కాలవ్యవధి యుకెలో ఏడాది, యుఎస్‌లో రెండేళ్లు. ఇక ఉద్యోగ అవకాశాల విషయంలో అమెరికానే బెస్ట్‌.

ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను. అమెరికా వెళ్లేందుకు హెచ్‌1 వీసా వచ్చింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గారుు. అమెరికా వెళ్లడం సబబేనా?
+
మీ విద్యార్హతలన్నీ సరిగా ఉంటే సంకోచం అవసరంలేదు. అమెరికాలోని కొన్నిరంగాల్లో మాత్రమే ఈ స్తబ్దత నెలకొంది.  ఐటీలో మీరు ఆందోళన చెందుతున్నంత సంక్షోభంలేదు.
నేను బీఎస్సీ చదివాను. సైన్స్‌లో పరిశోధన చేయూలని ఉంది. బ్రిటన్‌, అమెరికా వర్శిటీలు అందించే స్కాలర్‌షిప్‌ల వివరాలు తెలుపగలరు?
+
బీఎస్సీ క్వాలిఫికేషన్‌తో యూఎస్‌లో డెరైక్ట్‌గా ఎంఎస్‌ సీటు ఇవ్వరు. మీరు బ్యాచిలర్‌ ప్రోగామ్‌లోకి వెళ్లాలంటే ట్రాన్స్‌ఫర్‌ స్టూడెంట్‌గా బ్యాచిలర్‌ డిగ్రీ చేయూల్సి ఉంటుంది. మీకు వచ్చిన మార్కుల ఆధారంగా స్కాలర్‌షిప్స్‌ ఉంటారుు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోకి ప్రవేశించాలంటే SAT/TOEFL రాయూలి.
నేను బీటెక్‌ చదివి ఎంఎన్‌సీలో పనిచేస్తున్నాను. మూడేళ్ల అనుభవం ఉంది. జర్మనీలో ఎంబీయే చేయూలనుకుంటున్నాను?
+
ఎంబీయే కోర్సు చేయడానికి జర్మనీ కంటే అమెరికా ఎంతో అనుకూలం. కొన్ని జర్మన్‌ యూనివర్శిటీలు ఆఫర్‌ చేస్తున్న కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లేదు. అమెరికా యూనివర్శిటీల్లో చదవడానికి మీకు అన్ని అర్హతలు ఉన్నారుు. తగిన ప్రవేశపరీక్షలు రాసి యూఎస్‌లో ఎంబీయే చేయడానికి ప్రయత్నించండి.
బ్రిటన్‌లో టాప్‌ బిజినెస్‌ స్కూళ్ల వివరాలు తెలుపండి. ఆయూ బిజినెస్‌ స్కూళ్లల్లో ప్రవేశానికి ఎలాంటి అర్హతలు అవసరం? ఏఏ ప్రవేశ పరీక్షలు రాయూలి?
+
బ్రిటన్‌లోని టాప్‌ బిజినెస్‌ స్కూళ్లలో చదవాలంటే పని అనుభవం ఉండాలి. కాబట్టి మీకు మూడు సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. GMAT, TOEFL, IELTS స్కోరు తప్పనిసరి
1. Ashridge
2. University of Bath
3. Birmingham Business School, University of Birmingham
4. Bradford Management Centre
5. Bristol Business School (University of the West of England, UWE)
6. University of Bristol
7. Cambridge University (Judge Institute)
8. City University
9. Cranfield
10. De Montfort University
నేను కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేశా. యూకేలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నా. అక్కడి యూనివర్సిటీలు అందించే కోర్సులు, స్కాలర్‌షిప్‌ల వివరాలు తెలపండి?
+
ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు ఆధారంగానే యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవటానికి వీలవుతుంది. ముందు మీరు ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు సాధించండి. ఇక యూకేలో ఇంటర్నేషనల్‌ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు తక్కువనే చెప్పాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత కోర్సుకు సంబంధించిన వర్క్‌ చేయటానికి మరో రెండేళ్లు అక్కడ ఉండే అవకాశాన్ని ఆ దేశ ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ సమయంలో ఇతర ఉద్యోగుల్లాగే వారికీ జీతాలు చెల్లిస్తారు.
నేను ఈసీ బీటెక్‌ పూర్తి చేశా. బ్రిటన్‌, లేదా అమెరికాల్లో ఎంబీఏ చేయూలని ఉంది. ఈ దేశాల్లోని టాప్‌ యూనివర్సిటీలు కనీసం రెండేళ్ల వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న అభ్యర్ధులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని చెబుతున్నారు. కాబట్టి నేను సాఫ్ట్‌వేర్‌, లేదా హార్డ్‌వేర్‌ కంపెనీల్లోనే పనిచేయూలా, లేదా బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ వంటి ఏ రంగంలోనైనా అనుభవం ఉంటే సరిపోతుందా?
+
అమెరికా, బ్రిటన్‌ల్లోని టాప్‌ వర్సిటీలు ఎంబీఏలో ప్రవేశానికి ఉద్యోగ అనుభవాన్ని కోరుతున్నారుు. కనీసం రెండు నుంచి మూడేళ్ల అనుభవం కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్‌, రిటైల్‌, ఫైనాన్స్‌,లేదా కాన్సెప్ట్‌ సెల్లింగ్‌ కంపెనీల్లో పాలనాపరమైన లేదా సాంకేతికపరమైన అనుభవాన్ని అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఫలానా రంగంలోనే అనుభవం కావాలన్న నిబంధన ఏదీ లేదు.
నేను ప్రస్తుతం బీటెక్‌ చదువుతున్నా. జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలనుకుంటున్నాను. యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియూ, జర్మనీల్లో విద్యనభ్యసించాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది?
+
అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు జనవరి, సెప్టెంబర్‌; యూకేలో జనవరి, సెప్టెంబర్‌; ఆస్ట్రేలియూలో ఫిబ్రవరి, జూలై; జర్మనీలో మార్చి, అక్టోబర్‌ల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. సాధారణంగా అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీలన్నీ ఫాల్‌ (సెప్టెంబర్‌) సెమిస్టర్‌కు 10-12 నెలల ముందు, స్ప్రింగ్‌కు 5-6 నెలల ముందు దరఖాస్తులు స్వీకరిస్తారుు. యూకే, ఆస్ట్రేలియూల్లో 5-6 నెలల ముందు, జర్మనీలో 10-12 నెలల ముందుగా అప్లికేషన్లు స్వీకరిస్తారుు. అడ్మిషన్ల విషయంలో యూఎస్‌ యూనివర్సిటీలు 2-3 నెలల్లో తమ నిర్ణయూన్ని తెలియజేస్తే... యూకే, ఆస్ట్రేలియూ వర్సిటీలు మరింత వేగంగా స్పందిస్తారుు.
ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నా. తర్వాత విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్నది లక్ష్యం. దీనికి కోసం ఏయే పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షా విధానం, ఫీజుల వివరాలు తెలపండి? మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రత్యేక పరీక్షలుంటాయా?
+
వర్సిటీల్లో చేరాలంటే.. ఎంచుకున్న కోర్సు ఆధారంగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. చాలా వర్సిటీలకు ‘టోఫెల్‌’ స్కోరే ప్రామాణికం. ఎంఎస్‌ వంటి కోర్సులకు టోఫెల్‌తోపాటు జీఆర్‌ఈ కూడా తప్పనిసరి. మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు జీమ్యాట్‌ రాయాలి. బ్యాచిలర్‌ డిగ్రీ కోసం శాట్‌ స్కోర్లు ప్రామాణికం. ఇటీవల కాలంలో అమెరికాలోని కొన్ని వర్సిటీలు నిబంధనలను సడలించాయి. ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్లను కూడా అనుమతిస్తున్నాయి.

బ్రిటన్‌ వర్సిటీలు ఎక్కువగా ఐఈఎల్‌టీఎస్‌.. కొన్ని సందర్భాల్లో టోఫెల్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోర్సులకైతే జీమ్యాట్‌ తప్పనిసరి. ఇతర ఐరోపా దేశాల్లో ఐఈఎల్‌టీఎస్‌ స్కోరుకే అగ్రపీఠం. ఆస్ట్రేలియాలో అవకాశం దక్కించుకోవాలంటే... ఐఈఎల్‌టీఎస్‌ రాయాలి. ఆయా పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా వర్సిటీని ఎంచుకోవచ్చు.

టోఫెల్‌: టోఫెల్‌ ఇంటర్నెట్‌ ఆధారిత పరీక్ష. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు... చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం. ఒక్కో విభాగానికి 30 మార్కులు. మంచి వర్సిటీల్లో సీటు రావాలంటే.. కనీసం 80 మార్కులు సాధించాలి. కొన్ని వర్సిటీలు 61 నుంచి 78 మధ్యలో మార్కులు సాధించినా.. అవకాశం కల్పిస్తున్నాయి. అయితే... కోర్సులో చేరాక తప్పనిసరిగా అక్కడ బోధించే ఇంగ్లిష్‌ శిక్షణకు హాజరు కావాలన్న నిబంధనను విధిస్తున్నాయి. సంవత్సరంలో ఎప్పుడైనా రాసే వీలున్న ఆన్‌లైన్‌ పరీక్ష ఇది. నెలకు ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. ఫీజు 165 డాలర్లు.

జీఆర్‌ఈ: ఎం.ఎస్‌., ఇతర సాంకేతిక కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణిక పరీక్ష... జీఆర్‌ఈ. ఇందులో వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లలో నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. ఒక్కో విభాగానికి 800 మార్కుల చొప్పున మొత్తం 1600 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో కనీసం 1000 మార్కులొస్తే.. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు ఖాయం. జీఆర్‌ఈలో ‘ఎనలిటికల్‌ రైటింగ్‌’ అనే ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇది కేవలం అభ్యర్థిలోని భాషా నైపుణ్యాన్ని పరీక్షించేది మాత్రమే.

జీమ్యాట్‌: జీమ్యాట్‌లో వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఉంటాయి. ఈ పరీక్ష 800 మార్కులకు ఉంటుంది. వీటితోపాటు అనలిటికల్‌ రైటింగ్‌ అదనం. ‘ఐవీ లీగ్‌’గా పేరు గడించిన ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం లభించాలంటే.. కనీసం 700 మార్కులు సాధించాలి. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ కూడా ఈ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది.

శాట్‌: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన పరీక్ష... శాట్‌! ఇది వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఎనలిటికల్‌ కెపాసిటీ అనే మూడు విభాగాల్లో ఉంటుంది. ఒక్కో విభాగం 800 మార్కులకు చొప్పున మొత్తం 2,400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మంచి వర్సిటీల్లో ప్రవేశానికి కనీసం 2000, ఒక మోస్తరు సంస్థల్లో అయితే 1800 తప్పనిసరి.

ఐఈఎల్‌టీఎస్‌: ఇది పేపర్‌ ఆధారిత పరీక్ష. కంప్యూటర్‌ ద్వారా రాసేందుకు కూడా వీలుంది. బ్రిటన్‌ ఇంగ్లిష్‌ ఆధారంగా రీడింగ్‌, రైటింగ్‌, లిజనింగ్‌, స్పీకింగ్‌ అనే నాలుగు విభాగాల్లో.. ఐఈఎల్‌టీఎస్‌ నిర్వహిస్తారు. ఇందులో 9 పాయింట్లకు 6 పాయింట్లు సాధించాలి. ఈ పరీక్షకు హాజరవ్వాలంటే... బ్రిటిష్‌ కౌన్సిల్‌, లేదా ఐ.డి.పి. కేంద్రాల్లో సంప్రదించాలి.
నేను ఇటీవల 60 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేశాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్నా.. విదేశీ విద్యకు సంబంధించి వివరాలు తెలపండి?
+
 కొన్నేళ్లుగా మన దేశం నుంచి విదేశీ చదువులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందరిచూపు అమెరికా, ఆస్ట్రేలియూలపైనే ఉంటుంది. దాంతో అక్కడ అడ్మిషన్‌ లభించని వారు నిరాశ చెందుతున్నారు. అయితే, సింగపూర్‌, జర్మనీ, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలు కూడా అమెరికా, ఆస్ట్రేలియాలకు ఏమాత్రం తీసిపోనిరీతిలో ఆ దేశాల్లోని విద్యా ప్రమాణాలకనుగుణంగా కోర్సులను అందిస్తున్నాయి.
నేను డిగ్రీ చదువుతున్నాను. అమెరికాలో ఫిల్మ్‌ డెరైక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం ఏంటి?
+
అమెరికాలో దాదాపు 22 యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు సినీ రంగానికి చెందిన పలు కోర్సులను (డెరైక్షన్‌, ఎడిటింగ్‌, ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌ తదితర) డిప్లొమా, డిగ్రీ స్థాయిల్లో అందిస్తున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో అధిక శాతం న్యూయార్క్‌, లాస్‌ఏంజెలిస్‌లలోనే ఉన్నాయి. వీటిలో ప్రవేశించే ముందు సంబంధిత కళాశాలకు యూనివర్సిటీల గుర్తింపు ఉందా? సర్టిఫికెట్లు మంజూరు చేస్తారా? ఫ్యాకల్టీకి సినీ రంగంలో అనుభవం ఏదైనా ఉందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవడం సులువవుతుంది. సాధారణంగా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాచిలర్‌ డిగ్రీ కనీస అర్హతగా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఫిల్మ్‌ కోర్సుల్ని పూర్తి చేసుకున్న వారికి సాధారణంగా మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ టైటిల్‌తో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇక.. ఫిల్మ్‌ స్కూల్స్‌ కూడా మూడు విభాగాలుగా ఉంటాయి. అవి..
ఇండస్ట్రీ ఫిల్మ్‌ స్కూల్స్‌: ఇవి విద్యార్థులకు హాలీవుడ్‌లో కెరీర్‌ అన్వేషణకు ఉపయోగపడే రీతిలో బోధిస్తాయి.
ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ స్కూల్స్‌: హాలీవుడ్‌ కాకుండా ఇతర ప్రాంతాల్లో సినిమా అవకాశాలను మెరుగుపరిచే విధంగా బోధన ఉంటుంది.
ఎక్స్‌పరిమెంటల్‌ స్కూల్స్‌: ఇవి సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రాధాన్యమిస్తూ.. బోధన సాగిస్తాయి. కళాత్మక దృష్టి ఉన్న వారికి ఈ ఎక్స్‌పరిమెంటల్‌ స్కూల్స్‌ చక్కని వేదికలు.
ఆయా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థుల్లోని రైటింగ్‌ స్కిల్స్‌ను ప్రధాన ప్రామాణికంగా పరిగణిస్తాయి. అంతేకాక.. ఈ రంగం పట్ల విద్యార్థులకున్న ఆసక్తిని బేరీజు వేసేందుకు వారు నిర్మించిన లఘుచిత్రాలు ఉంటే ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశించాక ఆసక్తిని బట్టి స్పెషలైజేషన్లు ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ప్రస్తుతం అమెరికాలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, పెన్సెల్వే నియా స్టేట్‌ యూనివర్సిటీ (పార్క్‌ క్యాంపస్‌), బోస్టన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లాస్‌ ఏంజెలిస్‌, రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు ప్రముఖమైనవి.
వెబ్‌సైట్‌:  www.educationusa.state.gov
న్యూజిల్యాండ్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సులు చదవాలంటే?
+
న్యూజిల్యాండ్‌లో ప్రత్యేకంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య చాలా స్వల్పం. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల విధానాలను అనుసరించి పీజీ కోర్సుల వ్యవధి ఏడాది నుంచి రెండేళ్లపాటు ఉంటుంది. సాధారణంగా అకడెమిక్‌ సెషన్‌ ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతుంది. కొద్ది సంఖ్యలో ఇన్‌స్టిట్యూట్‌లు సమ్మర్మ్‌ స్కూల్స్‌ పేరిట జూలైలో అడ్మిషన్స్‌ నిర్వహిస్తాయి. కోర్సులో ప్రవేశానికి టోఫెల్‌లో 550 స్కోరు ఉంటే సానుకూల ఫలితాన్ని ఆశించవచ్చు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఫీజు దాదాపు 40 వేల డాలర్ల వరకు ఉంటుంది. ఇక్కడ చదివిన కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల బోధనలో.. ఆక్లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సదరన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు ప్రముఖమైనవి.
వెబ్‌సైట్‌: www.studyingnewzealand.com
బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాను. ఇప్పటివరకు అకడెమిక్‌ రికార్డు 70 శాతంపైగానే ఉంది. పీజీ స్థాయిలో విదేశాల్లో చదవాలనుకుంటున్నాను. వివరాలు తెలియజేయండి?
+
ఆస్ట్రేలియాలో డీకిన్‌ యూనివర్సిటీ, లాట్రోబ్‌ యూనివర్సిటీలలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ అందుబాటులో ఉంది. వీటిలో ప్రవేశించడానికి ఐఈఎల్‌టీఎస్‌లో 6-6.5 బ్యాండ్లు సాధించాలి. అమెరికాలో.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఎంఐటీ, జాన్‌ హాప్‌కిన్స్‌, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లలో పీజీ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సులు బోధిస్తున్నారు. అమెరికాలో చదవాలంటే 16 ఏళ్ల అకడెమిక్‌ రికార్డు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం మీకు అమెరికా అవకాశం లేనట్లే. కెనడాలో వాటర్‌లూ, మెక్‌గిల్‌ వంటి యూనివర్సిటీల్లోనూ మీరు ప్రయత్నించవచ్చు.
ప్రస్తుతం బీఫార్మసీ చదువుతున్నాను. అమెరికా లేదా యూకేలో ఎంఫార్మసీ చేయాలంటే ఎలా?
+

విదేశాల్లో ఎంఫార్మసీ కాసింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమెరికాలో రెండేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సులో ప్రవేశించాలంటే ఫార్మసీ కాలేజ్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లో నిర్దేశిత స్కోరు సొంతం చేసుకోవాలి. దాదాపు 35 వేల నుంచి 55 వేల అమెరికన్‌ డాలర్ల మేర ఫీజు ఉంటుంది. అక్కడ ఫార్మసీకి సంబంధించి.. లాంగ్‌ ఐల్యాండ్‌ యూనివర్సిటీ, మాసాచుసెట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ హెల్త్‌ సెన్సైస్‌, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ, ఓహియో స్టేట్‌ యూనివర్సిటీలు పేరుగడించాయి. యూకేలో కొన్ని యూనివర్సిటీలు ఏడాది వ్యవధిలోనే ఎంఫార్మసీని బోధిస్తున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్‌ స్ట్రాచ్‌కై ్లడ్‌, రాబర్ట్‌ గోర్డాన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌(స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ)లు నాణ్యమైన బోధనకు గుర్తింపుగా ఉన్నాయి.

జీఆర్‌ఈకి రెండుసార్లు హాజరయ్యాను. యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు రెండు స్కోర్లను తెలియజేయాలా?
+
ఏ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునేటప్పుడైనా ఎక్కువ స్కోరు సాధించిన జీఆర్‌ఈ వివరాలు తెలియజేయడమే మంచిది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం.. అభ్యర్థి ఎన్నిసార్లు జీఆర్‌ఈకి హాజరయ్యాడు? స్కోర్లు సాధించిన క్రమం తెలుసుకుంటాయి. అలాంటప్పుడు పూర్తి వివరాలు తెలియజేయాలి. అన్ని స్కోర్ల సగటుని గణించే ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉన్నాయి. అంతమాత్రాన తక్కువ స్కోర్లు పంపడానికి ఆందోళన చెందక్కర్లేదు. ఇన్‌స్టిట్యూట్‌లు సాధారణంగా ఎక్కువ స్కోర్లనే పరిగణనలోకి తీసుకుంటాయి.
అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర సర్వీస్‌ రంగానికి సంబంధించిన కోర్సుల్లో అడ్మిషన్‌ పొందడానికి మార్గం ఏమిటి?
+
అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (శాట్‌) రాసి మంచి స్కోరు సాధించడం ఉపకరిస్తుంది. కొన్ని యూనివర్సిటీలు శాట్‌ లేకున్నా ప్రవేశం కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం www.usnews.com చూడండి.
ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌గా బీఎస్సీ చదువుతున్నాను. మాస్టర్స్‌ స్థాయిలో విదేశాల్లో చదవాలనుకుంటున్నాను. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌లో పీజీ చేయడానికి అనుకూలమైన దేశాల గురించి తెలియజేయగలరు. విదేశీ డిగ్రీతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకునే వీలుందా?
+
గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యావరణ కాలుష్యం తదితర కారణాలతో... వాటిని నియంత్రించడానికి నిపుణుల అవసరం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతోంది. కాబట్టి ముందుగా ఈ కోర్సు భవిష్యత్తు గురించి ఆందోళన చెందక్కర్లేదు. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెన్సీలు, రీసైక్లింగ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ విభాగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.. మాస్టర్స్‌ స్థాయిలో ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌గా అన్ని దేశాల్లో కోర్సుల బోధన సాగుతోంది. అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశించాలంటే మాత్రం పూర్వ అకడెమిక్‌ రికార్డు 16 ఏళ్లు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం మీకు అమెరికా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. యూకే, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్‌ తదితర దేశాల్లో 15 ఏళ్ల అకడెమిక్‌ ట్రాక్‌తోనే పీజీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
బీఏ సైకాలజీ చదువుతున్నాను. యూకేలో.. పీజీలో క్లినికల్‌ సైకాలజీలో ప్రవేశించడానికి మార్గం ఏమిటి?
+
యూకేలో పీజీ స్థాయిలో క్లినికల్‌ సైకాలజీలో అడుగుపెట్టాలంటే.. అదే విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తయ్యాక గుర్తింపుపొందిన క్లినికల్‌ సైకాలజిస్ట్‌ దగ్గర పనిచేసిన అనుభవం ఉండాలి. ఆ ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికెట్‌ ఆధారంగానే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు అప్రంటిషిప్‌ పూర్తి చేసుకుంటే మార్గం సులభం అవుతుంది.
ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? పార్ట్‌ టైం ఉద్యోగం చేసుకునే వీలుందా?
+
సాధారణంగా ఆస్ట్రేలియాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ కోర్సు ఫీజు
 సగటున పది లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ట్యూషన్‌ ఫీజుకు అదనంగా లైబ్రరీ ఫీజు, ఎక్విప్‌మెంట్‌ ఫీజులను కూడా అడుగుతున్నాయి. ఇక.. నివాస ఖర్చుల కోసం ఏడాదికి 12 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు అవసరమవుతాయి. వారానికి 20 గంటలు పార్ట్‌టైం పనిచేసుకునేందుకు విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తోంది.
డిగ్రీ చదువుతున్నాను. అమెరికాలో టెక్స్‌టైల్‌ విభాగంలో పీజీ చేయడానికి మార్గం ఏమిటి?
+
అమెరికాలో పలు యూనివర్సిటీలు టెక్స్‌టైల్‌ రంగానికి చెందిన పలు అంశాలు (డిజైన్‌, ప్రాసెస్‌, టెక్నాలజీస్‌ ఇన్‌ ప్రాసెసింగ్‌, మ్యానుఫాక్చరింగ్‌) స్పెషలైజేషన్లుగా పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో.. కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ ఫ్యాబ్రిక్‌ డిజైన్‌, ఫిలడెల్ఫియా యూనివర్సిటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌), కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీలు పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిలో అడుగుపెట్టడానికి 16 ఏళ్ల అకడెమిక్‌ రికార్డుతోపాటు జీఆర్‌ఈ, టోఫెల్‌ స్కోర్లు కావాలి.
బీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్నాను. విదేశాల్లో ఎల్‌ఎల్‌ఎం చేయడానికి అవకాశం ఉందా?
+
లాలో బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత ఎక్కడైనా ఎల్‌ఎల్‌ఎం చేసే అవకాశం ఉంది.  మన న్యాయ విధానాలను బట్టి యూకే పాపులర్‌ కంట్రీగా నిలుస్తోంది. ఇక.. అకడెమిక్‌గా పదో తరగతి నుంచి కచ్చితంగా ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఉంటేనే ఎల్‌ఎల్‌ఎంకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. అమెరికాలో చదవాలంటే.. మాత్రం ఎల్‌.ఎస్‌.ఎ.టి. (ఎల్‌-శాట్‌)రాయాలి. అకెడమిక్‌ సెషన్‌కు ఏడాది ముందుగానే దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ముందుగానే సిద్ధం కావాలి.
బీటెక్‌(ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) చదువుతున్నాను. విదేశాల్లో ఎంబీఏ చేయాలంటే?
+
విదేశాల్లో ఎంబీఏ చదవాలంటే బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసుకున్నాక  రెండు నుంచి మూడేళ్ల పని అనుభవం ఉండాల్సిందే. దాంతోపాటు ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌లో ప్రవేశం పొందాలంటే.. జీమ్యాట్‌ స్కోరు 740 నుంచి 800 మధ్యలో సాధించాలి.
అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఐచ్ఛికాంశాలుగా బీకాం చదువుతున్నాను. ఇదే విభాగంలో లండన్‌, లేదా కెనడాలో పీజీ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
+
కెనడాలో పీజీ చదవడానికి 16 ఏళ్ల అకడెమిక్‌ ట్రాక్‌ తప్పనిసరి. కాబట్టి
మీరు ముందుగా ఆ మేరకు మన దేశంలోనే ఎంకాం చదవడం శ్రేయస్కరం.   ప్రస్తుత మీ విద్యార్హతలతో యూకేలో దరఖాస్తు చేసుకునే వీలుంది. ప్రస్తుతం ఈ కోర్సు బోధనలో మాంచెస్టర్‌, లాంకెస్టర్‌, నాటింగ్‌హామ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు పేరు గడించాయి. అకడెమిక్‌ సెషన్‌కు కనీసం ఏడాది ముందు దరఖాస్తు చేసుకుంటేనే సానుకూల ఫలితం ఆశించవచ్చు. దరఖాస్తుతోపాటు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు సర్టిఫికెట్లు, స్టేట్‌ మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, రెండు రికమండేషన్‌ లెటర్లు జత చేయాలి. అక్కడ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కాల వ్యవధి ఏడాది నుంచి ఏడాదిన్నర ఉంటుంది. ట్యూషన్‌ ఫీజు సగటున్న 15వేల పౌండ్లు. నివాస ఖర్చులకు ఏడాదికి పది వేల పౌండ్లు సిద్ధం చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.educationukin.org చూడండి.
ఆస్ట్రేలియాలో పైలట్‌ ట్రైనింగ్‌ చేయడానికి గల అవకాశాలేంటి?
+
ఆస్ట్రేలియాలో భారీ సంఖ్యలో పైలట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లున్నాయి. సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకున్న వారు వీటిలో ప్రవేశించవచ్చు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల ప్రమాణాలను బట్టి అకడెమిక్‌ సెషన్‌ వేర్వేరుగా ఉంటుంది.