Skip to main content

శాట్ పరీక్ష గురించి వివరించండి?

అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో ప్రవేశాలకు ప్రామాణిక పరీక్ష..
Question
శాట్ పరీక్ష గురించి వివరించండి?
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎస్‌ఏటీ-శాట్). ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి. మొత్తం మూడు గంటల 45 నిమిషాల వ్యవధిలో పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ పరీక్షను ఒకటి లేదా రెండు సార్లు రాయవచ్చు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించడం ద్వారా ఎంచుకున్న కాలేజీలో సీటు వచ్చే అవకాశం లేదు. కాలేజీ నిర్ధారించిన అంచనాలకు అనుగుణంగా అకడమిక్ అర్హతలు ఉన్నాయో లేదో గమనించాలి.

శాట్‌లో సబ్జెక్ట్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిని రాయడం ద్వారా అభ్యర్థిలోని విషయావగాహన అర్థం అవుతుంది. లిటరేచర్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, చైనీస్, జపనీస్, కొరియన్ లాంటి సబ్జెక్టులపై టెస్టులు రాయవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఈ టెస్ట్ రాయడం ద్వారా సరైన కాలేజీని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. కాలేజీల్లో ప్రవేశాలకు కూడా మార్గం సుగమం అవుతుంది. సబ్జెక్టు సిలబస్, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.sat.collegeboard.org

Photo Stories