ఉస్మానియూ యూనివర్సిటీ మహిళా కళాశాలలో బీఎస్సీ (బయోటెక్నాలజీ) చేస్తున్నాను. డిగ్రీ తర్వాత విదేశాల్లో ఏ కోర్సులు చేసే అవకాశం ఉంది?అసలు...
Question
ఉస్మానియూ యూనివర్సిటీ మహిళా కళాశాలలో బీఎస్సీ (బయోటెక్నాలజీ) చేస్తున్నాను. డిగ్రీ తర్వాత విదేశాల్లో ఏ కోర్సులు చేసే అవకాశం ఉంది?అసలు విదేశాలకు వెళ్లాలంటే.. ఏ పరీక్షలు రాయూలి?
మీరు అమెరికాలో చదవాలని భావిస్తే జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షలు రాయూలి. మీకు ఇంకా గ్రాడ్యుయేట్ స్థారుులో నాలుగు సంవత్సరాల విద్య పూర్తి కాలేదు కాబట్టి ట్రాన్స్‌ఫర్ స్టూడెంట్‌గా అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగంలో మీకు కనీసం 6 నెలల చక్కటి పరిశోధనానుభవం ఉంటే యూఎస్ యూనివర్సిటీలు నేరుగా ఎంఎస్ కోర్సులో చేర్చుకుంటారుు. ఇక ఆస్ట్రేలియూ, యూకే, ఐర్లాండ్ దేశాల్లో చదవదలుచుకుంటే టోఫెల్, ఐబిట్ లేక ఐఈఎల్‌టిఎస్ పరీక్షలు రాయూలి. వీటిలో స్కోరు ఆధారంగా నేరుగా అక్కడ మాస్టర్ ప్రోగ్రాంలోకి ప్రవేశించవచ్చు.