Skip to main content

Exams

టోఫెల్ పరీక్ష గురించి వివరించండి?
+
  • ఇంగ్లిష్‌లో మాట్లాడే దేశాలన్నీ.. విద్యార్థి ఇంగ్లిష్ భాషా నైపుణ్యాల గురించి తెలుసుకునేందుకు టోఫెల్ స్కోరును ప్రామాణికంగా భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా,కెనడా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల యూనివర్సిటీల్లో సీటు సంపాదించుకున్న యువత ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం గురించి ఈ స్కోరు తెలియజేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు అర్హత పరీక్షగా టోఫెల్‌ను భావిస్తున్నారు.
  • ఈ పరీక్ష ఇంటర్నెట్ ఆధారితంగా ఉంటుంది. దేశంలో ఏటా 30-40 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన తేదీల్లో పరీక్ష రాసుకునే సౌలభ్యం ఉంటుంది.
  • ఇందులో ఇంగ్లిష్‌కు సంబంధించి అభ్యర్థి రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. నాలుగున్నర గంటల సమయంలో పరీక్ష పూర్తిచేయాలి. ఈ పరీక్షను ఎన్నిసార్లైనా రాసుకునే సౌలభ్యం ఉంది.

పరీక్ష విధానం:

  • రీడింగ్ సెక్షన్: ఇందులో 3 లేదా 4 ప్యాసేజీలు ఉంటా యి. దీనికి సంబంధించి ఒక్కో ప్యాసేజీకి 12 నుంచి 14 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు వీటికి 60 నుంచి 80 నిమిషాల్లో సమాధానాలు రాయాలి.
  • లిజనింగ్ సెక్షన్: ఈ సెక్షన్‌లో అభ్యర్థులకు కొన్ని లెక్చర్స్‌ను వినిపిస్తారు. అభ్యర్థులు లెక్చర్‌కు సంబంధించి నోట్స్ రాసుకోవాలి. లెక్చర్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటిని 60 నుంచి 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
  • స్పీకింగ్ సెక్షన్: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఇండిపెండెంట్ స్పీకింగ్ టాస్క్స్ సెక్షన్‌లో అభ్యర్థులను అడిగే ప్రశ్నలకు, వారి ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా సమాధానాలు ఇవ్వాలి. ఇక ఇంటిగ్రేటెడ్ స్పీకింగ్ టాస్క్స్ సెక్షన్‌లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను ఉపయోగిస్తూ సమాధానాలు తెలపాలి.
  • రైటింగ్ సెక్షన్: ఒక టాపిక్ ఇచ్చి, దానికి సంబంధించిన అంశంపై రాయమని అడుగుతారు. అభ్యర్థి రాసిన సమాధానాల ఆధారంగా 0-5 స్కేల్‌తో అసెస్ చేస్తారు.

వెబ్‌సైట్: www.ets.org

శాట్ పరీక్ష గురించి వివరించండి?
+
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎస్‌ఏటీ-శాట్). ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి. మొత్తం మూడు గంటల 45 నిమిషాల వ్యవధిలో పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ పరీక్షను ఒకటి లేదా రెండు సార్లు రాయవచ్చు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించడం ద్వారా ఎంచుకున్న కాలేజీలో సీటు వచ్చే అవకాశం లేదు. కాలేజీ నిర్ధారించిన అంచనాలకు అనుగుణంగా అకడమిక్ అర్హతలు ఉన్నాయో లేదో గమనించాలి.

శాట్‌లో సబ్జెక్ట్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిని రాయడం ద్వారా అభ్యర్థిలోని విషయావగాహన అర్థం అవుతుంది. లిటరేచర్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, చైనీస్, జపనీస్, కొరియన్ లాంటి సబ్జెక్టులపై టెస్టులు రాయవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఈ టెస్ట్ రాయడం ద్వారా సరైన కాలేజీని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. కాలేజీల్లో ప్రవేశాలకు కూడా మార్గం సుగమం అవుతుంది. సబ్జెక్టు సిలబస్, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.sat.collegeboard.org
నేను పాలిటెక్నిక్‌ డి ప్లొమా చేశాను. యుకె లేదా యుఎస్‌లో బీటెక్‌ చేయూలనుకుంటున్నాను. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏఏ పరీక్షలు రాయూలి?
+
యుఎస్‌లో బ్యాచిలర్‌ డి గ్రీ చేయడానికి పాలిటెక్నిక్‌ చేసిన వారు అర్హులు కాదు. మీరు యుకె, ఆస్ట్రేలియూల్లో బ్యాచిలర్‌ డిగ్రీ చేయడానికి ప్రయత్నించండి.
ఉస్మానియూ యూనివర్సిటీ మహిళా కళాశాలలో బీఎస్సీ (బయోటెక్నాలజీ) చేస్తున్నాను. డిగ్రీ తర్వాత విదేశాల్లో ఏ కోర్సులు చేసే అవకాశం ఉంది?అసలు విదేశాలకు వెళ్లాలంటే.. ఏ పరీక్షలు రాయూలి?
+
మీరు అమెరికాలో చదవాలని భావిస్తే జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలి. మీకు ఇంకా గ్రాడ్యుయేట్‌ స్థారుులో నాలుగు సంవత్సరాల విద్య పూర్తి కాలేదు కాబట్టి ట్రాన్స్‌ఫర్‌ స్టూడెంట్‌గా అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగంలో మీకు కనీసం 6 నెలల చక్కటి పరిశోధనానుభవం ఉంటే యూఎస్‌ యూనివర్సిటీలు నేరుగా ఎంఎస్‌ కోర్సులో చేర్చుకుంటారుు. ఇక ఆస్ట్రేలియూ, యూకే, ఐర్లాండ్‌ దేశాల్లో చదవదలుచుకుంటే టోఫెల్‌, ఐబిట్‌ లేక ఐఈఎల్‌టిఎస్‌ పరీక్షలు రాయూలి. వీటిలో స్కోరు ఆధారంగా నేరుగా అక్కడ మాస్టర్‌ ప్రోగ్రాంలోకి ప్రవేశించవచ్చు.
నేను బీటెక్‌ చదువుతున్నాను. జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలనుకుంటున్నాను. వీటి పరీక్షా విధానం తెలపండి?
+
జీఆర్‌ఈ అనేది విద్యార్థి తార్కిక జ్ఞానం, విశ్లేషణా సామర్ధ్యాలను అంచనా వేసే పరీక్ష. ఇందులో ప్రధానంగా వెర్బల్‌ ఇంగ్లిష్‌, క్వాంట్స్‌, ఎనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌ (ఏడబ్ల్యూఏ) అంశాలు ఉంటారుు. టోఫెల్‌లో వినటం, చదవటం, మాట్లాడటం, రాయటం వంటి ప్రాథమిక భాషా కౌశలాలను ఇంటర్నెట్‌ ఆధారంగా పరీక్షిస్తారు. ఇంకా ఈ పరీక్షలపై పూర్తి వివరాల కోసం ఈ కింది వెబ్‌సైట్‌లను సంప్రదించండి. www.ets.org/gre, www.ets.org/toefl 
నేను ప్రస్తుతం బీటెక్‌ చదువుతున్నా. జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలనుకుంటున్నాను. యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియూ, జర్మనీల్లో విద్యనభ్యసించాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది?
+
అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు జనవరి, సెప్టెంబర్‌; యూకేలో జనవరి, సెప్టెంబర్‌; ఆస్ట్రేలియూలో ఫిబ్రవరి, జూలై; జర్మనీలో మార్చి, అక్టోబర్‌ల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. సాధారణంగా అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీలన్నీ ఫాల్‌ (సెప్టెంబర్‌) సెమిస్టర్‌కు 10-12 నెలల ముందు, స్ప్రింగ్‌కు 5-6 నెలల ముందు దరఖాస్తులు స్వీకరిస్తారుు. యూకే, ఆస్ట్రేలియూల్లో 5-6 నెలల ముందు, జర్మనీలో 10-12 నెలల ముందుగా అప్లికేషన్లు స్వీకరిస్తారుు. అడ్మిషన్ల విషయంలో యూఎస్‌ యూనివర్సిటీలు 2-3 నెలల్లో తమ నిర్ణయూన్ని తెలియజేస్తే... యూకే, ఆస్ట్రేలియూ వర్సిటీలు మరింత వేగంగా స్పందిస్తారుు.
నేను ఇటీవల 60 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేశాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్నా.. విదేశీ విద్యకు సంబంధించి వివరాలు తెలపండి?
+
 కొన్నేళ్లుగా మన దేశం నుంచి విదేశీ చదువులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందరిచూపు అమెరికా, ఆస్ట్రేలియూలపైనే ఉంటుంది. దాంతో అక్కడ అడ్మిషన్‌ లభించని వారు నిరాశ చెందుతున్నారు. అయితే, సింగపూర్‌, జర్మనీ, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలు కూడా అమెరికా, ఆస్ట్రేలియాలకు ఏమాత్రం తీసిపోనిరీతిలో ఆ దేశాల్లోని విద్యా ప్రమాణాలకనుగుణంగా కోర్సులను అందిస్తున్నాయి.
జీఆర్‌ఈకి రెండుసార్లు హాజరయ్యాను. యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు రెండు స్కోర్లను తెలియజేయాలా?
+
ఏ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునేటప్పుడైనా ఎక్కువ స్కోరు సాధించిన జీఆర్‌ఈ వివరాలు తెలియజేయడమే మంచిది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం.. అభ్యర్థి ఎన్నిసార్లు జీఆర్‌ఈకి హాజరయ్యాడు? స్కోర్లు సాధించిన క్రమం తెలుసుకుంటాయి. అలాంటప్పుడు పూర్తి వివరాలు తెలియజేయాలి. అన్ని స్కోర్ల సగటుని గణించే ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉన్నాయి. అంతమాత్రాన తక్కువ స్కోర్లు పంపడానికి ఆందోళన చెందక్కర్లేదు. ఇన్‌స్టిట్యూట్‌లు సాధారణంగా ఎక్కువ స్కోర్లనే పరిగణనలోకి తీసుకుంటాయి.