USA
జీఆర్‌ఈ పరీక్ష గురించి వివరించండి?
+
- గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్(జీఆర్‌ఈ).. ఈ పరీక్షను అమెరికాలోని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ అనే సంస్థ నిర్వహిస్తోంది. అమెరికాలోని విద్యాసంస్థలు అభ్యర్థి సామర్థ్యాన్ని జీఆర్‌ఈ స్కోర్ ద్వారా అంచనా వేస్తాయి. అర్హులైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తాయి. ఈ పరీక్ష స్కోర్ ఐదేళ్ల వరకు చెల్లుతుంది.
- ఈ పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి.
- జీఆర్‌ఈ రివైజ్డ్ జనరల్ టెస్ట్: వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. విద్యార్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. అన్ని అంశాల్లోనూ మంచి స్కోర్ సాధించాలి. 340కు వెర్బల్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లలో 130 నుంచి 150 స్కోర్ సాధించాలి. అనలిటికల్ రైటింగ్‌లో 6కు కనీసం 3 స్కోర్ పొందాలి.
- సబ్జెక్టు టెస్ట్: ఇందులో బయోకెమిస్ట్రీ, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ లిటరేచర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ వంటి 8 సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. విద్యార్థి స్పెషలైజేషన్ ఆధారంగా ఇందులో సబ్జెక్టును ఎంచుకోవచ్చు.
వెబ్‌సైట్: www.ets.org/gre
నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. నాకు యుఎస్‌లో ఎంఎస్ చేయూలని ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం వల్ల అక్కడ కొత్త వారికి ఉద్యోగాలు రావడంలేదని, ఎంఎస్ చేసిన తరువాత ఉద్యోగం కోసం మరలా ఇండియూకు తిరిగిరావాల్సి ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య అమెరికాలో ఎంఎస్ చేయడం మంచిదేనా?
+
చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారుు. ఆర్థిక మాంద్యంలో ఉన్నా, ఉద్యోగ మార్కెట్‌పై ఆర్థిక మాంద్య ప్రభావం పెద్దగా లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే అమెరికానే బెస్ట్!!
నేను ఎంఎస్సీ పూర్తి చేసి నెట్‌కు ప్రిపేరవుతున్నాను. అమెరికాలో పీహెచ్‌డీ చేయూలనుకొంటున్నాను. యుఎస్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏం చేయూలో సలహా ఇవ్వండి?
+
ఇండియూలో ఎంఎస్సీ చదివి నేరుగా అమెరికా యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందడం చాలా కష్టం. ఇంతకుముందు మీరేమైనా పేపర్లను పబ్లిష్ చేసినా, లేదా రీసెర్చ్ అనుభవం ఏదైనా ఉంటే అడ్మిషన్ పొందడం సులువు. అక్కడ ఎంఎస్ చేసిన తరువాత పీహెచ్‌డీ చేయడానికి అనువుగా ఉండే ఏదైనా కోర్సు చేయడం మంచిది.
నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాను. యుఎస్‌లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. అమెరికాలో ఇంజనీరింగ్ చేయడానికి ఒక యూనివర్సిటీని ఎంచుకున్నాను. నేను అక్కడ చదువు కోవాలంటే ఏఏ పరీక్షలు రాయూలి?
+
ఏ యూనివర్సిటీలో చదవాలో నిర్ణరుుంచుకోవడం చాలా మంచిది. ఆ యూనివర్సిటీ అడ్మిషన్లను ఎలా జరుపుతుందో తెలుసుకోండి. అమెరికాలోని అన్ని మంచి యూనివర్సిటీలు TOEFL, SAT స్కోర్లను తప్పనిసరిగా అడుగుతారుు. మీరు TOEFL, SAT కోసం ప్రిపేరవండి. ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కోసం నవంబర్,లేదా డిసెంబర్ లోపు ఈ పరీక్షలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను. అమెరికా వెళ్లేందుకు హెచ్1 వీసా వచ్చింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గారుు. అమెరికా వెళ్లడం సబబేనా?
+
మీ విద్యార్హతలన్నీ సరిగా ఉంటే సంకోచం అవసరంలేదు. అమెరికాలోని కొన్నిరంగాల్లో మాత్రమే ఈ స్తబ్దత నెలకొంది. ఐటీలో మీరు ఆందోళన చెందుతున్నంత సంక్షోభంలేదు.