Skip to main content

Medical

నేను నవోదయ మెడికల్‌ కాలేజీ, బెంగుళూరులో మెడిసిన్‌ చేశాను. ప్రస్తుతం హౌస్‌ సర్జన్‌గా పని చేస్తున్నాను. విదేశాల్లో ఇంకా ఉన్నత చదువులు చదవాలని అనుకొంటున్నాను. అందుకోసం యునెటైడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లెసైన్సింగ్‌ ఎగ్జామినేషన్‌ (USMLE) కి ప్రిపేర్‌ అవ్వాలనుకొంటున్నాను. కానీ ఇంతలో నాకు పెళ్లికుదిరింది. నాకు కాబోయే భర్తకు యుఎస్‌లో గ్రీన్‌కార్డు ఉంది. త్వరలో నేను అమెరికాకు వెళ్లాలి. నేను అక్కడకు వెళ్లిన తర్వాత USMLE లేదా మరే ఇతర పరీక్షలు రాసే వీలుందా?
+
మీకు కాబోయే భర్తకు గ్రీన్‌కార్డు ఉందన్నారు కాబట్టి మీకు కూడా గ్రీన్‌కార్డు త్వరగానే వస్తుంది. ఈ మధ్యకాలంలో అమెరికాలోనే USMLE పరీక్ష రాయవచ్చు. మీకు గ్రీన్‌కార్డు వచ్చేలోపే ఈ పరీక్ష  పూర్తి చేయగలిగితే మరలా ఇండియాకు వచ్చి, ఇక్కడ నుంచి f1 తీసుకోవాలి. ఒక వేళ మీ పరీక్షలు పూర్తికాకముందే గ్రీన్‌కార్డు వస్తే,  మీకు నచ్చిన ఫీల్డ్‌లో ఎంఎస్‌ చేయడానికి నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.
విదేశాల్లో వైద్య విద్య గురించి తెలియజేయండి?
+
ఎంసెట్‌లో ర్యాంకు పొందలేని విద్యార్థులకు విదేశీ వైద్య విద్య చక్కని
 పరిష్కారం. ముఖ్యంగా రష్యా, చైనా, ఉక్రెయిన్‌, బెలారస్‌, కిర్గిజ్‌ వంటి దేశాల పట్ల మన యువత ఆసక్తి చూపుతున్నారు. అక్కడి అత్యాధునిక సదుపాయాలతోపాటు,  ఫీజులు తక్కువగా ఉంటాయి.
రష్యా: ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో ఇక్కడి వర్సిటీలు వైద్య విద్య అందిస్తున్నాయి. ఇక్కడ విద్యనభ్యసించడానికి ఇంటర్‌లో 60 శాతం (ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులు అవసరం. ఏటా సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి జూన్‌లోపు దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు పూర్తిచేసుకున్న వారికి ఎండీ (ఫిజీషియన్‌) సర్టిఫికెట్‌ ఇస్తారు. ఫీజులు చాలా తక్కువ.
చైనా: ఇక్కడ రూ.10-15 లక్షలతో కోర్సు పూర్తి చేసే అవకాశముంది. ఇంటర్‌లో ప్రథమ శ్రేణి తప్పనిసరి. కొన్ని వర్సిటీలు 70-80 శాతం మార్కులు కోరుతున్నాయి. జూన్‌ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఉక్రెయిన్‌, బెలారస్‌, ఫిలిప్పీన్స్‌, కిర్గిజ్‌ వంటి దేశాల్లో ఆరేళ్ల కోర్సును రూ.10 - 15 లక్షల్లో పూర్తి చేసుకోవ చ్చు.