Skip to main content

అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?

- నితీశ్, శ్రీకాకుళం.
Question
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
 • హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్‌లో బీఎస్సీ అందిస్తోంది.
  అర్హత:
  బయాలజీ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్/10+2
  ప్రవేశం: ఎంసెట్ పరీక్ష ఉత్తీర్ణత ఆధారంగా. ఈ పరీక్ష ద్వారా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో కూడా ప్రవేశం పొందవచ్చు.
  వెబ్‌సైట్:  www.angrau.ac.in
 • హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్‌లో బీఎస్సీ అందిస్తోంది.
  అర్హత:
  బయాలజీ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్/10+2
  ప్రవేశం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ పరీక్షలో ర్యాంకు ఆధారంగా. ఇందులో ర్యాంకు ద్వారా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న 3 కళాశాలల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు.
  వెబ్‌సైట్:  www.pjtsau.ac.in
 • తమిళనాడులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ అందిస్తోంది.
  అర్హత: ఇంటర్మీడియెట్/10+2.
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 • ఇదే విశ్వవిద్యాలయం.. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు కూడా అందిస్తోంది.
  వెబ్‌సైట్:
    www.tnau.ac.in

Photo Stories