Skip to main content

ఎంఫార్మసీ కోర్సును అందించే సంస్థల వివరాలు తెలపండి?

- రవి, మెదక్.
Question
ఎంఫార్మసీ కోర్సును అందించే సంస్థల వివరాలు తెలపండి?
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ (నైపర్).. ఫార్మాస్యూటికల్ సెన్సైస్‌కు సంబంధించిన మొదటి జాతీయ స్థాయి సంస్థ. దీన్ని మొదటగా పంజాబ్‌లోని మొహాలీలో నెలకొల్పారు. ఇది పరిశోధనలకు సంబంధించి దేశీయ, విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లకు తోడ్పాటు అందిస్తుంది. కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కింద నైపర్ పనిచేస్తుంది. ఫార్మసీకి సంబంధించి పరిశోధన, విద్య, శిక్షణను ఈ సంస్థ చేపడుతుంది. నైపర్.. మాస్టర్స్, డాక్టరేట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ప్రస్తుతం వివిధ మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌ల సహాయంతో అనేక ప్రదేశాల్లో పనిచేస్తోంది.
  • హైదరాబాద్‌లోని నైపర్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తోంది.
    వెబ్‌సైట్:
      www.niperhyd.ac.in
  • కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ.
    వెబ్‌సైట్:
      www.iicb.res.in
    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ.
    ప్రవేశం: నైపర్‌జేఈఈ/జీప్యాట్/ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • నైపర్‌జేఈఈ సిలబస్.. జీప్యాట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది.
  • నైపర్‌జేఈఈ: మెడిసినల్ కెమిస్ట్రీతో పోల్చితే.. బేసిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 120 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఇందులో నెగెటివ్ మార్కులు ఉంటాయి.
  • ఇదే సంస్థ ఫార్మాలో ఎంబీఏ అందిస్తోంది.
    అర్హత:
    కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ/కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్. లేదా లైఫ్ సైన్స్/కెమికల్ సైన్స్‌లలో ఎంఎస్సీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.niper.ac.in
  • విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మా బయోటెక్నాలజీ, ఫార్మ్ అనాలిసిస్, క్వాలిటీ అస్యూరెన్స్ వంటి స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీ అందిస్తోంది.
    అర్హత: బీఫార్మసీ.
    ప్రవేశం: జీప్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in/pharmacy/
  • హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎంఫార్మసీ కోర్సు అందుబాటులో ఉంది.
    అర్హత:
    బీఫార్మసీ.
    ప్రవేశం: బిట్‌శాట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.bits-pilani.ac.in/hyderabad/
  • హైదరాబాద్‌లోని పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఎంఫార్మసీ అందిస్తోంది. ఈ సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.
    అర్హత: బీఫార్మసీ.
    ప్రవేశం: పీజీఈసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.gprcp.ac.in

Photo Stories