Skip to main content

డి.ఫార్మసీలో ఉద్యోగావకాశాల గురించి వివరించండి?

-రవి కిరణ్, అనంతపురం
Question
డి.ఫార్మసీలో ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
ఫార్మసీ అంటే మందులను తయారుచేయడం, వాటిని సరఫరా చేయడంలో సైన్స్‌ను మేళవించడం. వివిధ రకాలైన మందులపై రోగులకు అవగాహన కల్పించడం ఫార్మసిస్టుల పని. అకడమిక్ విషయానికొస్తే డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ లెవల్స్‌లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఆరేళ్ల డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రాం/ఫార్మ్‌డీ కోర్సు మొదలుపెట్టింది. దీని ద్వారా ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ ఫార్మసీ సర్వీస్‌లో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. మొదటి ఐదేళ్ల కోర్సు అకడమిక్స్‌కు సంబంధించి ఉంటుంది. ఒకేడాది హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తవడంతోనే హెల్త్‌కేర్‌లో ఫార్మసిస్టుల బాధ్యతలు, డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్, డ్రగ్స్ వాడాల్సిన విధానంపై అవగాహన వస్తుంది.

ఫార్మసీ కోర్సును అందించే కొన్ని సంస్థల వివరాలు:
  • దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్.
    వెబ్‌సైట్: www.deccanpharmacy.org.

  • జీఐఈటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, రాజమండ్రి.
    వెబ్‌సైట్: www.gietpharmacy.ac.in.

  • పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, మెదక్.
    వెబ్‌సైట్: www.prip.ac.in

  • ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బెంగళూరు.
    వెబ్‌సైట్: www.msrcp.edu.in

  • అమృతా స్కూల్ ఆఫ్ ఫార్మసీ, అమృతా స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, కోచి
    వెబ్‌సైట్: www.aims.amrita.edu

అర్హత: ఇంటర్మీడియెట్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

ఉద్యోగావకాశాలు: డీఫార్మసీ చేశాక ఎక్స్‌పీరియన్స్, అకడమిక్ అర్హతలు, ఆసక్తి ప్రధాన భూమిక పోషిస్తాయి. ప్రొడక్షన్ సూపర్‌వైజర్, డ్రగ్ ఇన్స్‌పెక్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, క్లినికల్ ఫార్మసిస్ట్, కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లాంటి ఉద్యోగాలు చేయొచ్చు. డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ రీసెర్చ్ బయోటెక్నాలజీ, కెమికల్స్, కాస్మటిక్స్ లాంటి రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. హాస్పిటల్స్, డ్రగ్‌స్టోర్స్, పరిశోధన సంస్థలు, విద్యాసంస్థల్లో ఎన్నో అవకాశాలుంటాయి.

Photo Stories