Skip to main content

జీప్యాట్ పరీక్ష విధానాన్ని వివరించండి?

- ఉదయ్, హైదరాబాద్
Question
జీప్యాట్ పరీక్ష విధానాన్ని వివరించండి?
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ప్రవేశపరీక్ష ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నియమించిన నేషనల్ మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులవడం ద్వారా ఫార్మసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు అర్హత లభిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారు జూనియర్ ఫెలోషిప్‌కు కూడా అర్హులు. సీఎస్‌ఐఆర్ ల్యాబొరేటరీలు, సీఎస్‌ఐఆర్/యూజీసీ స్పాన్సర్ చేస్తున్న ప్రాజెక్టులకు పనీచేసేందుకు అర్హత లభిస్తుంది.

అర్హత: బీఫార్మసీ

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అన్ని వివరాలు పూర్తిచేశాక ఫీజు చెల్లించి, వివరాలు పూర్తిచేసిన ప్రింటవుట్‌తోపాటు ఫీజు చెల్లించిన చలానా, ఫోటోలను జతచేసి జీప్యాట్ ఆఫీసుకు పంపాలి.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. 125 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత ఉంటుంది.
వెబ్‌సైట్: www.gpat.in  

జీప్యాట్‌లో ర్యాంకు ఆధారంగా ఎంఫార్మసీ కోర్సును అందించే సంస్థలు:
  • విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.. ఎంఫార్మసీ కోర్సును అందిస్తోంది. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు:
    ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మా బయోటెక్నాలజీ, ఫార్మ్ అనాలిసిస్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫైటోకెమిస్ట్రీ.
    అర్హత: బీఫార్మసీ ప్రవేశం: జీప్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

  • ఉస్మానియా యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మసీ.. ఎంఫార్మసీ కోర్సును అందిస్తోంది. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్.
    అర్హత: బీఫార్మసీ
    ప్రవేశం: గేట్/జీప్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.osmania.ac.in

Photo Stories