Skip to main content

డీ ఫార్మసీ అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?

- పి.లత, సికింద్రాబాద్
Question
డీ ఫార్మసీ అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
  • మందుల తయారీ, సరఫరా/పంపిణీ బాధ్యతలను ఫార్మసీ చదివిన అభ్యర్థులు నిర్వర్తిస్తారు. వివిధ రకాల మందులపై రోగులకు అవగాహన కల్పిస్తారు.
  • ఒక అకడమిక్ కోర్సుగా దీన్ని అందిస్తున్నారు. డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఆరేళ్ల ఫార్మ్-డీ లేదా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రామ్‌ను ఆరంభించాయి. ఈ ఆరేళ్లలో విద్యార్థులకు ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ ఫార్మసీలో శిక్షణ లభిస్తుంది. మొదటి 5 ఏళ్లు అకడమిక్స్ ఉంటాయి. చివరి సంవత్సరం ఒక హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలి. కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు ఫార్మసిస్ట్ బాధ్యతలు అన్నీ తెలుస్తాయి.

కోర్సును అందిస్తున్న సంస్థలు
  • హైదరాబాద్‌లోని దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ.
    వెబ్‌సైట్: www.deccanpharmacy.org
  • రాజమండ్రిలోని జీఐఈటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ.
    వెబ్‌సైట్: www.gietpharmacy.in
  • మెదక్‌లోని పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ.
    వెబ్‌సైట్: www.gprcp.ac.in
  • బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.
    వెబ్‌సైట్: www.msrcp.edu.in
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

ఉద్యోగావకాశాలు:
కోర్సు పూర్తయ్యాక అకడమిక్ అర్హతలు, పని అనుభవం ద్వారా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. ప్రొడక్షన్ సూపర్‌వైజర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, క్లినికల్ ఫార్మసిస్ట్, కమ్యూనిటీ ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, కెమికల్స్, కాస్మెటిక్స్ వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

Photo Stories