Skip to main content

హార్టీకల్చర్ కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

- ఇందిర, విశాఖపట్నం
Question
హార్టీకల్చర్ కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
Which Institutes offers Horticulture Courses in India
  • హార్టీకల్చర్‌లోబీఎస్సీ(ఆనర్స్)అందించే ఇన్‌స్టిట్యూట్‌లు
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, పశ్చిమ గోదావరి
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, మహబూబ్‌నగర్
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, హైదరాబాద్
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, కడప
అర్హత: ఫిజిక్స్, బయలాజికల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా అగ్రికల్చరల్ సెన్సైస్, అగ్రికల్చర్‌లో వొకేషనల్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ కోర్సు చేసేందుకు అర్హులు.

హార్టీకల్చర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అందిస్తున్న సంస్థలు:
పశ్చిమ గోదావరిలోని డా.వైఎస్సార్ హార్టీకల్చరల్ విశ్వవిద్యాలయం.. ఫ్రూట్ సైన్స్, వెజిటెబుల్ సైన్స్‌లలో ఎంఎస్సీ హార్టీకల్చర్‌ను అందిస్తోంది. ఫ్లోరీకల్చర్, ల్యాండ్‌స్కేపింగ్, స్పైసెస్, మెడిసినల్, ప్లాంటేషన్ క్రాప్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: బీఎస్సీ హార్టీకల్చర్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.drysrhu.edu.in

హిమాచల్‌ప్రదేశ్‌లోని డా.యశ్వంత్ సింగ్ పార్మర్ యూనివర్సిటీ ఆఫ్ హార్టీకల్చర్ అండ్ ఫారెస్ట్రీ.. ఎంఎస్సీ హార్టీకల్చర్‌ను అందిస్తోంది.
బయోటెక్నాలజీ, ఎంటమాలజీ అండ్ ఎపీకల్చర్, ఫ్లోరీకల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ఫ్రూట్ బ్రీడింగ్ అండ్ జెనిటిక్ రిసోర్సెస్, మైకాలజీ అండ్ ప్లాంట్ పాథాలజీ, ఫ్రూట్ సైన్స్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ వెజిటెబుల్ సైన్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: బీఎస్సీ హార్టీకల్చర్/అగ్రికల్చర్
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.yspuniversity.ac.in

Photo Stories