అగ్రికల్చర్ కోర్సులో బ్యాచిలర్స్ డిగ్రీని అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- మణికుమార్, ఖమ్మం.
ఉద్యోగావకాశాలు:
Question
అగ్రికల్చర్ కోర్సులో బ్యాచిలర్స్ డిగ్రీని అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలు అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తున్నాయి.
- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బాపట్ల
- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మడకశిర.
అర్హత: ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
- హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తోంది.
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఎంపీసీ లేదా బైపీసీతో ఇంటర్మీడియెట్/10+2.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.angrau.ac.in
- హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తోంది.
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఎంపీసీ లేదా బైపీసీతో ఇంటర్మీడియెట్/10+2
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.pjtsau.ac.in
- కేరళలోని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.kau.in
- తమిళనాడులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
- ఇదే సంస్థ అగ్రికల్చర్‌లో బీఎస్సీ అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.tnau.ac.in
ఉద్యోగావకాశాలు:
- ఐకార్‌లోని అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులవటం ద్వారా ప్రభుత్వ సంస్థల్లో పరిశోధనలు చేయవచ్చు.
- అగ్రికల్చరల్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించవచ్చు.
- ట్రైనింగ్ ఆర్గనైజర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్ వంటి ఉద్యోగాలను కృషి విజ్ఞాన కేంద్రాలు ఆఫర్ చేస్తున్నాయి.
- రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్, అగ్రికల్చరల్ ఫైనాన్స్ ఆఫీసర్స్ వంటి బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.