Skip to main content

Bishnoi IAS Officer Success Story : ఓ సన్యాసి సాహ‌సం.. ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యారిలా.. కానీ ట్విస్ట్ ఇదే..!

చాలా స‌క్సెస్ స్టోరీలు చ‌దివి ఉంటాం. కానీ ఈ స‌క్సెస్ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది. పూర్తి చ‌దివితే కానీ అర్ధం కాదు. రాజస్థాన్‌కి చెందిన బిష్ణోయ్‌ తెగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
bishnoi ias officer success Story

వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్‌ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన ఈ అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఇంత‌కి ఆమె ఎవ‌రు..? ఈమె పూర్తి సక్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
ఫిబ్రవరి 26, 1996న బికనీర్‌లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్‌ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్‌ బిష్ణోయ్‌ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్‌ పోలీసు అధికారి. ఆమె ఇంటర్‌ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. 

➤☛ IAS Officer Success Story : టీ కొట్టు న‌డుపుతూ.. ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ సొంత అన్న అకాల‌ మరణంతో...!

ఎడ్యుకేష‌న్ :

bishnoi ias officer inspire story

బిష్ణోయ్‌.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్‌ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్‌లోని ఎండీఎస్‌ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్‌  జెఆర్‌ఎఫ్‌ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. 

సివిల్స్‌లో.. ఘోరంగా ఫెయిల్‌.. కానీ 

bishnoi ias officer real life story in telugu

యూపీఎస్సీ సివిల్స్‌ ఎగ్జామ్‌ తొలి రెండు ప్రయత్నాలలో పరి బిష్ణోయ్ ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక బిష్ణోయ్ తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్‌ ఇస్తూ... 2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకున్నారు. 

➤☛ Sankranti Holidays 2025 Extended : గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు..! కార‌ణం ఇదే..!

ఈ భ‌ర్త‌...

bishnoi ias officer real life story in telugu

ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్‌లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు.  తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్‌టక్‌లో ఎస్‌డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది.

పరి విష్ణోయ్‌ బిష్ణోయ్‌ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్‌ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. నేటి యువ‌త‌కు పరి విజ‌యం స్ఫూర్తిదాయకం.

Published date : 08 Jan 2025 08:46AM

Photo Stories