IAS & IPS Recruitements: ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఆ క్యాటగిరి నుంచే ఎక్కువ.. ప్రస్తుతం ఎన్ని ఖాళీలున్నాయంటే..
Sakshi Education
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసుల్లో.. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికవుతున్న వారిలో సగానికి పైగా జనరల్ క్యాటగిరి నుంచే ఉంటున్నారు. ఆ తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ఉన్నారు. 2018-2022 వరకు మొత్తం 1,653 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లుగా నియమితులయ్యారు.
IAS & IPS Recruitements Almost 50% of IAS & IPS Are from general category
కాగా వీరిలో 46.15% (763మంది) సాధారణ క్యాటగిరికి చెందిన వారు కాగా, ఓబీసీకి చెందిన వారు 29.4% (486మంది),షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 16.33 (270మంది),షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 7.83 (134) మంది ఉన్నారు.డీఎంకే ఎంపీ పీ విల్సన్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా ఈ వివరాలను పార్లమెంటుకు వెల్లడించారు.
జనవరి 1, 2024 నాటికి 6,858 IAS పోస్టుల్లో.. 5,542 పోస్టులు భర్తీ కాగా, 5,055 IPS పోస్టుల్లో 4,469 ఖాళీలు భర్తీ అయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 1,316 ఐఏఎస్, 586 ఐపీఎస్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.