Skip to main content

IPS Officer Success Story : నేను కూడా పల్లెటూరి వాడినే.. మా నాన్న ఒక‌ లారీ డ్రైవర్.. ఈ క‌సితోనే చ‌దివి ఐపీఎస్ అయ్యా.. నా సక్సెస్ సీక్రెట్ ఇదే..!

దేశంలో అత్యంత క‌ఠిన‌మైన ప‌రీక్ష‌ల్లో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్ ఒక‌టి. ఇలాంటి ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించి... ఉద్యోగం సాధిస్తే.. జీవితం ఉన్న‌తస్థాయిలో ఉన్న‌ట్టే. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినా ఎలాగైనా.. సివిల్ సర్వీస్‌లో చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యాడు కార్తికేయన్.
karthikeya ips officer success story

త‌మిళ‌నాడులోని సేలం జిల్లా అత్తూరు సమీపంలోని ఎట్టాపూర్ గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఐపీఎస్ అధికారి అయ్యాడు. ఈ నేప‌థ్యంలో ఐపీఎస్ ఆఫీస‌ర్ కార్తికేయన్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం : 
కార్తికేయన్ తండ్రి ఒక‌ లారీ డ్రైవర్. ఇత‌ని కుటుంబం తండ్రి ఆదాయంపై ఆధారపడి జీవించారు. దీంతో కార్తికేయ ఎలాగైనా మంచిగా చదువుకుని ఉన్న‌త స్థాయికి రావాలని తహతహలాడాడు.

☛➤ Group-4 Rankers Success Stories : ఇలాంటి పనులు చేస్తూనే.. గ్రూప్‌-4 ఉద్యోగం కొట్టామిలా.. కానీ..!

ఎడ్యుకేష‌న్‌.. :
కార్తికేయ 12వ తరగతిలో మంచి మార్కులు రావడంతో.. కోయంబత్తూరులోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో చేరి బీటెక్ చదివాడు. కార్తికేయ ఎప్ప‌టి నుంచో.. ఎలాగైనా యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌లో చేరాలనుకున్నాడు. అయితే స‌రైన‌ సౌకర్యాలు లేక‌.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో చేరాడు. ఆ తర్వాత చెన్నైలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చేరి ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు చదివాడు.

ఖర్చుల కోసం..
కార్తికేయ సోదరుడు విఘ్నేష్ కూడా కుటుంబ ఖర్చుల కోసం ఐటీ కంపెనీలో చేరాడు. దీంతో యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిప‌రేష‌న్‌పై పూర్తి శ్రద్ధపెట్టి చ‌దివిన‌ కార్తికేయ.. చివ‌రికి 2017 సివిల్స్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ అనుకున్న ఐపీఎస్ రాలేదు. ఇంతలోనే రైల్వే డిపార్ట్‌మెంట్‌లోని డిఫెన్స్ ఫోర్స్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ సెక్యూరిటీగా పనిలో చేరాడు. తర్వాత దక్షిణ రైల్వే మధురై డివిజన్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కమిషనర్‌గా బదిలీ అయ్యారు. 

ఎలాగైన ఐపీఎస్ ఆఫీస‌ర్ కావాలని..
కానీ ఎలాగైన‌ ఐపీఎస్ ఆఫీస‌ర్‌ కావాలనే పట్టుదలతో.. ఏడాదిన్నర పాటు చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి మళ్లీ యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యాడు. కానీ సెలవులో ఉన్నందున జీతం రాలేదు. దీంతో అతని భార్య ఉద్యోగంకు వెళ్లి కుటుంబ ఖర్చులు చూసుకుంది. యూపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో 579వ స్థానం, తమిళనాడు స్థాయిలో 27వ స్థానం సాధించి.. ఎట్ట‌కేల‌కు ఐపీఎస్‌ అధికారి అయ్యాడు.

➤☛ Success Story : అక్క‌.. త‌మ్ముడు.. అమ్మ ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

రోజు ఇలా చ‌దివా...
నేను కూడా పల్లెటూరి వాడినే. కష్టపడితే చ‌దివితే ఏ ప‌రీక్ష‌లోనైన‌ ఉత్తీర్ణత సాధించవచ్చని కార్తికేయ చెప్పాడు. నేను రోజుకు 7-8 గంటలు చదివాను. ఎలాంటి ఆటంకాలు వ‌చ్చిన ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చ‌దివితే.. అందరూ పాస్ అవుతారు. మ‌నం ఊరి నుంచి వచ్చాం.. మనం తమిళ మీడియం మాత్రమే చదివామన్నదే ముఖ్యం కాదు. మ‌నం ఎంత క‌ష్ట‌ప‌డి చ‌దివాం అనేది ఇక్క‌డ ముఖ్యం.

Published date : 23 Nov 2024 05:58PM

Photo Stories