Skip to main content

UPSC Civils New Rule 2025 : యూపీఎస్సీ సివిల్స్ కొత్త రూల్స్ ఇవే.. ఇక‌పై ఈ సర్టిఫికెట్స్ కావాల్సిందే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌స్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (UPSC) ఇటీవ‌లే 979 సివిల్ సర్వీసెస్‌, 150 ఐఎఫ్ఎస్‌ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. అయితే.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
Union Public Service Commission recruitment updates  UPSC Civil Services and IFS exam guidelines UPSC Civils New Rule 2025  UPSC Civil Services notification 2025 details

సివిల్స్ అప్లై చేసుకునే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేసింది.

గ‌తంలో అయితే..
గ‌తంలో  యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తమ వయసు, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించేవాళ్లు. ఆ సమయంలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా యూపీఎస్సీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

➤☛ UPSC Civil Services Exam 2025 : 979 పోస్టుల భ‌ర్తీకి... యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్ విడుద‌ల‌... ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

ఈ సర్టిఫికెట్స్ కావాల్సిందే...
యూపీఎస్సీ సివిల్​ సర్వీసెస్​ ఎగ్జామ్ రూల్స్-2025 ప్రకారం... ద‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడు పుట్టిన తేదీ, కులం లేదా వర్గం (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, దివ్యాంగులు, మాజీ సైనికులు), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్​ వివరాలను కచ్చితంగా పేర్కొనాలి. అలాగే వాటిని రుజువు చేసే పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తుతోపాటు ఈ పత్రాలు సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.

➤☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Published date : 25 Jan 2025 03:11PM

Photo Stories