Free Coaching For Groups And Bank Exams: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్.. ఇదే చివరి తేది
Sakshi Education
భూపాలపల్లి రూరల్: గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఉచిత శిక్షణ కోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Free Coaching For Groups And Bank Exams
జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువతీ యువకులు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి కార్యాలయం, కలెక్టరేట్, రూమ్ నంబర్ 5లో సంప్రదించాలన్నారు.