Skip to main content

UPSC Civil Services Exam 2025 : 979 పోస్టుల భ‌ర్తీకి... యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్ విడుద‌ల‌... ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : 979 పోస్టుల‌కు యూనియన్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) సివిల్‌ సర్వీసెస్ 2025 ప‌రీక్ష‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
UPSC Civil Services Exam 2025 Notification   UPSC Civil Services 2025 Notification Released  UPSC Civil Services 2025 Online Application Dates

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ పోస్టుల‌కు 21 ఏళ్ల‌ నుంచి 32 మధ్య వ‌యోప‌రిమితి ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది.

ప‌రీక్ష తేదీలు ఇవే..
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు మ‌రో నోటిఫికేషన్‌ విడుదల చేసింది యూపీఎస్సీ. ఈ పరీక్షకు కూడా ఫిబ్రవరి 11వ తేదీ దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు.

యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు ఇవే...

Published date : 23 Jan 2025 08:33AM
PDF

Photo Stories