Skip to main content

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాలు మంజూరు వీరికి మాత్ర‌మే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో... ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
Telangana CM Revanth Reddy launching Rajiv Yuva Vikasam scheme   rajiv yuva vikasam scheme guidelines   Telangana CM Revanth Reddy launching Rajiv Yuva Vikasam scheme

రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందేందుకు రూ.4 లక్షల వరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇందులో 80% వరకు రుణ రాయితీ కూడా ఉంది. 

కావాల్సిన ప‌త్రాలు ఇవే..
ప్రధానంగా.. ఆధార్ కార్డు, పాన్ కార్డు దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లబ్ధిదారుని ఫోన్ నెంబర్‌, ఆదాయ ధ్రువీకరణ, రేషన్‌ కార్డు కూడా కలిగి ఉండాలి. అయితే రాజీవ్‌ యువ వికాసం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం కుటుంబంలోని ఒకరికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. 

https://tgobmms.cgg.gov.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2వ తేదీ లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జాబితాను విడుదల చేస్తారు. రూ.2 లక్షల వరకు రుణం పొందితే 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంటే 70 శాతం వరకు ప్రభుత్వ రాయితీ పొందుతారు.

రుణాలు మంజూరు వీరికే..
ఎడ్ల బండ్లు, ఆయిల్ ఇంజిన్ పంప్ సెట్, ఎయిర్ కంప్రెసర్, పత్తి సేకరణ యంత్రం, వేరుశనగ మిషన్, వర్మీ కంపోస్ట్, ఆయిల్ ఫామ్ వంటి ఉపాధి వ్యవసాయ అంశాలకు సంబంధించిన అంశాల్లో ఈ రుణాలు అందిస్తారు. పశుపోషణకు సంబంధించి గేదెలు, ఆవుల పెంపకం, డైరీ ఫార్మ్, కోడిగుడ్ల వ్యాపారం, చేపలు మేకల పెంపకం, పాల వ్యాపారం, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కులాల నిరుద్యోగులకు సొంత వ్యాపారం చేసుకునే ఈ అవకాశం కల్పించారు.

ఆటోమొబైల్ షాప్ నిర్వహణ, స్టీల్ వ్యాపారం, ఎయిర్ కూలర్, గాజుల దుకాణంతోపాటు హెయిర్ కటింగ్ షాపు, బ్యూటీ పార్లర్, బట్టల తయారీ, జనరల్ స్టోర్, ఇటుకల తయారీ, డిష్, టీవీ, వడ్రంగి సీసీ కెమెరాలు రిపేర్ షాప్, ఇది కాకుండా గోల్డ్ షాప్, జనరేటర్ షాప్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్, లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్, లేడీస్ కార్నర్, మినీ సూపర్ బజార్, మటన్, చికెన్ షాప్, పేపర్ బ్యాగులు తయారీ వరకు... పై వ్యాపారాలు చేసుకునేందుకు ఈ రుణాలను అందిస్తోంది. ఎంపికైన నిరుద్యోగులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన నిధులు మంజూరు చేస్తారు.

Published date : 28 Mar 2025 03:37PM

Photo Stories