Skip to main content

Infosys Jobs : ఇన్ఫోసిస్‌లో 17000 ఉద్యోగాలు.. అలాగే మ‌రో 46000 పోస్టుల‌కు...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు మ‌ళ్లీ ఊపువ‌చ్చింది. కొత్త‌గా ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాయి.. వివిధ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు. ఇటీవ‌లే టీసీఎస్ ఈ ఏడాది భారీగా ఉద్యోగాల‌ను రిక్రూట్​మెంట్ చేసుకుంటామని తెలిపిన విష‌యం తెల్సిందే.
Infosys Jobs   Infosys recruitment announcement 2025 Software job opportunities in India  New IT job announcements in India

అయితే ఇప్పుడు తాజాగా ఇన్ఫోసిస్ కొత్త‌గా 17000 మందిని రిక్రూట్​మెంట్ చేసుకుంటామ‌ని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం...
తెలంగాణాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) మరింత విస్తరించనుంది. దీని కోసం కంపెనీ దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే పోచారం క్యాంపస్‌ను విస్తరించనున్నట్లు, తద్వారా 17,000 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. 

☛➤ TS TET 2025 Results : టెట్-2025 ఫ‌లితాలు.. మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల ఎప్పుడంటే...?

రూ.750 కోట్ల పెట్టుబడితో..
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ ఐటీ మినిష్టర్ శ్రీధర్ బాబుతో.. ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్ భేటీ అయ్యారు. ఈ బేటీ తరువాత... ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన‌ ప్రకటన చేశారు. పోచారం క్యాంపస్‌ విస్తరణ ప్రణాళికలో భాగంగానే ఫేజ్ 1లో రూ.750 కోట్ల పెట్టుబడితో.. కొత్త ఐటీ భవనాలను నిర్మించనున్నారు.

☛➤ RRB Group D Jobs 2025 Full Details : రైల్వేలో 32,438 ఉద్యోగాల‌కు అర్హ‌త‌లు ఇవే.. ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. కానీ జీతం మాత్రం..

46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు...
తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రికార్డ్ ఒప్పందాలు చేసుకున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దావోస్ వేదికగా ఇదే రికార్డ్ కావటం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీథర్ బాబు ఆధ్వర్యంలోని బృందం ఏకంగా 10 ఒప్పందాలు చేసుకున్నది. పెట్టుబడుల విలువ అక్షరాల ఒక లక్షా 32 వేల కోట్లు అయితే ఈ పెట్టుబడుల వల్ల 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడుల రికార్డ్ నమోదైంది.

☛➤ TGPSC Again Group-1, 2 Notification 2025 : మే నెలలో 450 గ్రూప్‌-1, 700 గ్రూప్స్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌...? ఇంకా ఈ పోస్టుల‌కు..

Published date : 24 Jan 2025 09:59AM

Photo Stories